ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
38 songs found|By Alphabet|By Popularity
స్వస్థపరచు దేవుడు – సర్వ శక్తిమంతుడు / కష్ట కాలములోన నన్ను – మరచిపోడు / నమ్మదగిన దేవుడు – ఎన్నడూ ఎడబాయడు / మాట ఇచ్చిన దేవుడు – నెరవేరుస్తాడు / నన్నే ఎన్నుకున్నాడు – నా పేరు పెట్టి పిలిచాడు / శ్రమ ఎదురైనా – బాధేదైనా విడువని దేవుడు / నా పక్షముగానే ఉన్నాడు – నా చేయి పట్టి నడిపాడు / కృంగిన వేళ ధైర్యమునిచ్చి కృప చూపించాడు ||స్వస్థపరచు|| / చీకటి నుండి వెలుగునకు నడిపించిన నా రక్షకుడు / మరణము నుండి జీవముకు నను దాటించాడు / మారా వంటి జీవితము మధురముగా మార్చాడు / రోగము నిండిన దేహమును బాగు చేసాడు / పొందిన దెబ్బల ద్వారానే స్వస్థతనిచ్చు దేవుడు / చిందించిన రక్తము ద్వారా విడుదలనిచ్చియున్నాడు / అతడే నా ప్రియ యేసుడు – యేసే నా ప్రియ స్నేహితుడు / కౌగిలిలో నను హత్తుకొని కన్నీటిని తుడిచాడు ||స్వస్థపరచు|| / దూతను ముందుగ పంపించి – మార్గము చక్కగ చేసాడు / ఆటంకములు తొలగించి – విజయమునిచ్చాడు / అగ్ని వంటి శ్రమలోన – నా తోడుగ ఉన్నాడు / ధగ ధగ మెరిసే పసిడి వలె శుద్ధీకరించాడు / నా యెడల ఉన్న ఉద్దేశములు హానికరమైనవి కావు / సమాధానకరమైనవిగా రూపొందించాడు / అతడే నా ప్రియ యేసుడు – యేసే నా పరిహారకుడు / వేదనలో నన్నెత్తుకొని నెమ్మదినిచ్చాడు ||స్వస్థపరచు||
ఓ ఓ ఓ ఓ ఓ… / ఓ ఓ ఓ ఓ ఓ… / పైకి కిందికి నీవు ఎగిరేటప్పుడు / చుట్టూ చుట్టూ నీవు తిరిగేటప్పుడు / చేసే ప్రతిదీ చూస్తూ ఉన్నాడు.. హేయ్ / దేవుడు నిన్ను గమనిస్తున్నాడు.. హేయ్ / దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు.. హేయ్ / ఇరవై నాలుగు గంటలు గమనిస్తున్నాడు.. హేయ్ / నీ జీవితము తన చేతిలో ఓ ఓ.. / నిన్నెంతో గొప్పగ చేసే పనిలో ఉన్నాడు / ఓ ఓ ఓ ఓ ఓ… హేయ్ / ఓ ఓ ఓ ఓ ఓ… హేయ్ / గాల్లో చేతులు నీవు ఊపేటప్పుడు / ఎక్కడైనా నీవు అరిచేటప్పుడు / చేసే ప్రతిదీ చూస్తూ ఉన్నాడు.. / దేవుడు నిన్ను గమనిస్తున్నాడు.. హేయ్ / దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు.. హేయ్ / ఇరవై నాలుగు గంటలు గమనిస్తున్నాడు.. హేయ్ / నీ జీవితము తన చేతిలో ఓ ఓ.. / నిన్నెంతో గొప్పగ చేసే పనిలో ఉన్నాడు / ఓ ఓ ఓ ఓ ఓ… హేయ్ / ఓ ఓ ఓ ఓ ఓ… హేయ్ / దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు.. / ఇరవై నాలుగు గంటలు గమనిస్తున్నాడు.. / దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు.. / ఇరవై నాలుగు గంటలు గమనిస్తున్నాడు.. హేయ్.. / దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు.. హేయ్ / ఇరవై నాలుగు గంటలు గమనిస్తున్నాడు.. హేయ్ / నీ జీవితము తన చేతిలో ఓ ఓ.. / నిన్నెంతో గొప్పగ చేసే పనిలో ఉన్నాడు / దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు.. హేయ్ / ఇరవై నాలుగు గంటలు గమనిస్తున్నాడు.. హేయ్ / నీ జీవితము తన చేతిలో ఓ ఓ.. / నిన్నెంతో గొప్పగ చేసే పనిలో ఉన్నాడు / ఓ ఓ ఓ ఓ ఓ… హేయ్ / ఓ ఓ ఓ ఓ ఓ… హేయ్
కంటిపాపలా కాచినావయ్యా – చంటిపాపను మోసినట్టు మోసినావయ్యా / చేతి నీడలో దాచినావయ్యా – తోడుగా మా ముందరే నడచినావయ్యా / పోషించినావయ్యా.. బలపరచినావయ్యా – భయము వలదని ధైర్యమునిచ్చినావయ్యా / నడిపించినావయ్యా.. కాపాడినావయ్యా – ఓటమంచులో విజయమునిచ్చినావయ్యా / మా తలంపులు కావు.. నీ తలంపులే – మా జీవితాలలో జరిగించినావయ్యా / మా ఊహలే కాదు.. నీ ప్రణాళికే – మానక సమయానికి నెరవేర్చినావయ్యా ||కంటిపాపలా|| / ఎన్నో ఏళ్లుగా.. ఎదురు చూసాముగా – ఆశలే అడియాశలవ్వగా సోలిపోయాముగా / దారే కానక.. ఆగిపోయాముగా – అంధకారమే అలుముకోగా అలసిపోయాముగా / అనుదినమున నీ మాటలే ఆదరించి నడిపించెగా / అణగారిన మా ఆశలన్ని చిగురింపజేసెగా / ప్రతి క్షణమున నీ సన్నిధే ధైర్యపరచి బలపరచెగా / చితికిన మా జీవితాలను వెలిగింపజేసెగా / కన్నీరు తుడిచినావు.. నాట్యముగ మార్చినావు / ఎనలేని ప్రేమ మా పైన చూపి ||కంటిపాపలా|| / ఊహించువాటికంటే ఎంతో అధికముగా – హెచ్చించినావు దేవా.. నీ ప్రేమ మధురము / ఏ మంచి లేని మాకు మా మంచి కాపరై – దీవించినావు దేవా.. నీ ప్రేమ మరువము / హీనులం.. బలహీనులం.. నిలువలేక పడిపోయినా / లేవనెత్తి బండపైనే నిలబెట్టినావుగా / చీటికీ.. మాటి మాటికీ.. మా నమ్మకమే కోల్పోయినా / అడుగడుగున నీ నమ్మకత్వమును కనబరచినావుగా / పోగొట్టుకున్నదంతా.. రెట్టింపు చేసినావు / నీ గొప్ప ప్రేమ మా పైన చూపి ||కంటిపాపలా||
పరిశుద్ధ గ్రంథము – వాగ్ధాన నిలయము / ప్రేమకు ప్రతిరూపము – నిరీక్షణకాధారము (2) / బాధలను తొలగించును / అనుదినము వాక్యమును ధ్యానించినా / ఆదరణ కలిగించును / అనుదినము వాక్యమును ధ్యానించినా (2) ||పరిశుద్ధ|| / సరిచేసి బలపరచును / అనుదినము వాక్యమును ధ్యానించినా / క్షమియించుట నేర్పించును / అనుదినము వాక్యమును ధ్యానించినా (2) ||పరిశుద్ధ|| / సహనమును దయచేయును / అనుదినము వాక్యమును ధ్యానించినా / ప్రభు రాకకై స్థిరపరచును / అనుదినము వాక్యమును ధ్యానించినా (2) ||పరిశుద్ధ||
యుద్ధ వీరులం – పరిశుద్ధ పౌరులం / యూదా గోత్రపు సింహపు ముద్దు బిడ్డలం / క్రీస్తు వారలం – పరలోక వాసులం / వధించబడిన గొర్రెపిల్ల ప్రేమ దాసులం / ముందుకే సాగెదం – వెనుక తట్టు తిరుగము / ఈ లోకములో ఉప్పు శిలగ మిగలము / మెలకువగా ఉండెదం – ప్రభుని ప్రార్ధించెదం / పరలోకముకై మేము సిద్ధపడెదము / జయము జయము హోసన్నా జయము జయమని / నోరారా రారాజును కీర్తించెదం / జయము జయము హోసన్నా జయము జయమని / మనసారా మహా రాజును సేవించెదం ||యుద్ధ|| / గర్జించే అపవాది ఎదురు నిలచినా / ఎవరిని మ్రింగుదునా అని తిరుగులాడినా / శోధనలు శత్రువులా చుట్టు ముట్టినా / పాపములో మమ్మును పడద్రోయ జూచినా / విశ్వాసమే ఆయుధం – ప్రార్ధనే మా బలం / వాక్యమనే ఖడ్గముతో తరిమి కొట్టెదం / సిలువలో సాతానుని – తలను చితక త్రొక్కిన / మా రాజు యేసులోనే జయము పొందెదం ||జయము|| / జయం జయం.. నోరారా రారాజును కీర్తించి / జయం జయం.. మనసారా మహా రాజును సేవించి / జయం జయం.. నోరారా రారాజును కీర్తించి / జయం జయం.. మనసారా మహా రాజును సేవించెదం / ఇహ లోక ఆశలెన్నో మోసగించినా / క్రీస్తు ప్రేమ నుండి విడదీయ జూచినా / శ్రమలు అవమానములే కృంగదీసినా / బలహీనతలే మమ్మును భంగ పరచినా / బ్రతుకుట ప్రభు కోసమే – చావైనా లాభమే / పందెమందు ఓపికతో పోరాడెదం / నిత్య జీవమివ్వను – మరణమును గెలిచిన / మహిమ రాజు క్రీస్తులోనే జయము పొందెదం ||జయము||
న్యాయాధిపతియైన దేవుడు – నిన్ను పిలిచే వేళలోన / ఏ గుంపులో ఉంటావో తెలుసుకో – మరలా వచ్చే వేళలోన (2) / ఒక గుంపేమో పరలోకపు గుంపు / రక్షింపబడిన వారికే అది సొంతం / మరు గుంపేమో ఘోర నరకపు గుంపు / నిజ దేవుని ఎరుగని వారికి అది అంతం ||న్యాయాధిపతి|| / నీవు కాదు నీ క్రియలు కాదు – ఆ పరముకు నిను చేర్చేది / కాదు కాదు వేరెవరో కాదు – మరణమును తప్పించేది (2) / కలువరిలో తన ప్రాణం పెట్టిన / యేసయ్యే నీ ప్రాణ రక్షణ / సిలువలో క్రయ ధనమే చెల్లించిన / ఆ ప్రభువే నీ పాప విమోచన ||ఒక గుంపేమో|| / ఇదియే సమయం ఇక లేదే తరుణం – నీ పాపము ఒప్పుకొనుటకు / ఆ పరలోకం చేరే మార్గం – యేసేగా ప్రతి ఒక్కరకు (2) / మేఘముపై రానైయున్నాడుగా / త్వరలోనే నిను కొనిపోడానికి / వెనుదీయకు ఓ నా ప్రియ నేస్తమా / నీ హృదిలో స్వీకరించడానికి ||ఒక గుంపేమో||
నా మార్గమందు నా కంటె ముందు / నడిచావయ్యా నా యేసయ్యా / పరలోకమందు నేనుండాలని / ఒక స్థలమును సిద్ధపరిచావయ్యా (2) / నిందలు అవమానములెన్నో సహియించి – సహియించి / సిలువలో నా శాపములన్ని భరియించి – భరియించి / అడ్డుగా ఉన్న పాపములన్ని క్షమియించి – క్షమియించి / మెట్టగా ఉన్న స్థలములను సరాళము చేసి… / (నా యేసయ్యా) కృప చేత రక్షించినావు / నన్ను… నీ సాక్షిగా నిలిపినావు (2) / నీ ప్రేమను – ప్రకటించుటకు / నీ చిత్తము – నెరవేర్చుటకు / నీ సేవలో – కొనసాగుటకు / నీ మహిమలో – నేనుండుటకు / (నా యేసయ్యా) కృప చేత రక్షించినావు / నన్ను… నీ సాక్షిగా నిలిపినావు (2) / నా యేసయ్యా – నీ సాక్షిగా నిలిపినావు – (2)
నా దేవుడే నాకు ప్రాణ స్నేహితుడు / నా దేవుడే నాకు మార్గ దర్శకుడు / నా దేవుడే నాకు నిత్య పోషకుడు / నా దేవుడే నాకు జీవన దాయకుడు / గతి లేని నన్ను వెదకిన – అతి కాంక్షనీయుడాయనే / మితి లేని ప్రేమ చూపిన – రవికోటి తేజుడాయనే ||నా దేవుడే|| / శ్రమలలో నా తోడుగా నన్ను నడిపించెను / నా నీడగా వెన్నంటియున్న నా ప్రాణనాథుడు / మరణపు సంకెళ్ళ నుండి నన్ను విడిపించెను / నా బంధకాలన్ని తెంచి వేసిన నా నీతిసూర్యుడు / క్షణమైన మరువని వీడని నా క్షేమా శిఖరము / క్షమియించి నాకు అందించెను ఈ రక్షణానందము / క్షయమైన బ్రతుకు మార్చి అక్షయతనొసగెను ||గతి లేని|| / వాక్యమే నా జీవమై నన్ను బ్రతికించెను / నా పాదములకు చిరు దీపమైన నా దివ్య తేజము / ఆత్మయే పరిపూర్ణమై నన్ను బలపరచెను / నా అడుగు జాడలను స్థిరము చేసిన నా జీవ మార్గము / నా గమ్యమేమిటో తెలియక నా పరుగు ఆగిపోగా / నా చేయి పట్టి నను నడిపిన నా మార్గదర్శి యేసే / విలువైన ప్రేమ నాపై నిలువెల్ల కురిసెను ||గతి లేని||
నన్ను బలపరచు యేసునందే నేను / సర్వము చేయగలను / నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను / సమస్తం చేయగలను / సాధ్యము కానిది ఏదియు లేదే / అన్ని సాధ్యమే యేసులో / సాధ్యము కానిది ఏదియు లేదే / అన్ని సాధ్యమే క్రీస్తులో ||నన్ను బలపరచు|| / నీటిని చీల్చి – బాటను వేసి – నరులను నడిపించెనే / బండను చీల్చి – దాహము తీర్చ – నీటిని పుట్టించెనే / నీటిని ద్రాక్షా రసముగ మార్చెనే / నీటిపై నడిచెనే – నీటినే అణచెనే / నా కన్నీటిని నాట్యముగ మార్చెనే / జీవ జలమైన నా యేసయ్యా… ||సాధ్యము|| / హోరేబు కొండపై – మండే పొద నుండి – మోషేతో మాట్లాడెనే / బలిపీఠముపై – అగ్నిని కురిపించి – మహిమను కనుపరచెనే / షద్రకు మేషాకు అబేద్నెగోలను / అగ్నిలో ఉండియే కాపాడెనే / నరకపు మంటనుండి నను రక్షించిన / అగ్ని నేత్రాల నా యేసయ్యా… ||సాధ్యము||
భూమ్యాకాశములను సృజియించిన దేవా / నీ సన్నిధిలోనే ప్రవేశించెదను / నీ పరిశుద్ధతను ప్రకాశించుటకు / నీ పరిపూర్ణతలో నన్ను నడిపించుము / మహిమా నీకే… ఘనతా నీకే… / ప్రతి దినం నా ఆరాధన నీకే / మహిమా నీకే… ఘనతా నీకే… / నిరంతరం ఈ స్తోత్రార్పణ నీకే / యేసయ్యా.. నీకే వందనం – (4) / మట్టి ముద్దనైన నన్ను మనిషిగా రూపించావు / వట్టి వాడనైన గాని మహిమతో నను నింపావు (2) / నీ కౌగిలిలో నను హత్తుకొని / అర చేతులలో నను చెక్కుకొని / నీ సన్నిధి కాంతిని నాపైనే ఉదయింపజేసావు (2) / ఏమివ్వగలను నేను నీ ప్రేమకై / పగిలిన హృదయముతో ఆరాధింతును ||మహిమా|| / ఘోర పాపినైన నన్ను ఎంతగా ప్రేమించావు / సిలువ పైన ప్రాణమిచ్చి వింతగా నను మార్చావు (2) / నా మనో నేత్రమును వెలిగించి / నా హృదయ కాఠిన్యమును మార్చి / అర్హతే లేని బలహీనుడనే ఎన్నుకున్నావు (2) / ఏమిచ్చి నీ ఋణమును నే తీర్తును / విరిగి నలిగిన మనస్సుతో ఆరాధింతును ||మహిమా||
నీ నామం అతి మధురం / నీ గానం నే చేసెదను (2) / నిన్నా నేడు నిరతం ఏకరీతిగ ఉన్న నామము / ఎన్ని తరములైనా మార్పుచెందని ఘన నామము (2) / మహోన్నతమైనది యేసు నీ నామము / కీర్తింపతగినది సాటిలేని నీ నామం ||నీ నామం|| / ఆదరించే నామం – ఆశ్రయంబగు నామం / ఆలకించే నామం – ఆత్మతో నడిపే నామం (2) / అన్ని నామములకు పైన నామం / ఉన్నతంబగు నీ నామం ||నీ నామం|| / జాలి గలిగిన నామం – జాగు చేయని నామం / జవాబు నొసగే నామం – జయమునిచ్చే నామం (2) / జుంటె తేనె కన్న మధురం / జీవ జలమగు నీ నామం ||నీ నామం||
ప్రేమా … ప్రేమా… / యేసూ… నీ ప్రేమా (2) / చీకటినే తొలగించినది / లోకమునే వెలిగించినది / మరణము గెలిచి మార్గము తెరచినది / పాపిని నను ప్రేమించినది / వెదకి నను రక్షించినది / నీతిమంతునిగా ఇల మార్చినది / యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా / ప్రేమించే నీ మనసే నా అతిశయమయ్యా / యేసయ్యా యేసయ్యా నీ కృపయే మేలయ్యా / కృపతోనే రక్షించి కాపాడితివయ్యా / ఆరాధన స్తుతి ఆరాధన / ఆరాధన నీకే / ఆరాధన స్తుతి ఆరాధన / ఈ స్తోత్రార్పణ నీకే / యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా / యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (2) ||చీకటినే|| / దేవా… నా దేవా… / దేవా… నా ప్రభువా (2) / నీ కొరకే నే బ్రతికెదను / నీ ప్రేమను కనుపరచెదను / నీ సాక్షిగ ఇల జీవించెదనయ్యా / నీ సువార్తను చాటెదను / నిన్నే నే కీర్తించెదను / నీ సేవలో నే కొనసాగెదనయ్యా / యేసయ్యా యేసయ్యా నా గురి నీవయ్యా / నిను చూసే క్షణమునకై వేచియున్నానయ్యా / యేసయ్యా యేసయ్యా నా రాజువు నీవయ్యా / నీ రాజ్యములో చేరుటకు కనిపెట్టుకుంటానయ్యా / ఆరాధన స్తుతి ఆరాధన / ఆరాధన నీకే / ఆరాధన స్తుతి ఆరాధన / ఈ స్తోత్రార్పణ నీకే / యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా / యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (2) ||నీ కొరకే||