ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
3 songs found|By Alphabet|By Popularity
నీ జ్ఞాపకం అనేకులను – ప్రభు వైపుకు త్రిప్పుచుండెనా / నీ జ్ఞాపకం ఆత్మీయులకు – క్షేమాభివృద్ధి నిచ్చుఁచుండెనా (2) / నీ జ్ఞాపకం నీవు మరణించినా / మరణాంతర పరిచర్య చేయునా (2) / మరణాంతర పరిచర్య చేయునా ||నీ జ్ఞాపకం|| / పేతురన్న జ్ఞాపకం – పశ్చాత్తాప పరిమళం / పౌలన్న జ్ఞాపకం – పోరాటపు ప్రోత్సాహం (2) / నేటికీ స్మరణకు తెచ్చుచుండెగా / క్షేమాభివృద్ధి కలిగించుచుండెగా (2) ||నీ జ్ఞాపకం|| / బర్నబాన్న జ్ఞాపకం – ఆదరణానందము / తిమోతన్న జ్ఞాపకం – విశ్వాస విజయము (2) / నేటికీ స్మరణకు తెచ్చుచుండెగా / క్షేమాభివృద్ధి కలిగించుచుండెగా (2) ||నీ జ్ఞాపకం|| / ఫిలిప్పన్న జ్ఞాపకం – సువార్త సునాదము / స్తెఫనన్న జ్ఞాపకం – క్రీస్తుని స్వారూప్యము (2) / నేటికీ స్మరణకు తెచ్చుచుండెగా / క్షేమాభివృద్ధి కలిగించుచుండెగా (2) ||నీ జ్ఞాపకం||
ప్రియ సంఘస్థులారా / ప్రార్థనలోన సరిగ కూర్చోండి / మీరు చక్కగా కూర్చోండి (2) ||ప్రియ|| / ప్రార్థనలోన మాట్లాడువారిని / ప్రభువు ఇష్టపడరండీ (2) / చప్పట్లు మీరు కొట్టండి / దేవుని మీరు స్తుతించండి ||ప్రియ|| / తలపై ముసుగు వేయకపోతే / ప్రభువు ఇష్టపడరండీ (2) / తలపై ముసుగు కష్టమైతే / ప్రభువుకు ఇష్టులు కారండి ||ప్రియ|| / ఎగాదిగా చూపులు మానకపోతే / ప్రభువు ఇష్టపడరండీ (2) / క్రీస్తు చూపు కలిగి మీరు / భక్తిగా జీవించండి ||ప్రియ||
ప్రభువా… కాచితివి ఇంత కాలం / కాచితివి ఇంత కాలం / చావైన బ్రతుకైన నీ కొరకే దేవా (2) / నీ సాక్షిగా నే జీవింతునయ్యా ||ప్రభువా|| / కోరి వలచావు నా బ్రతుకు మలిచావయ్యా / మరణ ఛాయలు అన్నిటిని విరిచావయ్యా (2) / నన్ను వలచావులే – మరి పిలిచావులే (2) / అరచేతులలో నను చెక్కు కున్నావులే (2) ||ప్రభువా|| / నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా / ఇలలో మనిషిగ పుట్టిన సర్పాన్నయ్యా (2) / పాపము కడిగావులే – విషము విరచావులే (2) / నను మనిషిగా ఇలలోన నిలిపావులే (2) ||ప్రభువా|| / బాధలను బాపితివి నీవేనయ్యా / నా కన్నీరు తుడిచితివి నీవేనయ్యా (2) / నన్ను దీవించితివి – నన్ను పోషించితివి (2) / నీ కౌగిలిలో నను చేర్చుకున్నావులే (2) ||ప్రభువా||