తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

Songs by:John Wesly

తరచి తరచి|Tharachi Tharachi

తరచి తరచి చూడ తరమా / వెదకి వెదకి కనుగొనగలమా / యేసు వంటి మిత్రుని లోకమందున / విడచి విడచి ఉండగలమా / మరచి మరచి ఇలా మనగలమా / యేసు వంటి స్నేహితుని విశ్వమందున / లోక బంధాలన్నీ తృప్తినివ్వలేవుగా / ఏ మనిషిని నమ్మాలో – తెలియదు ఈ లోకంలో / నేల మంటిలోన పరమార్ధం లేదుగా / ఎంత బ్రతుకు బ్రతికినా – చివరకు చితియేగా / నమ్మదగిన యేసు ప్రాణమిచ్చె నీకై / జగతిలోన దొరకునా ఇటువంటి ప్రాణప్రియుడు (2) ||తరచి|| / లేరు లేరు ఎవ్వరు కానరారు ఎవ్వరు / యేసు వంటి ప్రేమికుడు ఇహమందు పరమందు / పదివేలలోన అతి కాంక్షణీయుడు / కలతలన్ని తీర్చి కన్నీటిని తుడచును / కల్వరిగిరిలోన కార్చెను రుధిరం / హృదయమందు చేర్చుకో కృప చూపు నాథుని (2) ||తరచి||

తలవంచకు నేస్తమా|Thalavanchaku Nesthamaa

తలవంచకు నేస్తమా (2) / తలవంచకు ఎప్పుడూ / తలవంచకు ఎన్నడూ / స్వార్ధపుటంచున ఊగిసలాడే లోకంలో / కుడి ఎడమలకు బేధం తెలియని లోకంలో / కన్నులు నెత్తికి వచ్చిన ఈ లోకంలో / ప్రేమకు అర్ధం గ్రహించలేని లోకంలో / నీవు కావాలి ఓ.. మాదిరి / నీవు ఇవ్వాలి ఓ.. ప్రేరణ / నీవు మండాలి ఓ.. జ్వాలగా / నీవు చేరాలి ఓ.. గమ్యము ||తలవంచకు|| / చీకటిని వెనుకకు త్రోసి – సాగిపో ముందుకే / క్రీస్తు బాటలో పయనిస్తే – ఎదురేమున్నది / రేపటి భయం నిందల భారం – ఇకపై లేవులే / క్రీస్తుని చేరు లోకాన్ని వీడు – విజయం నీదేలే (2) ||నీవు|| / పెకిలించు కొండలను – విశ్వాస బాటలో / గెలవాలి యుద్ధ రంగంలో – దైవిక బలంతో / యేసుని కృప నీతోనే ఉంది – సాధించు ప్రగతిని / మంచిని పెంచు ప్రేమను పంచు – నిలిచిపో జగతిలో (2) ||నీవు||

దుర్దినములు రాకముందే|Durdinamulu Raakamunde

దుర్దినములు రాకముందే – సర్వం కోల్పోకముందే / అంధత్వం కమ్మకముందే – ఉగ్రత దిగిరాకముందే (2) / స్మరియించు రక్షకుని అనుకూల సమయమున / చేర్చుకో యేసుని ఆలస్యం చేయక (2) ||దుర్దినములు|| / సాగిపోయిన నీడవంటి జీవితం / అల్పమైనది నీటి బుడగ వంటిది (2) / తెరచి ఉంది తీర్పు ద్వారం / మార్పులేని వారికోసం (2) / పాతాళ వేదనలు తప్పించుకొనలేవు / ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు (2) ||దుర్దినములు|| / రత్నరాసులేవి నీతో కూడ రావు / మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి (2) / యేసు క్రీస్తు ప్రభువు నందే / ఉంది నీకు రక్షణ (2) / తొలగించు భ్రమలన్ని కనుగొనుము సత్యాన్ని / విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని (2) ||దుర్దినములు||