ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
12 songs found|By Alphabet|By Popularity
పరిశుద్ధాత్ముడా నీకే వందనం (4) / ఆదరణ కర్తా సమాధాన కర్త (2) / సర్వ సత్యములోనికి నడిపే / మా ప్రియా దైవమా (2) ||పరిశుద్ధాత్ముడా|| / స గ గ గ గ మ గ రి స ని ద ప / స గ గ గ గ మ గ ని గ మ / స గ గ గ గ మ గ రి స ని ద ప / ప ద ని రి స.. రి స / మాతోనే ఉండిన వేళ శక్తితో నింపబడుదుము / సర్వ లోకానికి మేము సాక్ష్యమిచ్చెదం (2) / శక్తి చేత కానే కాదు / బలముతోను కానే కాదు (2) / నీ ఆత్మ ద్వారా జరుగును కార్యములు / నీ వల్లే జరుగును మహిమలు (2) ||పరిశుద్ధాత్ముడా|| / దేవుని రాజ్యమనగా నీతియు సమాధానము / పరిశుద్ధ ఆత్మ యందలి ఆనందము (2) / ఆత్మ గల వాడే దేవుని వాడు / ఆత్మ మూలముగా జీవించును (2) / విజ్ఞాపనమును చేయును మన పక్షముగా / సమస్తమును బోధించును (2) ||పరిశుద్ధాత్ముడా||
హృదయపూర్వక ఆరాధన / మహిమ రాజుకే సమర్పణ (2) / నిత్యనివాసి సత్యస్వరూపి / నీకే దేవా మా స్తుతులు (2) ||హృదయ|| / నా మనసు కదిలించింది నీ ప్రేమ / నా మదిలో నివసించింది నీ కరుణ / ఎంతో ఉన్నతమైన దేవా (2) / క్షేమాధారము రక్షణ మార్గము / మాకు సహాయము నీవేగా (2) ||హృదయ|| / ఆత్మతో సత్యముతో ఆరాధన / నే బ్రతుకు కాలమంతా స్తుతి కీర్తన / నీకై పాడెదను యేసయ్యా (2) / కృపామయుడా కరుణ సంపన్నుడా / నిత్యము నిన్నే పూజింతును (2) ||హృదయ||
ఆరాధించెదం ఆర్భాటించెదం – యేసుని సన్నిధిలో / ఆనందించెదం మరల ఆనందించెదం – దేవుని సన్నిధిలో / సాయంకాల నైవేద్యము వలె చేతులెత్తి స్తుతియించెదం / జిహ్వా ఫలము ప్రభుకర్పించి స్తుతి గీతము పాడెదము / యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా / యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడ నీవేనయ్యా / యెరికో కోట గోడలన్ని కూలిపోయే – కాలిపోయే / ఇశ్రాయేలు ప్రజలంతా కూడి ఆరాధించగా – ఆర్భాటించగా / స్తుతులపై ఆసీనుడా యేసయ్యా / మా ప్రార్ధనలు ఆలకించువాడా / స్తుతియాగము చేయు వాడే / నిన్ను మహిమ పరచు వాడు ||యేసయ్యా|| / యూదా దేశము మీదికి శత్రు సైన్యము – దండెత్తగా / యెహోషాపాతు తన ప్రజలతో స్తుతియించగా – స్తోత్రము చేయగా / దేవుడే యుద్ధము జరిపెను / అద్భుత జయమును పొందిరి / బెరాకా లోయలో కూడిరి / కృతజ్ఞతా స్తుతులు చెల్లించిరి ||యేసయ్యా||
నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు (4) / తన ప్రేమనే మాకు చూపి / తన వారసులుగా మము చేసెను / నాలో సంతోషం నాలో ఉత్సాహం / యేసయ్య నింపాడు (4) / లాలించును నను పాలించును / ఏ కీడు రాకుండా నను కాపాడును (2) / తన అరచేతిలో నన్ను చెక్కుకొనెను / ముదిమి వచ్చుఁవరకు నన్ను ఎత్తుకొనును ||నాలో|| / హత్తుకొనును నను ఓదార్చును / ఎల్లప్పుడూ నాకు తోడుండును (2) / అన్ని కష్టాలు నష్టాలు ఎదురొచ్చినా / మన ప్రభు యేసుపై నీవు ఆనుకొనుము ||నాలో||
స్తుతికి పాత్రుడ యేసయ్యా / నా స్వాస్థ్య భాగము నీవయ్యా (2) / పూర్ణ హృదయముతో పాడి కొనియాడెద (2) / నీవే నా రక్షణ – నీవే నా స్వస్థత / నీవే నా విడుదల (2) ||స్తుతికి|| / పాప ఊభిలో నుండి – పైకి లేపితివి / మరణ ఛాయను తొలగించి – కరుణ చూపితివి (2) / నీ వైపే చూస్తూ – నీతోనే నడుస్తూ / నీ వెనకే చేరెద యేసూ (2) ||నీవే|| / జీవాహారము నీవే – జీవ జలము నీవే / నీదు నామమే శక్తి – లేదు ఇలలో సాటి (2) / ప్రతి మోకాలొంగును – ప్రతి నాలుక ఒప్పును / యేసు రాజా నీ యెదుట (2) ||నీవే||
నీకు సాటి ఎవరు లేరు (యేసయ్యా) / ఇలలో నీవే ఏకైక దేవుడవు (2) / ఆత్మతో సత్యముతో ఆరాధింతును / నీదు క్రియలు కొనియాడెదను (2) / అత్యున్నతుడా నా యేసయ్యా / నీవే నాకు నిజ రక్షకుడవు (2) ||నీకు|| / పరమందు దూతలు నిను పొగడుచుందురు / నీవే ప్రభువుల ప్రభువని (2) / నీ ఘన కీర్తిని వివరించగలనా / నా ప్రియుడా నా యేసయ్యా (2) ||అత్యున్నతుడా|| / ఆకాశమనాడు ఆసీనుడైనవాడా / నీ తట్టు కన్నులెత్తుచున్నాను (2) / ఊహించువాటి కంటే అత్యధికముగా / దయచేయువాడవు నీకే స్తోత్రం (2) ||అత్యున్నతుడా||
ఎంత మంచి కాపరి – యేసే నా ఊపిరి (2) / తప్పిపోయిన గొర్రె నేను / వెదకి కనుగొన్నావయ్యా / నీ ప్రేమ చూపినయ్య (2) ||ఎంత|| / సుఖములంటూ లోకమంటూ / నీదు వాక్యము మరచితి / నీదు సన్నిధి విడచితి (2) / యేసయ్యా ప్రేమ మూర్తివయ్యా / నా అతిక్రమములు క్షమియించి / జాలి చూపితివి (2) ||ఎంత|| / నా తలంపులు నా క్రియలు / నీకు తెలిసేయున్నవి / నీవే నిర్మాణకుడవు (2) / యేసయ్యా ప్రేమ మూర్తివయ్యా / కృతజ్ఞతా స్తుతులు నీకు / సమర్పించెదను (2) ||ఎంత||
మేఘాల పైన మన యేసు / త్వరలోనే మనకై వచ్చుచున్నాడు (2) / సిద్ధపడుమా ఉల్లసించుమా / నీ ప్రియుని రాకకై (2) ||మేఘాల|| / ఏ ఘడియో ఏ వేళయో – తెలియదు మనకు / బుద్ధి కలిగిన కన్యకలు వలె – సిద్ధపడియుండు (2) / బూర శబ్దం మ్రోగగా / ప్రభుని రాకడ వచ్చును / రెప్ప పాటున పరిశుద్ధులు / కొనిపోబడుదురు ప్రభువుతో ||మేఘాల|| / పాపం వలన వచ్ఛు జీతం – మరణమే కాదా / దేవుని కృపయే క్రీస్తు యేసులో – నిత్య జీవమే (2) / వినుట వలన విశ్వాసం / కలుగును సోదరా / దేవుని ఆజ్ఞకు లోబడితే / పొందెదవు పరలోకం ||మేఘాల|| / స్తుతియు మహిమ ఘనత ప్రభావం / యేసుకే చెల్లు గాక / తర తరములకు యుగయుగములు / యేసే మారని దైవం (2) / నిత్యము ఆనందమే ప్రభువా నీతో నుండుట / నూతన యెరూషలేము చేరుకోనుటే నిరీక్షణ ||మేఘాల||
పరిశుద్ధుడా నా యేసయ్యా – నిన్నే స్తోత్రింతును / మహోన్నతుడా నా తండ్రి – నిన్నే ఘనపరతును / ప్రభువా పూజార్హుడా – మహిమ సంపన్నుడా / యెహోవా విమోచకూడా – ఆశ్రయ దుర్గమా (2) / అభిషిక్తుడా ఆరాధ్యుడా – నిన్నే ప్రేమింతును / పదివేలలో అతిసుందరుడా – నీలోనే హర్షింతునూ / రాజా నా సర్వమా – నీకే స్తుతికీర్తనా / నీతో సహవాసము – నిత్యం సంతోషమే (2) ||పరిశుద్ధుడా||
తొలకరి వాన దీవెనలు కురిపించు వాన / పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) / అది నూతన పరచును ఫలియింపచేయును / సమృద్ధినిచ్చును సంతోషపరచును (2) ||తొలకరి|| / ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయును / జీవజలముతో నింపి జీవింపచేయును (2) / ఆకు వాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును (2) ||అది నూతన|| / సత్యస్వరూపి శుద్ధాత్మా నీలో వసియించును / పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును (2) / యేసుకొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగ నిలుపును (2) ||అది నూతన||
ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం / ప్రభు ప్రేమలొ నిస్స్వార్ధమే వాత్యల్యమే నిరంతరం (2) / హాల్లెలూయా హాల్లెలూయా / హాల్లెలూయా ఆమేన్ హాల్లెలూయా (2) ||ప్రభు|| / ఆకాశము కంటె ఎత్తైనది / మన ప్రభు యేసుని కృపా సన్నిధి (2) / ఆ సన్నిధే మనకు జీవమిచ్చును / గమ్యమునకు చేర్చి జయమిచ్చును (2) ||ప్రభు|| / దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు / ధరియింప చేయును ప్రభు సన్నిధి (2) / నూతనమైన ఆశీర్వాదముతో / అభిషేకించును ప్రేమానిధి (2) ||ప్రభు||
చిరకాల స్నేహితుడా / నా హృదయాన సన్నిహితుడా (2) / నా తోడు నీవయ్యా – నీ స్నేహం చాలయ్యా / నా నీడ నీవయ్యా – ప్రియ ప్రభువా యేసయ్యా / చిరకాల స్నేహం – ఇది నా యేసు స్నేహం (2) / బంధువులు వెలివేసినా / వెలివేయని స్నేహం / లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం / నా యేసు నీ స్నేహం (2) ||చిరకాల స్నేహం|| / కష్టాలలో కన్నీళ్లలో / నను మోయు నీ స్నేహం / నను ధైర్యపరచి ఆదరణ కలిగించు / నా యేసు నీ స్నేహం (2) ||చిరకాల స్నేహం|| / నిజమైనది విడువనిది / ప్రేమించు నీ స్నేహం / కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం / నా యేసు నీ స్నేహం (2) ||చిరకాల స్నేహం||