తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

Songs by:Kranthi Chepuri

38 songs found|By Alphabet|By Popularity

గాడాంధకారపు లోయలో|Gaadaandhakaarapu Loyalo

గాడాంధకారపు లోయలో / నే సంచరించిన వేళలో / అపాయమేమియు రానీయక / ఉన్నావు తోడుగ నా త్రోవలో (2) / యేసయ్య నీవే మా కాపరివి / ఏమి లేమి లేక కాపాడితివి (2) / నా ఆశ్రయ దుర్గము నీవే / నా బలమైన శైలము నీవే / నా రక్షణ శృంగము నీవే / నా శిక్షను భరియించితివే ||గాడాంధకారపు|| / పచ్చిక గల చోట్లలో నిలిపావు / శాంతి జలములందు నన్ను నడిపావు (2) / యేసయ్య నీవే మా కాపరివి / ఏమి లేమి లేక కాపాడితివి (2) / నా ఎత్తైన కోట నీవే / నే నడిచే ప్రతి చోట నీవే / నా రక్షణకర్తా నీవే / నా జీవన దాతా నీవే ||గాఢాంధకారపు|| / నూనెతో నా తలను అంటావు / నా గిన్నెను పొర్లి పారజేసావు (2) / యేసయ్య నీవే మా కాపరివి / ఏమి లేమి లేక కాపాడితివి (2) / నా మొరను ఆలించావే / నీ వరములు నాకొసగావే / నా పరమ తండ్రివి నీవే / నీ కరమున నను దాచావే ||గాఢాంధకారపు|| / చీకటి బ్రతుకును వెలిగించావు / మరణపు భయమును తొలగించావు (2) / యేసయ్య నీవే మా కాపరివి / ఏమి లేమి లేక కాపాడితివి (2) / నా త్రోవకు వెలుగు నీవే / నా నావకు చుక్కాని నీవే / నను కావగ ఏతెంచితివే / కొనిపోవగ రానున్నావే ||గాఢాంధకారపు||

నిన్ను కాపాడు దేవుడు|Ninnu Kaapaadu Devudu

నిన్ను కాపాడు దేవుడు / కునుకడు నిదురపోడు – నిదురపోడు / వాగ్ధానమిచ్చి మాట తప్పడు / నమ్మదగినవాడు – నమ్మదగినవాడు / భయమేల నీకు – దిగులేల నీకు (2) / ఆదరించు యేసు దేవుడు ఉండగా ||నిన్ను కాపాడు|| / శత్రు బలము నిన్ను చుట్టుముట్టినా / శోధనలలో – నిన్ను నెట్టినా (2) / కోడి తన పిల్లలను కాచునంతగా / కాపాడు దేవుడు నీకు ఉండగా (2) / భయమేల నీకు – దిగులేల నీకు (2) / కాపాడు గొప్ప దేవుడు ఉండగా ||నిన్ను కాపాడు|| / రోగ భారమందు లేవకున్ననూ / వ్యాధులు నిన్ను కృంగదీసినా (2) / చనిపోయిన లాజరును తిరిగి లేపిన / స్వస్థపరచు దేవుడు నీకు ఉండగా (2) / భయమేల నీకు – దిగులేల నీకు (2) / స్వస్థపరచు సత్య దేవుడు ఉండగా ||నిన్ను కాపాడు||

ఇదియేనయ్య మా ప్రార్థన|Idiyenayya maa praarthana

ఇదియేనయ్య మా ప్రార్థన / ఇదియే మా విజ్ఞాపన / ఆలకించే దేవా / మము నీ ఆత్మతో నింపగ రావా (2) / నీ వాక్యములో దాగియున్న / ఆంతర్యమును మాకు చూపించయ్యా / నీ మాటలలో పొంచియున్న / మర్మాలను మాకు నేర్పించయ్యా (2) / నీ జ్ఞానమే మా వెండి పసిడి / నీ ధ్యానమే మా జీవిత మజిలి (2) ||ఆలకించే దేవా|| / నీ దృష్టిలో సరిగా జీవించే / మాదిరి బ్రతుకును మాకు దయచేయయ్యా / నీ సృష్టిని మరిగా ప్రేమించే / లోబడని మా మనసులు సరిచేయయ్యా (2) / నీ జ్ఞానమే మా వెండి పసిడి / నీ ధ్యానమే మా జీవిత మజిలి (2) ||ఆలకించే దేవా|| / నీ సువార్తను గొప్పగ చాటే / బెదరని పెదవులు మాకు ఇవ్వుము దేవా / నీ సేవలో తప్పక కొనసాగే / అలుపెరుగని పాదములు నొసగుము ప్రభువా (2) / నీ జ్ఞానమే మా వెండి పసిడి / నీ ధ్యానమే మా జీవిత మజిలి (2) ||ఆలకించే దేవా||

వాడబారని విశ్వాసం|Vaadabaarani vishwaasam

వాడబారని విశ్వాసం – ఎప్పుడూ.. కోపగించని వాత్సల్యం / పాపమెంచని ఆంతర్యం – నీతో.. వీడదీయని సాంగత్యం / దయచేయుమా నాకు నా యేసయ్యా / సరిచేయుమా నన్ను నా యేసయ్యా / వాడుకో నా యేసయ్యా / అని వేడుకుంటున్నానయ్యా (2) / రాజా రాజా రాజుల రాజా / రాజా రారాజా నా యేసు రాజా (2) / ఏలియా ప్రవక్త / యోర్దాను నదీ సమీపమున / ఆహారమే లేకయుండగా / ఆ మహా కరువు కాలమున (2) / కాకోలముచే ఆహారమును పంపిన దేవా (2) / కాకోలాన్నే వాడిన దేవా / కడుహీనుడనైన నన్నును కూడా ||వాడుకో|| / బెయేరు కుమారుడు బిలాము / దైవాజ్ఞను మీరగా / మోయాబుకు పయనమైన వేళ / తన నేత్రాలు మూయబడగా (2) / గాడిదకు మాట్లాడుటకు పలుకిచ్చిన దేవా (2) / గాడిదనే వాడిన దేవా / గతిలేనివాడను నన్నును కూడా ||వాడుకో||

యేసు రక్తములో|Yesu rakthamulo

యేసు రక్తములో నాకు జయమే జయము / ప్రభు యేసు రక్తములో నిత్యం విజయం (2) / జయం జయం జయం జయం – నా యేసునిలో / జయం జయం జయం జయం – ప్రభుయేసు రక్తములో (2) ||యేసు రక్తములో|| / పాపాలను క్షమియించి – శాపాలను భరియించి / విడుదలను కలిగించే యేసు రక్తము / మరణాన్ని తొలగించి – నరకాన్ని తప్పించి / పరలోకానికి చేర్చే యేసు రక్తము (2) / అమూల్యమైనది పవిత్రమైనది / ప్రశస్తమైనది నిష్కళంకమైనది (2) ||జయం జయం|| / శోధనలలో జయమిచ్చి – బాధలో నెమ్మదినిచ్చి / ఆదరణను కలిగించే యేసు రక్తము / రోగాలను లయపరచి – వ్యాధులను దూరం చేసి / స్వస్థత నాకు చేకూర్చే యేసు రక్తము (2) / అమూల్యమైనది పవిత్రమైనది / ప్రశస్తమైనది నిష్కళంకమైనది (2) ||జయం జయం||

ఇహమందున ఆ పరమందు నాకు|Ihamanduna aa paramanduna

ఇహమందున ఆ పరమందు నాకు / గృహమొసగిన నా దైవమా / మితిలేని ప్రేమతో గతిలేని నాకు / స్థితినొసగిన నా స్నేహమా (2) / యేసయ్యా నీవే నా ఆద్యంతం / యేసయ్యా నీలోనే నా ఆత్మీయం / యేసయ్యా నీకై నా ఆరాటం / యేసయ్యా నీతోనే నా ఆనందం / నీవే నా ఆశీర్వాదం / నీతోనే నా అనుబంధం (2) ||ఇహమందున|| / నేనునూ నా ఇంటి వారును / యెహోవాను సేవించెదం (2) / అని యెహోషువా నిను కొనియాడినంతగా / కీర్తించనా నిను స్తుతియించనా / నీ మేలులను నే చాటించనా (2) / యేసయ్యా నీవే నా సమీపం / యేసయ్యా నీలోనే నే సంపూర్ణం / యేసయ్యా నీకై నా సామర్ధ్యం / యేసయ్యా నీతోనే నా సంతోషం / నీవే నా సర్వస్వం / నీతోనే నా సహవాసం (2) ||ఇహమందున|| / నీ ఇంటి లోనికి నను చేర్చడానికి / ఈ భువికేగి సిలువలో బలి అయితివా (2) / మరిలేచి మహిమతో ఏతెంచితివే / మధ్యాకాశమున నిను వీక్షించుటే / నీ కొరకు నాకున్న నిరీక్షణ (2) / యేసయ్యా నీవే నా ప్రస్థానం / యేసయ్యా నీలోనే నే ప్రత్యేకం / యేసయ్యా నీకై నా ప్రావీణ్యం / యేసయ్యా నీతోనే నా ప్రయాణం / నీవే నా ప్రపంచం / నీతోనే నా ప్రతి నిమిషం (2) ||ఇహమందున||

యేసుని నా మదిలో|Yesuni Naa Madilo

యేసుని నా మదిలో స్వీకరించాను / ఆయన నామములో రక్షణ పొందాను (2) / నేను నేనే కాను… నాలో నా యేసే… (2) / హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ / హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ||యేసుని|| / పాతవి గతియించెను / క్రొత్తవి మొదలాయెను (2) / నా పాప హృదయింలో రారాజు జన్మించె / నా పాపం తొలగి పోయెను – నా దుఃఖం కరిగి పోయెను (2) / యేసే నా జీవం… / ఆ ప్రభువే నా దైవం (2) ||హల్లెలూయ|| / నీ పాపం తొలగాలన్నా / నీ దుఃఖం కరగాలన్నా (2) / యేసుని నీ మదిలోకి స్వీకరించాలి / ఆయన నామములోనే రక్షణ పొందాలి (2) / యేసే మన జీవం… / ఆ ప్రభువే మన దైవం (2) ||హల్లెలూయ|| / నీవు నమ్మితే రక్షణ / నమ్మకున్నచో శిక్షయే (2) / ఎత్తబడే గుంపులో నీవు ఉంటావో / విడువబడే రొంపిలో నీవు ఉంటావో (2) / ఈ క్షణమే నీవు తేల్చుకో… / ఇదియే అనుకూల సమయము (2) ||హల్లెలూయ||

అడిగినది కొంతే అయినా|Adiginadi Konthe Ainaa

అడిగినది కొంతే అయినా / పొందినది ఎంతో దేవా / ప్రతిగా ఏమివ్వగలనయా / నిను స్తుతియించే హృదయము తప్ప / నా జీవితం నీకే అంకితమయ్యా – (4) ||అడిగినది|| / ఊహించలేని వివరింపజాలని / నీ కార్యములు ఆశ్చర్యమే / యోచించినా నా వర్ణనకందని / నీ కృపా కనికరములు అత్యున్నతమే / తరతరములకు మారని నీ ఉన్నత ప్రేమా / యుగయుగములకు నీకే ఘనతా మహిమా / సతతం నిను నే కొనియాడెదను / సకలం నీ నామముకే స్తోత్రము తగును ||అడిగినది|| / క్షణ భంగురం నా క్షయ జీవితం / కాచావయ్యా నను నీ రెక్కల నీడ / ఏ యోగ్యత లేని అల్పురాల నన్ను / హెచ్చించావయ్యా నీ ప్రేమ తోడ / నా ఆశ్రయ దుర్గము నీవే యేసయ్య / నా రక్షణ శృంగము నీవే మెస్సయ్య / నా స్తుతికి పాత్రుడవు నీవేనయ్యా / ఈ స్తోత్ర కీర్తన నీకేనయ్యా ||అడిగినది|| / మహిమోన్నతుడా నను మరువని విభుడా / ప్రణుతించెదను నిన్నే నిరతం / నిష్కలంకుడా నిర్మలాత్ముడా / ప్రకటించెదను నీ పావన చరితం / నా అతిశయము నీవే నా యేసయ్యా / నా ఆధారము నీవే నా మెస్సయ్యా / నా ఆరాధన ఆలాపన నీకేనయ్యా / ఈ దీన సేవను చేకొనుమయ్యా ||అడిగినది||

నన్నెంతగానో ప్రేమించిన|Nannenthagaano Preminchina

నన్నెంతగానో ప్రేమించిన ప్రభువా / నా దీన బ్రతుకునే దీవించిన దేవా (2) / నిన్నే ఆరాధింతును – నీలో ఆనందింతును (2) / నా యవ్వనమంతా… నా జీవితమంతా (2) ||నన్నెంతగానో|| / ధరలోని మన్నుతో సమమైన నన్ను / ఎన్నుకొని ఉన్నత స్థితికి చేర్చినావు (2) / అన్నీ నీవే నాకై సమకూర్చినావు / ఉన్నాను నీ తోడు భయపడకన్నావు (2) / వాక్యపు మన్నాతో పోషించిన నన్నే / ఎన్నడూ విడువని ఎడబాయని నిన్నే ||నిన్నే|| / దినమెల్ల నా కొరకే కనిపెట్టినావు / ఎల్లవేళలా నా తోడుగ నిలిచావు (2) / మెల్లని నీ స్వరముతో మాట్లాడినావు / చల్లని కరములతో నా కన్నీరు తుడిచావు (2) / పాపపు ముళ్ళును తొలగించుటకై నాలో / మరణపు విల్లును విరచిన దేవా నీలో ||నీలో||