ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
3 songs found|By Alphabet|By Popularity
నా యేసయ్య ప్రేమ / నా తండ్రి గొప్ప ప్రేమ (2) / వర్ణించగలనా నా మాటతో / నే పాడగలనా క్రొత్త పాటతో (2) ||నా యేసయ్య|| / నా పాపనిమిత్తమై / సిలువనూ తానే మోసే / ఈ ఘోర పాపి కొరకై / తన ప్రాణము అర్పించెనే (2) / ఏముంది నాలో దేవా / ఏ మంచి లేనే లేదే (2) ||నా యేసయ్య|| / తప్పి పోయిన నన్ను / వెదకి రక్షించితివే / ఏ దారి లేక ఉన్నా / నీ దరికి చేర్చితివే (2) / ఏముంది నాలో దేవా / ఏ మంచి లేనే లేదే (2) ||నా యేసయ్య||
నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నా / నా యేసయ్యను నేను ప్రేమిస్తున్నా (2) / రాసాను నేనొక లేఖని / పంపాను నేనొక పాటని (2) ||నా దేవుణ్ణి|| / నిను చూడక నాకు నిదుర ఏది / నీ స్వరము వినక నేనుంటినా (2) ||నా దేవుణ్ణి|| / నీ సేవకై నన్ను ఏర్పరచావు / నీ కొరకు మరణించే ప్రాణం ఉంది (2) ||నా దేవుణ్ణి||
గొంతు ఎత్తి చాటెదాను / నడుము కట్టి పయనింతును / నా యేసు గొప్పవాడు (4) / నిన్ను నన్ను ఎన్నడూ విడువలేనన్నాడు / నీ కొరకే నేనన్నాడు (2) / నా యేసు గొప్పవాడు (4) ||గొంతు|| / ఎంత గొప్ప కార్యము చేసినాడు / ఎర్ర సంద్రమునే చీల్చినాడు / ఎంత గొప్ప మహిమను తెచ్చినాడు / యెరికో గోడలు కూల్చినాడు (2) / ఎంతాటి కార్యమైనా చేయగలడు / శక్తివంతుడు అసాధ్యుడు (2) / నా తండ్రి గొప్పవాడు (4) ||గొంతు|| / ఎంత గొప్ప కార్యము చేసినాడు / నిషేధించిన రాయి స్థానం మార్చాడు / పనికిరాని పాత్రను వాడగలడు / గొప్పదైన దానిగా చేయగలడు (2) / ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నాడు / ఎంత గొప్ప దేవుడు నా యేసుడు (2) / నా యేసు గొప్పవాడు (4) ||గొంతు|| / కన్న తల్లి కన్న తండ్రి చూపలేనిది / నా యేసు తండ్రి చూపుతాడు / ఈ లోక స్నేహం ఇవ్వలేనిది / నా యేసు ప్రాణం ఇచ్చినాడు (2) / ఎన్నాడు విడువని గొప్ప దేవుడు / లోకమంతా విడిచినా నిన్ను విడువడు (2) / నా యేసు గొప్పవాడు (4) ||గొంతు||