తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

Songs by:Samuel Varaprasad

నా వేదనలో నా బాధలో|Naa Vedhanalo Naa Baadhalo

నా వేదనలో నా బాధలో / నే కృంగిన వేళలో – నా తోడైయున్నావు (2) / నన్ను నడిపించు నా యేసయ్యా / నాకు తోడైయుండు నా ప్రభువా (2) / నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా ||నా వేదనలో|| / నా అన్న వారే నను మరిచారయ్యా / అయినవారే నన్ను అపహసించినారయ్య / నా కన్న వారిని నే కోల్పోయినా / నా స్వంత జనులే నన్ను నిందించినా / కన్నీటిని తుడిచి కౌగిలించినావు / కృప చూపి నన్ను రక్షించినావు (2) / నన్ను నడిపించు నా యేసయ్యా / నాకు తోడైయుండు నా ప్రభువా (2) / నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా ||నా వేదనలో|| / ఇహలోక శ్రమలన్ని ఎన్నదగినవి కావని / ప్రభునందు నా ప్రయాస వ్యర్ధమే కాదని (2) / నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తేనని / చావైతే నాకది ఎంతో మేలని (2) / నా కన్నులెత్తి నీ వైపుకే / నిరీక్షణతో చూచుచున్నాను (2) / నీయందే నే బ్రతుకుచున్నాను ||నా వేదనలో||