ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
2 songs found|By Alphabet|By Popularity
కొనియాడ తరమే నిన్ను / కోమల హృదయ – కొనియాడ తరమే నిన్ను / తనరారు దినకరు – బెను తారలను మించు (2) / ఘన తేజమున నొప్పు – కాంతిమంతుడ వీవు ||కొనియాడ|| / కెరుబులు సెరుపులు – మరి దూత గణములు (2) / నురుతరంబుగ గొలువ – నొప్పు శ్రేష్ఠుడ వీవు ||కొనియాడ|| / సర్వ లోకంబుల – బర్వు దేవుడ వయ్యు (2) / నుర్వి స్త్రీ గర్భాన – నుద్భవించితి వీవు ||కొనియాడ|| / విశ్వమంతయు నేలు – వీరాసనుడ వయ్యు (2) / పశ్వాళితో దొట్టి – పండియుంటివి వీవు ||కొనియాడ|| / దోసంబులను మడియు – దాసాళి కరుణించి (2) / యేసు పేరున జగతి – కేగుదెంచితి నీవు ||కొనియాడ|| / నరులయందున కరుణ – ధర సమాధానంబు (2) / చిరకాలమును మహిమ – పరగ జేయుదు వీవు ||కొనియాడ|| / ఓ యేసు పాన్పుగ – నా యాత్మ జేకొని (2) / శ్రేయముగ పవళించు – శ్రీకర వరసుత ||కొనియాడ||
ఆహా మహాత్మ హా శరణ్య – హా విమోచకా / ద్రోహ రహిత చంపె నిను నా – దోషమే కదా ||ఆహా|| / వీరలను క్షమించు తండ్రి – నేరమేమియున్ / కోరిటితుల నిన్ను చంపు – కౄర జనులకై ||ఆహా|| / నీవు నాతో పరదైసున – నేడే యుందువు / పావనుండ ఇట్లు పలికి – పాపి గాచితి ||ఆహా|| / అమ్మా నీ సుతుడటంచు మరి-యమ్మతో పలికి / క్రమ్మర నీ జనని యంచు – కర్త నుడితివి ||ఆహా|| / నా దేవ దేవ యేమి విడ-నాడితి వనుచు / శ్రీ దేవ సుత పలికితివి శ్రమ – చెప్ప శక్యమా ||ఆహా|| / దప్పిగొనుచున్నానటంచు – చెప్పితివి కదా / యిప్పగిదిని బాధ నొంద – నేమి నీకు హా ||ఆహా|| / శ్రమ ప్రమాద-ములను గొప్ప – శబ్ద మెత్తి హా / సమాప్తమైనదంచు తెలిపి – సమసితివి కదా ||ఆహా|| / అప్పగింతు తండ్రి నీకు – నాత్మ నంచును / గొప్ప యార్భాటంబు చేసి – కూలిపోతివా ||ఆహా||