ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1 song found|By Alphabet|By Popularity
యెహోవ నా మొర లాలించెను / దన మహా దయను నను గనించెను / అహర్నిశల దీనహీనుడగు నా / దు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను ||యెహోవ|| / పిశాచి గడిమి బడగొట్టెను / దన వశాన నను నిలువ బెట్టెను / ప్రశాంత మధుర సు విశేష వాక్ఫల / నిశాంతమున జే ర్చి సేద దీర్చెను ||యెహోవ|| / మదావలము బోలు నా మదిన్ / దన ప్రదీప్త వాక్యం కూశా హతిన్ / యధేచ్చలన్నిటి గుదించి పాపపు / మొదల్ తుదల్ నరి కి దరికి జేర్చెను ||యెహోవ|| / అనీతి వస్త్ర మెడలించెను / యే సునాథు రక్తమున ముంచెను / వినూత్న యత్నమే ద నూని యెన్నడు / గనన్ వినన్ బ్రే మ నాకు జూపెను ||యెహోవ|| / విలాపములకు జెవి నిచ్చెను / శ్రమ కలాపములకు సెలవిచ్చెను / శిలానగము పై కిలాగి నను సుఖ / కళావళుల్ మన సులోన నిలిపెను ||యెహోవ|| / అగణ్య పాపియని త్రోయక / న న్ను గూర్చి తన సుతుని దా చక / తెగించి మృతి కొ ప్పగించి పాపపు / నెగుల్ దిగుల్ సొగ సుగా నణంచెను ||యెహోవ||