ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1 song found|By Alphabet|By Popularity
ఆధారం నీవేనయ్యా (2) / కాలం మారినా కష్టాలు తీరినా / కారణం నీవేనయ్యా / యేసయ్యా కారణం నీవేనయ్యా ||ఆధారం|| / లోకంలో ఎన్నో జయాలు / చూసాను నేనింత కాలం (2) / అయినను ఎందుకో నెమ్మది లేదు (2) / సమాధానం కొదువైనది / యేసయ్యా సమాధానం కొదువైనది ||ఆధారం|| / ఐశ్వర్యం కొదువేమి లేదు / కుటుంబములో కలతేమి లేదు (2) / అయినను ఎందుకో నెమ్మది లేదు (2) / సమాధానం కొదువైనది / యేసయ్యా సమాధానం కొదువైనది ||ఆధారం|| / నీ సేవకునిగా జీవింప / హృదయంలో ఉన్నకోర్కెలను (2) / హృదయము నిచ్చావు నెమ్మది నొందా (2) / సాక్షిగా జీవింతును / హల్లేలూయ సాక్షిగా జీవింతును ||ఆధారం||