ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1 song found|By Alphabet|By Popularity
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా / నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా / నీ కృప లేని క్షణము – నీ దయ లేని క్షణము / నేనూహించలేను యేసయ్యా (2) / యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా / నీ కృప లేనిదే నేనుండలేనయ్యా (2) ||నీ కృప|| / మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి / మార్గముగా మారి మనిషిగా మార్చావు / మహిని నీవు మాధుర్యముగా మార్చి / మాదిరి చూపి మరో రూపమిచ్చావు (2) / మహిమలో నేను మహిమను పొంద / మహిమగా మార్చింది నీ కృప (2) ||యేసయ్యా|| / ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి / ఆపత్కాలమున ఆదుకొన్నావు / ఆత్మీయులతో ఆనందింప చేసి / ఆనంద తైలముతో అభిషేకించావు (2) / ఆశ తీర ఆరాధన చేసే / అదృష్టమిచ్చింది నీ కృప (2) ||యేసయ్యా||