తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

Songs by:K Prabhudas

ప్రేమ శాశ్వత కాలముండును|Prema Shaashwatha Kaalamundunu

ప్రేమ శాశ్వత కాలముండును / ప్రేమ అన్నిటిలో శ్రేష్టము (2) / ప్రేమ విలువను సిలువ జూపె / ప్రేమ ఎట్టిదో ప్రభువు నేర్పె (2) / ప్రేమ చూపు నరుల యెడల / ప్రేమ కలిగియుండు ప్రియుడా ||ప్రేమ|| / ప్రేమలో దీర్ఘశాంతము / ప్రేమలో దయాళుత్వము (2) / ప్రేమ సహింప నేర్పును / ప్రేమ కలిగియుండు ప్రియుడా ||ప్రేమ|| / ప్రేమలో డంబముండదు / ప్రేమ ఉప్పొంగదెప్పుడు (2) / ప్రేమలో తగ్గింపున్నది / ప్రేమ కలిగియుండు ప్రియుడా ||ప్రేమ|| / ప్రేమించు సహోదరుని / ప్రార్ధించు శత్రువుకై (2) / ప్రేమ యేసుని మనస్సు / ప్రేమ కలిగియుండు ప్రియుడా ||ప్రేమ|| / ప్రేమలో సత్యమున్నది / ప్రేమ సంతోషమిచ్చును (2) / ప్రేమయే సమాధానము / ప్రేమ కలిగియుండు ప్రియుడా ||ప్రేమ|| / విశ్వాసము నిరీక్షణ / ప్రేమ ఈ మూడు నిలచున్ (2) / వీటిలో శ్రేష్టమైనది / ప్రేమ యే ప్రేమ ||ప్రేమ||