ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
5 songs found|By Alphabet|By Popularity
నిబంధనా జనులం / నిరీక్షణా ధనులం / ఘనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం / మేము నిబంధనల జనులం / యేసు రాజు వచ్చును – ఇంకా కొంత కాలమే / మోక్షమందు చేరెదము (2) ||నిబంధనా|| / అబ్రాహాము నీతికి వారసులం / ఐగుప్తు దాటిన అనేకులం (2) / మోషే బడిలో బాలురము (2) / యేసయ్య ఒడిలో కృతాజ్ఞులం – ప్రియ పుత్రులం / మేము నిబంధనా జనులం ||యేసు రాజు|| / విశ్వాసమే మా వేదాంతం / నిరీక్షణే మా సిద్ధాంతం (2) / వాక్యమే మా ఆహారం (2) / ప్రార్ధనే వ్యాయామం – అనుదినము / మేము నిబంధనా జనులం ||యేసు రాజు|| / అశేష ప్రజలలో ఆస్తికులం / అక్షయుడేసుని ముద్రికులం (2) / పునరుత్తానుని పత్రికలం (2) / పరిశుద్ధాత్ముని గోత్రికులం – యాత్రికులం / మేము నిబంధనా జనులం ||యేసు రాజు|| / నజరేయుని ప్రేమ పొలిమేరలో / సహించుటే మా ఘన నియమం (2) / క్షమించుటే ఇల మా న్యాయం (2) / భరించుటే మా సౌభాగ్యం – అదే పరమార్ధం / మేము నిబంధనా జనులం ||యేసు రాజు|| / క్రీస్తేసే మా భక్తికి పునాది / పునరుత్తానుడే ముక్తికి వారధి (2) / పరిశుద్ధాత్ముడే మా రథ సారథి (2) / ప్రభు యేసే మా ప్రధాన కాపరి – బహు నేర్పరి / మేము నిబంధనా జనులం ||యేసు రాజు|| / ఎవరీ యేసుని అడిగేవో / ఎవరోలే యని వెళ్ళేవో (2) / యేసే మార్గం యేసే జీవం (2) / యేసే సత్యం కాదు చోద్యం – ఇదే మా సాక్ష్యం / నిబంధనా జనులం ||యేసు రాజు||
క్రైస్తవుడా సైనికుడా / బలవంతుడా పరిశుద్ధుడా / కదలిరావోయ్ నీవు కదలిరా (4) / జాలరీ మనుషులు పట్టు జాలరి / ఆత్మలు పట్టు కాపరి / అమృతమందించే ఆచారి / యేసుకై జీవించే పూజారి ||క్రైస్తవుడా|| / సిలువే నీ స్థావరము / శ్రమలే నీ సైన్యము (2) / సహనమే నీ ధైర్యము / వాక్యమే నీ విజయము (2) ||క్రైస్తవుడా|| / సత్యమే నీ గమ్యము / సమర్పణే నీ శీలము (2) / యేసే నీ కార్యక్రమం / ప్రేమే నీ పరాక్రమం (2) ||క్రైస్తవుడా|| / దేశంలో విదేశంలో / గ్రామంలో కుగ్రామంలో (2) / అడవులలో కొండలలో / పని ఎంతో ఫలమెంతో (2) ||క్రైస్తవుడా|| / సిద్ధాంతపు గట్టు దుమికి రా / వాగులనే మెట్టును దిగిరా (2) / దీనుడా ధన్యుడా / విజేయుడా అజేయుడా (2) ||క్రైస్తవుడా|| / వాగ్ధాన భూమి స్వతంత్రించుకో / అద్వానపు అడవి దాటి ముందుకుపో (2) / నీ ఇల్లు పెనూయేలు / నీ పేరే ఇశ్రాయేలు (2) ||క్రైస్తవుడా||
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. / నిన్నే నిన్నే నే కొలుతునయ్యా / నీవే నీవే నా రాజువయ్యా (2) / యేసయ్య యేసయ్య యేసయ్యా… / కొండలలో లోయలలో / అడవులలో ఎడారులలో (2) / నన్ను గమనించినావా / నన్ను నడిపించినావా (2) ||యేసయ్యా|| / ఆత్మీయులే నన్ను అవమానించగా / అన్యులు నన్ను అపహసించగా (2) / అండ నీవైతివయ్యా / నా.. కొండ నీవే యేసయ్యా (2) ||యేసయ్యా|| / మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ / నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప (2) / నన్ను బలపరచెనయ్యా / నిన్నే ఘనపరతునయ్యా (2) ||యేసయ్యా|| / వంచెన వంతెన ఒదిగిన భారాన / ఒసగక విసిగిన విసిరె కెరటాన (2) / కలలా కడతేర్చినావా / నీ వలలో నను మోసినావా (2) ||యేసయ్యా||
నీతి సూర్యుడా యేసు / ప్రాణ నాథుడా.. రావయ్యా / నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా / హల్లెలూయా- ఎన్నడైన నన్ను మరచిపోయావా / హల్లెలూయా – నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా / యుగయుగములకు ప్రభువా / తరతరములకు రాజువా (2) / శరణటంచు నిన్ను వేడ / కరములెత్తి నిన్ను పిలువ (2) / పరమ తండ్రి నన్ను చేర వచ్చావా ||నిన్న|| / వేల్పులలోనే ఘనుడా / పదివేలలో అతిప్రియుడా (2) / కృపా సత్య సంపూర్ణుడా / సర్వ శక్తి సంపన్నుడా (2) / పరమ తండ్రి నన్ను చేర వచ్చావా ||నిన్న||
హల్లేలూయా యని పాడి స్తుతింపను / రారే జనులారా మనసారా ఊరూరా / రారే జనులారా ఊరూరా నోరారా ||హల్లేలూయా|| / పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని (2) / కూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడని (2) / తోడు నిడగా నిన్ను కాపాడే నాధుడని (2) / పూజించి… పూజించి పాటించి చాటించ రారే ||హల్లేలూయా|| / బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని (2) / అన్నాదమ్ముళ్ల కన్నా ప్రియమైన దేవుడని (2) / కన్నాబిడ్డల కన్నా కన్నుల పండుగని (2) / పూజించి… పూజించి పాటించి చాటించ రారే ||హల్లేలూయా|| / రాజాధి రాజులకన్నా రాజైన దేవుడని (2) / నీచాతి నీచులను ప్రేమింప వచ్చేనని (2) / నిన్న నేడు ఏక రీతిగా ఉన్నాడని (2) / పూజించి… పూజించి పాటించి చాటించ రారే ||హల్లేలూయా||