ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
2 songs found|By Alphabet|By Popularity
హల్లెలూయా ఆరాధన / రాజాధి రాజు యేసునకే / మహిమయు ఘనతయు / సర్వాధికారి క్రీస్తునకే (2) / చప్పట్లు కొట్టుచూ – పాటలు పాడుచూ / ఆ ప్రభుని కీర్తించెదం / నాట్యము చేయుచు – ఉత్సాహ ధ్వనులతో / స్తోత్రార్పణ చేసెదం ||హల్లెలూయా|| / రూపింప బడక ముందే / నన్ను ఎరిగితివి / నా పాదములు జారకుండా / రక్షించి నడిపితివి (2) ||చప్పట్లు|| / అభిషేక వస్త్రము నిచ్చి / వీరులుగా చేసితివి / అపవాది క్రియలను జయించే / ప్రార్థన శక్తినిచ్చితివి (2) ||చప్పట్లు||
పరిశుద్ధుడా నా యేసయ్యా – నిన్నే స్తోత్రింతును / మహోన్నతుడా నా తండ్రి – నిన్నే ఘనపరతును / ప్రభువా పూజార్హుడా – మహిమ సంపన్నుడా / యెహోవా విమోచకూడా – ఆశ్రయ దుర్గమా (2) / అభిషిక్తుడా ఆరాధ్యుడా – నిన్నే ప్రేమింతును / పదివేలలో అతిసుందరుడా – నీలోనే హర్షింతునూ / రాజా నా సర్వమా – నీకే స్తుతికీర్తనా / నీతో సహవాసము – నిత్యం సంతోషమే (2) ||పరిశుద్ధుడా||