ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
4 songs found|By Alphabet|By Popularity
ఏ యోగ్యతా లేని నన్ను ఎందుకు ఎన్నుకున్నావు / ఏ అర్హతా లేని నన్ను ఎందుకు ప్రత్యేకించావు (2) / ఏముంది నాలోనా – ఏమైనా ఇవ్వగలనా (2) ||ఏ యోగ్యత|| / మలినమైన దేహం / మార్పులేని మనస్సు / మనిషిగానే చేయరాని / కార్యములే చేసినానే (2) ||ఏముంది|| / పుట్టుకలోనే పాపం / పాపులతో సహవాసం / పలుమారులు నీ హృదయమును / గాయపరచితినయ్యా (2) ||ఏముంది||
క్షమాపణ దొరికేనా (2) / చిట్ట చివరి.. అవకాశం నాకు దొరికేనా (2) / యేసయ్యా… యేసయ్యా… / కక్కిన కూటికై – తిరిగిన కుక్కలా / ఎన్నో మారులు తిరిగితినయ్యా (2) / అయినా కూడా నీ కృప చూపి / ఆదరించిన అద్వితీయుడా (2) / ఆదరించిన అద్వితీయుడా ||యేసయ్యా|| / అడిగే అర్హత లేకపోయినా / నీ ప్రేమను బట్టి అడుగుతు ఉన్నా (2) / తల్లి మరచినా మరువని దేవుడా / నన్ను విడువని యేసునాథుడా (2) / నన్ను విడువని యేసునాథుడా ||యేసయ్యా||
నన్ను బ్రతికించుటకు – నీవు మరణించితివే / నా పాపం కడుగుటకు – నీ రక్తం కార్చితివే / అయ్యా నీ త్యాగము వర్ణనాతీతము / చేయనీ ధ్యానము – జీవితాంతము (2) / యేసయ్యా.. యేసయ్యా.. / యేసయ్యా.. యేసయ్యా… (2) / ఏ నేరము చేసావని / మోసావయ్యా పాప భారం / ఏ ఘోరం చేసావని / తీసారయ్యా నీదు ప్రాణం (2) ||యేసయ్యా|| / ఏ అర్హత నాకుందని / కార్చావు నీ శుద్ధ రుధిరం / ఏ యోగ్యత నాకుందని / చేసావు ఆ సిలువ యాగం (2) ||యేసయ్యా||
నిరంతరమైన నీ కృపలో / నే పొందుచున్న ఆనందమే అది / అవధులు లేని ఆనందమే అది / శాశ్వతమైన ఆనందమే (2) ||నిరంతరమైన|| / అర్హతే లేని నాకు అందలము నిచ్చినావు / అపవాదినెదిరించుటకు అధికారమిచ్చినావు (2) / నా శక్తి కాదు దేవా – నీ ఆత్మ చేతనే / నీ ఘన కార్యములు వర్ణింప శక్యమే (2) ||నిరంతరమైన|| / బలహీనుడైన నన్ను బలవంతుని చేసినావు / బలమైన కార్యములను బహుగా చేయించినావు (2) / నా శక్తి కాదు దేవా – నీ ఆత్మ చేతనే / నీ ఘన కార్యములు వర్ణింప శక్యమే (2) ||నిరంతరమైన|| / మహిమా ప్రభావము నీకే చెల్లింతు మహిమోన్నతుడా / మరణమైన నిన్ను విడువను నా పరుగు ముగిసేదాకా (2) / నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే / చావైతే అది ఎంతో మేలే (2) ||నిరంతరమైన||