ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
2 songs found|By Alphabet|By Popularity
ఎక్కడో మనసు వెళ్ళిపోయింది / ఏమిటో ఇటు రానే రానంది / ఆహాహా.. ఓహోహో… / నిజ ప్రేమ చెంతకు తను చేరానంటుంది / ఈ భువిలోన ఎక్కడైనను కానరాదంది (2) / అక్కడే చిక్కుకుపోయానంటుంది / బయటకు రానే రాలేనంటూ మారాము చేస్తుంది (2) ||ఎక్కడో|| / జీవితాంతము పాద చెంతనే ఉంటానంటుంది / తన ప్రియుని వదలి క్షణమైనా రాలేనన్నది (2) / దేనికీ ఇక చోటే లేదంది / యేసు రాజుని గుండె నిండ నింపుకున్నానంటుంది (2) ||ఎక్కడో|| / ఏకాంతముగా యేసయ్యతో ఉన్నానంటుంది / ఎవరైనా సరే మధ్యలో అసలెందుకు అంటుంది (2) / అక్కడే కరిగిపోతానంటుంది / ప్రేమ ప్రవాహములో మునిగి పోయానంటుంది (2) ||ఎక్కడో||
ఎంత పెద్ద పోరాటమో / అంత పెద్ద విజయమో (2) / పోరాడతాను నిత్యము / విజయమనేది తథ్యము (2) / వాక్యమనే ఖడ్గమును ఎత్తి పట్టి / విశ్వాసమనే డాలుని చేత పట్టి (2) / ముందుకే దూసుకెళ్లెదన్ / యెహోవాదే యుద్ధమనుచు (2) ||ఎంత|| / ప్రార్థన యుద్ధములో కనిపెట్టి / సాతాను తంత్రములు తొక్కి పెట్టి (2) / ముందుకే దూసుకెళ్లెదన్ / యెహోవా నిస్సీ అనుచు (2) ||ఎంత|| / యేసు కాడిని భుజమున పెట్టి / వాగ్ధాన తలుపు విసుగక తట్టి (2) / ముందుకే దూసుకెళ్లెదన్ / సిలువలో సమాప్తమైనదనుచు (2) ||ఎంత||