ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
3 songs found|By Alphabet|By Popularity
కన్నులతో చూసే ఈ లోకం ఎంతో – అందముగా సృష్టించబడెను భూలోకం / దేవుని ఆలయముగా ఈ దేహం – పరిశుద్ధునిగా సృష్టించే శరీరం / నా దేవుని సృష్టియేగా ఈ లోకం – ఆ సృష్టికర్త పనియేగా / నా యేసుని సృష్టియేగా ఈ లోకం – ఆ సృష్టికర్త పనియేగా… ఈ దేహం / అల్ఫా ఒమెగయైన మహిమకు పాత్రుడైన దేవుడు / మహిమ పొందాలని ఘనత నొందాలని / వేవేల దూతలతో కొనియాడబడు దేవునికి / నువ్వు కావాలని తన రాజ్యం స్థాపించాలని (2) / తన పోలికలో నిర్మించుకొని – ఆ హృదిలో ఉండాలని (2) / నా దేవుడే కోరెనుగా – నీ హృదయాన్ని తనకీయవా ||కన్నులతో|| / నీటిబుడగ వంటిదేగా ఈ జీవితం / ఆవిరైపోవును ఇది మన్నైపోవును / అల్ప కాలమేగా ఈ లోకము / పాడైపోవును ఇది లయమైపోవును (2) / ఈ సృష్టిని దేవునిగా నీవు సృష్టిని పూజించావు / సృష్టికర్త దేవుడినే మరచి అంధుడవై బ్రతికావు / ఆ యేసయ్య నీ కోసమై నీ శాపాన్ని భరియించెను / నిత్య జీవము నీకిచ్చుటకై సిలువలో చేతులే చాచి నిను పిలచెను ||కన్నులతో||
ఆత్మ వర్షము మాపై కురిపించుము / కడవరి ఉజ్జీవం మాలో రగిలించుము (2) / నీ ఆత్మతో సంధించుము / అభిషేకంతో నింపుము / నీ అగ్నిలో మండించుము / వరాలతో నింపుము (2) / యెషయా పెదవులు కాల్చితివి / సేవకు నీవు పిలచితివి (4) / సౌలును పౌలుగా మార్చితివి / ఆత్మ నేత్రములు తెరచితివి (2) / మమునూ వెలిగించుము / మా పెదవులు కాల్చుము (2) / పాత్మజు దీవిలో పరవశుడై / శక్తిని చూచెను యోహాను (2) / షడ్రకు మేషకు అబేద్నగో / ధైర్యముతో నిను సేవించిరి (2) / మామునూ రగిలించుము / మాకు దర్శనమిమ్ము (2)
నీవే నీవే కావాలి ప్రభువుకు / నేడే నేడే చేరాలి ప్రభువును (2) / ఈ కాలం కృప కాలం తరిగిపోతుంది / నీ మరణం లోకాంతం తరుముకొస్తుంది (2) ||నీవే|| / నీ సృష్టికర్తను నీవు విడచినా / నీకిష్టమైన రీతి నీవు నడచినా (2) / దోషివయినా ద్రోహివయినా / దేవుని చెంత – చేరిపుడైనా (2) ||ఈ కాలం|| / పాపాలతో నీవు పండిపోయినా / ప్రేమించువారు లేక కృంగిపోయినా (2) / యేసుని చరణం – పాప హరణం / యేసుని స్నేహం – పాపికి మోక్షం (2) ||ఈ కాలం|| / నీటి బుడగలాంటిది నీ జీవితం / గడ్డి పువ్వులాంటిది నీ యవ్వనం (2) / అధికుడవైనా అధముడవైనా / ఆయన ప్రేమ – కోరిపుడైనా (2) ||ఈ కాలం||