ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1 song found|By Alphabet|By Popularity
ఆలయంలో ప్రవేశించండి అందరు / స్వాగతం సుస్వాగతం యేసు నామంలో / మీ బ్రతుకులో పాపమా కలతలా / మీ హృదయంలో బాధలా కన్నీరా / మీ కన్నీరంతా తుడిచి వేయు రాజు యేసు కోసం ||ఆలయంలో|| / దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై / వెదికే వారికంతా కనబడు దీపము / యేసు రాజు మాటలే వినుట ధన్యము / వినుట వలన విశ్వాసం అధికమధికమై / ఆత్మలో దాహము తీరెను రారండి / ఆనందమానందం హల్లెలూయా ||ఆలయంలో|| / ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై / జీవ వృక్షంబుగా ఫలియించాలని / పెదవితో పలికెదం మంచి మాటలే / హృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలై / నింపెదం నిండెదం కోరెదం పొందెదం / ఆనందమానందం హల్లెలూయా ||ఆలయంలో||