ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
8 songs found|By Alphabet|By Popularity
చాచిన చేతులు నీవే / అరచేతిలో చెక్కినావే / కమ్మని అమ్మవు నీవే / కాచిన తండ్రివి నీవే / నీలా ఎవరు ప్రేమిస్తారు / నాకై ప్రాణం అర్పిస్తారు / కన్నీళ్లు తుడిచి కరుణిస్తారు / కళ్ళార్పకుండా కాపాడతారు ||చాచిన|| / కొండలు గుట్టలు చీకటి దారులు / కనిపించదే కళ్ళు చిట్లించినా / కారాలు మిరియాలు నూరేటి ప్రజలు / అన్నారు పడతావొక్క అడుగేసినా / రక్షించే వారే లేరని / నీ పనైపోయిందని (2) / అందరు ఒక్కటై అరచేసినా / అపవాదులెన్నో నాపై మోపేసినా (2) / నీ చేయి చాచేసి చీకటిని చీల్చేసి / శత్రువును కూల్చేసి నిలబెట్టినావు ||చాచిన|| / పేదోడు పిరికోడు ప్రభు సేవకొచ్చాడు / అవమానపడతాడని నవ్వేసినా / చిన్నోడు నీవంటూ అర్హత లేదంటూ / అయినోళ్లు కానోళ్లు చెప్పేసినా / నీవెంత నీ బ్రతుకెంతని / నిలువలేవు నీవని (2) / అందరు ఒక్కటై తేల్చేసినా / కూల్చేయాలని నన్ను కృషిచేసినా (2) / నీ ఆత్మతో నింపేసి నిరాశను కూల్చేసి / నా గిన్నె నింపేసి నడిపించినావు ||చాచిన||
కలలా ఉన్నది నేనేనా అన్నది / నిజమౌతున్నది నీవు నాతో అన్నది / నిరాశల నిశిలోన – ఉషోదయం వచ్చింది / యేసు నీ ప్రేమే నను బ్రతికించెను (2) ||కలలా|| / మనుష్యులంతా మనసే గాయపరిచి / పురుగల్లె నను నలిపేయ జూచినా (2) / శూరుడల్లె వచ్చినావు / నాకు ముందు నిలచినావు / నాకు బలము ఇచ్చినావు / ఆయుధంగా మార్చినావు / చల్లని నీ నీడలో నిత్యము నిలువనీ ||కలలా|| / శూన్యములో నాకై సృష్టిని చేసి / జీవితాన్ని అందముగా మలచేసి (2) / మాట నాకు ఇచ్చినవారు / దాన్ని నెరవేర్చువారు / నిన్ను పోలి ఎవరున్నారు / నన్ను ప్రేమించువారు / యేసు నీ ప్రేమను ప్రతి దినం పాడనీ ||కలలా||
నిను చేరగ నా మది ధన్యమైనది / నిను తలచి నా హృదయం నీలో చేరినది (2) / నీవలె పోలి నే జీవింతును / నీ కొరకై నా ప్రాణం అర్పింతును (2) / నీతోనే నా ప్రాణం – నీతోనే నా సర్వం (2) / నది లోతులో మునిగిన ఈ జీవితమును / తీరం చేర్చావు – నీ కొరకు నీదు సాక్షిగా నిలిపావు / ఏమిచ్చి నీ ఋణమును తీర్చుకోనయ్యా – (2) ||నిను చేరగ||
అన్నయ్య… తెల్లారింది లేరా.. / తెల్లారింది వేళ – త్వరగా నిద్దుర లేరా / మనమంతా ఆయన సృష్టే రా / పక్షుల కోలాహ వేళ – ప్రభువును స్తుతించావేరా / వాటి కంటె శ్రేష్ఠుల మనమేరా (2) / అడవి రాజు సింహమైననూ – ఆకలంటు పిల్లలన్ననూ / యేసు రాజు పిల్లలం మనం – పస్తులుంచునా (2) / వాడిపోవు అడవి పూలకు – రంగులేసి అందమిచ్చెను / రక్తమిచ్చి కొన్న మనలను – మరచిపోవునా (2) / మరచిపోవునా ||తెల్లారింది|| / చిన్నదైన పిచ్చుకైననూ – చింత ఉందా మచ్ఛుకైననూ / విత్తలేదు కోయలేదని – కృంగిపోవునా (2) / వాటికన్ని కూర్చువాడు – నీ తండ్రి యేసేనని / నీకు ఏమి తక్కువ కాదని – నీకు తెలియునా (2) / నీకు తెలియునా ||తెల్లారింది||
నీ అరచేతిలో చెక్కుకుంటివి నను ప్రభువా / నీ నీడలో దాచుకుంటివి నను దేవా (2) / నీ రెక్కల చాటున దాగుకొని నిను కీర్తించెదను / నీవు చేసిన మేల్లను తలచుచునే ఇల జీవించెదను / నాకన్ని నేవే దేవా / నా బ్రతుకు నీకే ప్రభువా (2) / దీపముగా నీ వాక్యాన్నిచ్చి / తిన్నని త్రోవలో నన్ను నడిపి / నాకు ముందుగా నీవే నడచి / జారిపడకుండా కాపాడితివి / కొండ తేనెతో నన్ను తృప్తి పరచి / అతి శ్రేష్టమైన గోధుమలిచ్చి / ఆశ్చర్య కార్యాలెన్నో చేసితివి – (2) ||నాకన్ని|| / ఆత్మ శక్తితో నన్ను అభిషేకించి / అంధకార శక్తులపై విజయాన్నిచ్చి / ఆశ్చర్య కార్యములెన్నో చేసి / శత్రువుల యెదుట భోజనమిచ్చి / ఎక్కలేని కొండలు ఎక్కించితివి / నా గిన్నె నిండి పార్ల చేసియితివి / నీ ఆత్మతో నన్ను అభిషేకించితివి – (2) ||నాకన్ని||
నీవు లేని రోజు అసలు రోజే కాదయా / నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా (2) / నీవే లేకపోతే నేనసలే లేనయా (2) ||నీవు లేని|| / బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు / నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు (2) / నన్ను విడువనన్నవు – నా దేవుడైనావు (2) ||నీవే|| / ఈ నాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే / నేను కలిగియున్నవన్ని నీదు కృపా భాగ్యమే (2) / నీవు నా సొత్తన్నావు – కృపాక్షేమమిచ్చావు (2) ||నీవే||
కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా / మనసున్న మారాజేసుని మదిలో నిలుపుమా (2) / విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను / కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును (2) / విడువడు నిన్ను / రాతిరంత ఏడుపొచ్చినా – కంట నీరు ఆగకుండినా / కాలమింక మారకుండునా – వెలుగు నీకు కలగకుండునా / ప్రాణమిచ్చి ప్రేమ పంచినా – పేరు పెట్టి నిన్ను పిలచినా / నీ చేయి పట్టి విడచునా – అనాథగా నిన్ను చేయునా ||విడువడు|| / అంధకారమడ్డు వచ్చినా – సంద్రమెంత ఎత్తు లేచినా / నిరాశలే పలకరించినా – క్రీస్తు ప్రేమ నిన్ను మరచునా / బాధ కలుగు దేశమందునా – బంధకాలు ఊడకుండునా / శత్రువెంతో పగతో రగిలినా – గిన్నె నిండి పొర్లకుండునా ||విడువడు||
కన్నీరేలమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా / కలవరపడకమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా / కరుణ చూపి కలత మాన్పె (2) / యేసే తోడమ్మా ||కన్నీరేలమ్మా|| / నీకేమీ లేదని ఏమీ తేలేదని / అన్నారా నిన్ను అవమాన పరిచారా / తల రాత ఇంతేనని తర్వాత ఏమౌనోనని / రేపటిని గూర్చి చింతించుచున్నావా / చింతించకన్న యేసు మాటలు మరిచావా / మారాను మధురంగా మార్చెను చూసావా (2) ||కన్నీరేలమ్మా|| / నీకెవరూ లేరని ఏం చేయలేవని / అన్నారా నిన్ను నిరాశపరచారా / పొరుగంటివాడనని ఎప్పటికీ ఇంతేనని / నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా / నేనున్నానన్న యేసు మాటలు మరిచావా / కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా (2) ||కన్నీరేలమ్మా||