తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

Songs by:Raj Prakash Paul

12 songs found|By Alphabet|By Popularity

శ్రమయైనా బాధైనా|Shramayainaa Baadhainaa

శ్రమయైనా బాధైనా – హింసలెన్ని ఎదురైనా / క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదీ ఎడబాయదు / ఖడ్గమే ఎదురైనా – శోధనలు ఎదురైనా / క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదీ ఎడబాయదు / నా రాజు వచ్చుచున్నాడు – భీకరుడై వచ్చుచున్నాడు – (2) / సర్వోన్నతుడు మేఘారూఢిగా – తీర్పును తీర్చ రానున్నాడు / ఎదురేలేని కొదమసింహం – మహా ఉగ్రతతో రానున్నాడు / ఎవరు? ఎవరు? ఎవరు? ఎవరు? / ఎవరు? ఎవరు?ఎవరు? ఎవరు? / శౌర్యుడు ధీరుడు వీరుడు శూరుడు / యోగ్యుడు శ్రేష్ఠుడు అర్హుడు ఘనుడు / అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు – సర్వము చేసిన సృష్టికర్త / మహోన్నతుడు మహేశ్వరుడు – సర్వము గెలిచిన సర్వేశ్వరుడు / దేవాది దేవుడు రాజాధి రాజు – ప్రభువుల ప్రభువు నిత్య దేవుడు / విశ్వాసమే నా బలము – నిత్యజీవము చేపట్టుటే నా భాగ్యము / శ్రమలేలేని బాధేలేని – ఆ లోకంలో నిరంతరం జీవింతును / విమోచకుడు సజీవుడు – నా కనులారా నే చూచెదను / యుగయుగములకు మహారాజునితో – పాలించుటకే పోరాడెదను / ఓ క్రైస్తవా సోలిపోకుమా – తీర్పు నుండి నీ ఆత్మను తప్పించుకో / మోసపోకుమా జారిపోకుమా – నీ రక్షణన్ జాగ్రత్తగా కాపాడుకో / మంచి పోరాటం నువ్వు పోరాడు – నీ పరుగునే కడముట్టించు / విశ్వాసమును కాపాడుము – యేసుని చేర వెయ్యి ముందడుగు ||శ్రమయైనా||

నీ కృప చాలును|Nee Krupa Chaalunu

నీ కృప చాలును / నీ ప్రేమ చాలును / నీవు నాకు తోడుంటే చాలును యేసు (2) / నీవు లేని జీవితం అంధకార బంధురం (2) / నీవు నాకు తోడుంటే చాలును యేసు (2) / శోధనలు ఎన్నియో వేదనలు ఎన్నియో / నన్ను కృంగదీయు సంకటములెన్నియో (2) / నీ ప్రేమ వర్షం నా స్థితిని మార్చెగా (2) / నా జీవితాంతము నీలోనే నిలిచెదన్ / నా జీవితాంతము నీతోనే నడిచెదన్ / నీవు నాకు తోడుంటే చాలును యేసు (2) / నా ప్రేమ గీతం – నా దీన ప్రార్ధన / నా హృదయ ఆలాపన అందుకో దేవా (2) / నిను పోలి నేను ఈ లోకమందు / నీ సాక్షిగాను నీ మహిమ చాటెదన్ (2) / నీ దివ్య వాక్యం ఈ జగాన చాటెదన్ / నీ ఆత్మ అభిషేకం నాకు నొసగు దేవా (2) / నా ప్రేమ గీతం – నా దీన ప్రార్ధన / నా హృదయ ఆలాపన అందుకో దేవా (2)

యుగయుగాలు మారిపోనిది|Yugayugaalu Maariponidhi

యుగయుగాలు మారిపోనిది / తరతరాలు తరిగిపోనిది / ప్రియ యేసు రాజు నీ ప్రేమా / నిను ఎన్నడు వీడిపోనిది / నీకు ఎవ్వరు చూపలేనిది / ఆశ్చర్య అద్భుత కార్యమ్ము చేయు ప్రేమది / హద్దే లేని ఆ దివ్య ప్రేమతో / కపటమే లేని నిస్స్వార్ధ్య ప్రేమతో / నీ కోసమే బలి అయిన దైవము రా (2) / లోకంతో స్నేహమొద్దు రా / చివరికి చింతే మిగులు రా / పాపానికి లొంగిపోకు రా / అది మరణ త్రోవ రా (2) / నీ దేహం దేవాలయము రా / నీ హృదయం క్రీస్తుకి కొలవురా (2) / తను చేసిన మేలు ఎట్టిదో / యోచించి కళ్ళు తెరువరా / జీవమునకు పోవు మార్గము / క్రీస్తేసుని ఆలకించారా (2) / నీ ముందర పందెము చూడరా / విశ్వాసపు పరుగులో సాగరా (2)

ఎంత ప్రేమ యేసయ్యా|Entha Prema Yesayyaa

ఎంత ప్రేమ యేసయ్యా – ద్రోహినైన నా కొరకు / సిలువలో ఆ యాగము చేసావు – రక్తము కార్చావు / ఎందుకు ఈ త్యాగము – పాపినైన నా కొరకు / సిలువలో ఆ యాగము నొందను – రక్తము చిందను / సురూపమైనా సొగసైనా లేకపోయెను (2) / యేసు నిలువెల్ల రక్త ధారలు కారిపోయెను (2) / నలిగిపోయెను – విరిగిపోయెను / ఎంత శ్రమను ఎంత బాధను / అనుభవించినాడే విభుడు (2) / మనకు క్షమాపణ ఇచ్చెను / అభయము కలుగజేసెను / హింసింపబడి దూషింపబడి / హింసింపబడి దూషింపబడెను / కరుణతో నను రక్షింప / నా కోసమే ఈ యాగమా ||ఎంత ప్రేమ|| / సమస్తము సంపూర్ణమాయెను / జీవముకై మార్గము తెరిచెను (2) / అపవాదిని అణచివేసి / మరణ ముల్లును విరచి వేసెను / విజయశీలుడై తిరిగి లేచెను / పరిశుద్ధాత్మను తోడుగా ఇచ్చెను / పునరుత్తానుడు మనకు తోడుగా నిత్యము నిలచే

ప్రియతమ బంధమా|Priyathama Bandhamaa

ప్రియతమ బంధమా – నా హృదయపు ఆశ్రయ దుర్గమా / అనుదినం అనుక్షణం – నీ ఒడిలో జీవితం ధన్యము / కృతజ్ఞతతో పాడెదను / నిరంతరము స్తుతించెదను ||ప్రియతమ|| / అంధకారపు సమయములోన – నీతి సూర్యుడై ఉదయించావు / గమ్యమెరుగని పయనములోన – సత్య సంధుడై నడిపించావు (2) / నా నిరీక్షణ ఆధారం నీవు / నమ్మదగిన దేవుడవు నీవు (2) / కరుణ చూపి రక్షించినావు / కరుణామూర్తి యేసు నాథా (2) / వందనం వందనం దేవా – వందనం వందనం / అనుదినం అనుక్షణం నీకే నా – వందనం వందనం ||కృతజ్ఞతతో|| / పరమ తండ్రివి నీవేనని – పూర్ణ మనసుతో ప్రణుతించెదను / పరిశుద్ధుడవు నీవేనని – ప్రాణాత్మలతో ప్రణమిల్లెదను (2) / విశ్వసించిన వారందరికి / నిత్య జీవము నొసగె దేవా (2) / కరుణ చూపి రక్షించినావు / కరుణామూర్తి యేసు నాథా (2) / వందనం వందనం దేవా – వందనం వందనం / అనుదినం అనుక్షణం నీకే నా – వందనం వందనం ||కృతజ్ఞతతో||

నీతో నుండని బ్రతుకు|Neetho Nundani Brathuku

నీతో నుండని బ్రతుకు – నిను చూడని క్షణము / ఊహించలేను నా యేసయ్యా / నిను చూడని క్షణము – నీతో నుండని బ్రతుకు / ఊహించలేను నా యేసయ్యా (2) / నీదు స్వరము వినకనే నేను / నిను విడచి తిరిగితి నేను / నాదు బ్రతుకులో సమస్తము కోలిపొయితి (2) ||నిను|| / నీ దివ్య ప్రేమను విడచి – నీ ఆత్మ తోడు త్రోసివేసి / అంధకార త్రోవలో నడచి – నీ గాయమే రేపితిని (2) / అయినా అదే ప్రేమ – నను చేర్చుకున్నప్రేమ / నను వీడని కరుణ – మరువలేనయ్యా యేసయ్యా ||నీతో|| / నను హత్తుకున్న ప్రేమ – నను చేర్చుకున్న ప్రేమ / నీ వెలుగులోనే నిత్యం – నే నడిచెదన్ (2) / నను విడువకు ప్రియుడా – నాకు తోడుగా నడువు / నీతోనే నా బ్రతుకు – సాగింతును యేసయ్యా ||నిను||

యెహోవా నీదు మేలులను|Yehovaa Needu Melulanu

యెహోవా నీదు మేలులను – ఎలా వర్ణింపగలను / కీర్తింతును నీదు ప్రేమను – దేవా అది ఎంతో మధురం / దైవం నీవయ్యా పాపిని నేనయ్యా / నీదు రక్తముతో నన్ను కడుగు / జీవం నీవయ్యా జీవితం నీదయ్యా / నీదు సాక్షిగా నన్ను నిలుపు / కారణ భూతుడా పరిశుద్ధుడా / నీదు ఆత్మతో నన్ను నింపు / మరనాత యేసు నాథా / నీదు రాజ్యములో నన్ను చేర్చు / ఘనుడా సిల్వ ధరుడా / అమూల్యం నీదు రుధిరం (2) ఓ… / నిన్ను ఆరాధించే బ్రతుకు ధన్యం / నీతో మాట్లాడుటయే నాకు భాగ్యం / ఓ మహోన్నతుడా నీకే స్తోత్రం / సర్వోన్నతుడా నీకే సర్వం ||యెహోవా|| / ప్రియుడా ప్రాణ ప్రియుడా / వరమే నీదు స్నేహం (2) / నా రక్షణకై పరమును వీడే / నా విమోచనకై క్రయ ధనమాయె / ఓ మృత్యుంజయుడా నీకే స్తోత్రం / పరమాత్ముడా నీకే సర్వం ||యెహోవా||