ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1 song found|By Alphabet|By Popularity
యేసయ్య నామము నా ప్రాణ రక్ష / గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష (2) / నాశనకరమైన తెగులుకైనా / భయపడను నేను భయపడను (2) ||యేసయ్య|| / రోగ భయం – మరణ భయం / తొలగిపోవును యేసు నామములో (2) ||యేసయ్య|| / అపాయమేమియు దరికి రాదు / కీడేదియు నా గదికి రాదు (2) ||యేసయ్య|| / పరలోక సేన నన్ను కాయును / పరలోక తండ్రి నా తోడుండును (2) ||యేసయ్య|| / యేసుని నామమే స్తుతించెదము / వ్యాధుల పేరులు మరిచెదము (2) ||యేసయ్య||