ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1 song found|By Alphabet|By Popularity
కలువరి సిలువ సిలువలో విలువ / నాకు తెలిసెనుగా / కలుషము బాపి కరుణను చూపి / నన్ను వెదికెనుగా (2) / అజేయుడా విజేయుడా / సజీవుడా సంపూర్ణుడా (2) ||కలువరి|| / కష్టాలలోన నష్టాలలోన / నన్నాదుకొన్నావయ్యా / వ్యాధులలోన బాధలలోన / కన్నీరు తుడిచావయ్యా (2) / మధురమైన నీ ప్రేమ / మరువగలనా ఆ ప్రేమ (2) / అనుక్షణం నీ ఆలోచన / నిరంతరము నాకు నీవిచ్చిన ||కలువరి|| / పాపానికైనా శాపానికైనా / రక్తాన్ని కార్చావయ్యా / దోషానికైనా ద్వేషానికైనా / మరణించి లేచావయ్యా (2) / మధురమైన నీ ప్రేమ / మరువగలనా ఆ ప్రేమ (2) / అనుక్షణం నీ ఆలోచన / నిరంతరము నాకు నీవిచ్చిన ||కలువరి||