ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1 song found|By Alphabet|By Popularity
యేసయ్యా.. నన్నెందుకు ఎన్నుకున్నావయ్యా / తెలుపుము నీ చిత్తము నా యెడల – (2) ||యేసయ్యా|| / ఏ దరి కానక తిరిగిన నన్ను / నీ కౌగిటిలో చేర్చుకున్నావయ్యా (2) / ఏమి నీ ప్రేమా – ఏమి నీ కృప నా యెడల (2) / ఏమి నీ కృప నా యెడల ||యేసయ్యా|| / చనిపోయిన స్థితిలో పడిపోయిన నన్ను / నీ జీవము నొసగి బ్రతికించావయ్యా (2) / ఏమి నీ దాక్షిణ్యం – ఏమి నీ దయ నా యెడల (2) / ఏమి నీ దయ నా యెడల ||యేసయ్యా|| / శోధనా బాధలో కృంగిన నన్ను / నిరీక్షణ నొసగి బలపరచావయ్యా (2) / ఏమి నీ ఆదరణ – ఏమి నీ ఆశ నా యెడల (2) / ఏమి నీ ఆశ నా యెడల ||యేసయ్యా||