ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1 song found|By Alphabet|By Popularity
మంగళమే యేసునకు – మానుజావతారునకు (3) / శృంగార ప్రభువునకు (2) / క్షేమాధిపతికి మంగళమే ||మంగళమే|| / పరమ పవిత్రునకు – వర దివ్య తేజునకు (3) / నిరుపమానందునకు (2) / నిపుణ వేద్యునకు మంగళమే ||మంగళమే|| / దురిత సంహారునకు – వర సుగుణోదారునకు (3) / కరుణా సంపన్నునకు (2) / జ్ఞాన దీప్తునకు మంగళమే ||మంగళమే|| / సత్య ప్రవర్తునకు – సద్ధర్మ శీలునకు (3) / నిత్య స్వయంజీవునకు (2) / నిర్మలాత్మునకు మంగళమే ||మంగళమే|| / యుక్త స్తోత్రార్హునకు – భక్త రక్షామణికి (3) / సత్య పరంజ్యోతి యగు (2) / సార్వభౌమునకు మంగళమే ||మంగళమే|| / నర ఘోర కలుషముల – నురుమారంగ నిల (3) / కరుదెంచిన మా పాలి (2) / వర రక్షకునకు మంగళమే ||మంగళమే|| / పరమపురి వాసునకు – నర దైవ రూపునకు (3) / పరమేశ్వర తనయునకు (2) / బ్రణుతింతుము నిన్ను మంగళమే ||మంగళమే||