ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1 song found|By Alphabet|By Popularity
కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా / ఈ జీవి నీ తోడు ఎడబాసి పోదులే (2) / ఓ యేసయ్యా… / ఈ జీవి నీ తోడు ఎడబాసి పోదులే(2) / నిను ఎడబాసినపుడు – నా బ్రతుకే దండగా / బ్రతికున్న మూన్నాళ్ళ – నీతోనే పండుగా / యేసయ్య మార్గమే నడవర ఓరన్న (2) ||కష్ట|| / కొండగా అండగా – నీవుండగ లోకాన / ఎండిన ఎముకలయినా – ఉండుగా జీవంగా / యేసయ్య మార్గమే నడవర ఓరన్న (2) ||కష్ట|| / కారు మబ్బు కమ్మినా – కాలమెదురు తిరిగినా / నీ సిలువ నెత్తుకొని – నే సాగిపోతాను / నీ సిలువ నెత్తుకొని – నే సాగిపోతాను (2) ||కష్ట||