ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
2 songs found|By Alphabet|By Popularity
చూచితి నీ మోముపై – చిందిన రక్తము / తలచితి నీ ప్రేమను – మదికి అందనిదాయె / రాజ మకుటము మారిపోయే – ముళ్ల మకుటముగా / సింహాసనమే సిలువగ మారి – శిక్షకు గురియాయేగా / పరిమితి లేని కలువరి ప్రేమను – పరిహాసము చేసిరే / ఆ ప్రేమనెరిగి నీ పాద సేవయే – చాలని నీ చెంత చేరితిని / యేసు.. ||చూచితి|| / నేలపై ఒలికిన నీ రక్తధారలే – ప్రతి పాపిని కడిగెను / ఆ రక్తధారలే పాపికి మార్గమై – పరముకు ప్రవహించెను (2) / మట్టి దేహమును – మహిమగ మార్చుటకు (2) / మాపై నీకున్న సంకల్ప ప్రేమను – పరిహాసము చేసిరే (2) / యేసు.. ||చూచితి|| / సిలువలో చిందిన రక్తపు జల్లులు – ప్రతి రోగిని తాకెను / చితికిన దేహమున ఒలికిన రుధిరము – పరమౌషధమాయెను (2) / మా రోగములను – భరియించుటకు (2) / మాపై నీకున్న ఎనలేని ప్రేమను – అవహేళన చేసిరే (2) / యేసు.. ||చూచితి||
అన్ని నామముల కన్న పై నామము – యేసుని నామము / ఎన్ని తరములకైనా ఘనపరచ దగినది – క్రీస్తేసు నామము (2) / యేసు నామము జయం జయము / సాతాను శక్తుల్ లయం లయము (2) / హల్లెలూయ హొసన్న హల్లెలూయా – హల్లెలూయా ఆమెన్ (2) / పాపముల నుండి విడిపించును / యేసుని నామము (2) / నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును / క్రీస్తేసు నామము (2) ||యేసు నామము || / సాతాను పై అధికార మిచ్చును / శక్తి గల యేసు నామము (2) / శత్రు సమూహము పై జయమునిచ్చును / జయశీలుడైన యేసు నామము (2) ||యేసు నామము || / స్తుతి ఘన మహిమలు చెల్లించుచు / క్రొత్త కీర్తన పాడెదము (2) / జయ ధ్వజమును పైకెత్తి కేకలతో / స్తోత్ర గానము చేయుదము (2) ||యేసు నామము ||