తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

Songs by:M S Shanthavardhan

మెల్లని చల్లని|Mellani Challani

మెల్లని చల్లని స్వరము యేసయ్యదే / ఉల్లమంతటిని నింపు ఆనందము / అల్లకల్లోలము బాపి శాంతి నిచ్చుఁన్ ||మెల్లని|| / శూన్యము నుండి సర్వం – సృష్టి చేసెనుగా / మంచిదంతటిని మాటతో చేసెను / పాపులను పిలిచిన ప్రేమ గల స్వరము / పావనపరచెడి పరిశుద్ధుని స్వరము ||మెల్లని|| / స్వస్థత శక్తి కలదు ప్రభుని స్వరమందున / దీనులను ఆదరించు దివ్య కరుణ స్వరం / కుళ్ళిన శవమునందు జీవమును పోసెను / పునరుత్తాన బలం కలదు ఆ స్వరములో ||మెల్లని|| / గాలి తుఫానులన్ అణచిన స్వరమది / భీతి భయములన్ని బాపెడి స్వరమది / అంత్య దినమందున మృతుల లేపునుగా / అందరికి తీర్పును తీర్చి పాలించును ||మెల్లని|| / మహిమ గల ఆ స్వరం పిలుచుచుండె నిన్ను / మహిమ నాథుండేసు కోరుచుండె నిన్ను / మహిమ గల ఆ స్వరం వినెడి చెవులున్నావా / మహిమ నాథుండేసున్ కోరు హృది ఉన్నదా ||మెల్లని||

నా ప్రియుడు యేసు|Naa Priyudu Yesu

నా ప్రియుడు యేసు – నా ప్రియుడు యేసు / వ్రేలాడే సిలువలో ప్రాణమే బలి చేసెనిల (2) ||నా ప్రియుడు|| / మెల్లని చల్లని స్వరమే వినబడెను (2) / తండ్రీ వీరేమి చేయుచున్నారో (2) / ఎరుగరు గనుక క్షమించుమనెన్ / ఆ ప్రియ స్వరమే నా ప్రభు స్వరమే ||నా ప్రియుడు|| / అతని ప్రేమ మధురం మధురం / ఎన్నటికీ నే మరువలేను (2) / ధారబోసెను జీవం – నాకిచ్చె నిత్య జీవం / శాపమంతా బాపి నను దీవించెనుగా ||నా ప్రియుడు|| / వీపంతా దున్నబడె నాగలితో / కారె రక్త వరదల్ కనుమా (2) / యేసు రక్తంలో రక్షణ – యేసు రక్తంలో స్వస్థత / నాకై మరణించి తిరిగి లేచె సజీవునిగా ||నా ప్రియుడు|| / తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి / నాకై విన్నతి చేయుచున్నాడు (2) / రానైయున్నాడు వేగ – మేఘముపై విభుడే / నన్ను పరమ గృహమునకు తోడ్కొని వెళ్ళును ||నా ప్రియుడు||

నా ప్రాణమా నాలో నీవు|Naa Praanamaa Naalo Neevu

నా ప్రాణమా నాలో నీవు / ఎందుకు కృంగియున్నావు / యెహోవాయందే ఇంకను / నిరీక్షణ ఉంచుము నీవు (2) ||నా ప్రాణమా|| / ఈతి బాధల్ కఠిన శ్రమలు / అవమానములే కలిగిన వేళ (2) / నీ కొరకే బలియైన యేసు / సిలువను గూర్చి తలపోయుమా (2) / అల్పకాల శ్రమల పిదప / మహిమతో నిను నింపును ప్రభు నా ప్రాణమా (2) ||నా ప్రాణమా|| / ఆప్తులంతా నిను వీడిననూ / శత్రువులే నీపై లేచిననూ (2) / తల్లి అయినా మరచినా మరచున్ / నేను నిన్ను మరువాననినా (2) / యేసుని ప్రేమన్ తలపోయుమా / ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా (2) ||నా ప్రాణమా|| / ఐశ్వర్యమే లేకున్ననూ / సౌఖ్య జీవితమే కరువైననూ (2) / ప్రభు సేవలో ప్రాణములనే / అర్పించవలసి వచ్చిననూ (2) / క్రీస్తునికే అంకితమై ఆనందించు / ప్రభు రాకకై కనిపెట్టుమా నా ప్రాణమా (2) ||నా ప్రాణమా||

నాదు జీవమాయనే|Naadu Jeevamaayene

నాదు జీవమాయనే నా సమస్తము / నా సర్వస్వమేసుకే నాదు జీవము / నాదు దైవము – దివి దివ్య తేజము (2) ||నాదు|| / కృంగిన వేళ – భంగపడిన వేళ – నా దరికి చేరెను / చుక్కాని లేని – నావ వలె నేనుండ – అద్దరికి చేర్చెను / ఆత్మతో నింపెను – ఆలోచన చెప్పెను (2) ||నాదు|| / సాతాను బంధీనై – కుములుచున్న వేళ – విడిపించెను శ్రీ యేసుడు / రక్తమంత కార్చి – ప్రాణాన్ని బలిచేసి – విమోచన దయచేసెను / సాతానుని అణగద్రొక్కన్ – అధికారం బలమిచ్చెను (2) ||నాదు|| / కారు మేఘాలెన్నో – క్రమ్మిన వేళ – నీతిసుర్యుడు నడుపును / తూఫానులెన్నో – చెలరేగి లేచిననూ – నడుపును నా జీవిత నావ / త్వరలో ప్రభు దిగివచ్చును – తరలి పోదును ప్రభునితో (2) ||నాదు||