తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

Songs by:Joel Kodali

17 songs found|By Alphabet|By Popularity

నా బ్రతుకు దినములు|Naa Brathuku Dinamulu

నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము / దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము / ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము / నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము ||నా బ్రతుకు|| / ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి / నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని / ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని / ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని / నా మరణ రోదన ఆలకించుమో ప్రభు / మరల నన్ను నూతనముగ చిగురు వేయని ||నా బ్రతుకు|| / నీ పిలుపు నేను మరచితి – నా పరుగులో నేనలసితి / నా స్వార్ధము నా పాపము – పతన స్థితికి చేర్చెను / నా అంతమెటుల నుండునో – భయము పుట్టుచున్నది / దేవా నన్ను మన్నించుము – నా బ్రతుకు మార్చుము / యేసూ నీ చేతికి ఇక లొంగిపోదును / విశేషముగా రూపించుము నా శేష జీవితం ||నా బ్రతుకు||

జుంటె తేనె కన్నా|Junte Thene Kannaa

జుంటె తేనె కన్నా తీయనిది / వెండి పసిడి కన్నా మిన్న అది / పొంగి పొర్లుచున్న ప్రేమ నీది / యేసు నీ నామము / సూర్య కాంతి కన్నా ప్రకాశమైనది / పండు వెన్నెల కన్నా నిర్మలమైనది / మంచు కొండల కన్నా చల్లనిది / యేసు నీ నామము / యేసూ అసాధ్యుడవు నీవు / మరణాన్నే జయించిన వీరుడవు / సర్వాన్ని శాసించే యోధుడవు / నీకు సాటి లేరెవరు / రక్షకా నీవేగా మా బలము / దేవా మా దాగు స్థలము నీవే / నీవే నిజమైన దేవుడవు / ప్రణమిల్లి మ్రొక్కెదము ||జుంటె|| / ఆకాశము కన్నా విశాలమైనది / విశ్వమంతటిలో వ్యాపించియున్నది / ఊహలకందని ఉన్నతమైనది / యేసు నీ నామము / లోకమంతటికి రక్షణ మార్గము / జనులందరిని బ్రతికించు జీవము / సర్వ కాలములో నివసించు సత్యము / యేసు నీ నామము ||జుంటె||

నా జీవితకాలమంత|Naa Jeevitha Kaalamanthaa

నా జీవితకాలమంత నిను కీర్తించిన చాలునా / నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా / యేసు నీదు మేలులకై నే బదులుగా ఏమిత్తును / నా దేహమే యాగముగా అర్పించిన చాలునా ||నా జీవిత|| / నా బాల్యమంతా నా తోడుగ నిలిచి / ప్రతి కీడు నుండి తప్పించినావు / యవ్వనకాలమున నే త్రోవ తొలగిన / మన్నించి నాతోనే కొనసాగినావు / ఎన్నో శ్రమలు ఆపదలన్నిటిలో / నను దైర్యపరిచి నను ఆదుకున్నావు / యేసు నీవే నీవే యేసు… నీవే నా సర్వస్వమూ ||నా జీవిత|| / కన్నీటి రాత్రులు నే గడిపిన వెంటనే / సంతోష ఉదయాలు నాకిచ్చినావు / హృదయాశలన్ని నెరవేర్చినావు / యోగ్యుడను కాకున్న హెచ్చించినావు / ఎంతో ప్రేమ మితిలేని కృపను / నాపై చూపించి నను హత్తుకున్నావు / యేసు నీవే నీవే యేసు… నీవే నా ఆనందమూ ||నా జీవిత||

ఆశ్చర్యకరుడు|Aascharyakarudu

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త / నిత్యుడగు తండ్రి బలవంతుడు / లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి / తిరిగి లేచిన పునరుద్ధానుడు / రండి మన హృదయాలను ఆయనకు అర్పించి / ఆత్మతో సత్యముతోను ఆరాధించెదము / ఆరాధించెదము / ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన / పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు / రాజులకే రారాజు ఆ ప్రభువునే పూజించెదం / హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా / సత్య స్వరూపి సర్వాంతర్యామి / సర్వాధికారి మంచి కాపరి / వేలాది సూర్యుల కాంతిని మించిన / మహిమా గలవాడు మహా దేవుడు / రండి మనమందరము – ఉత్సాహగానములతో / ఆ దేవ దేవుని – ఆరాధించెదము / ఆరాధించెదము / ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన / పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్టుడు / రాజులకే రారాజు ఆ ప్రభువునే పూజించెదం / హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

చీకటి లోయలో నేను పడియుండగా|Cheekati loyalo nenu padiyundagaa

చీకటి లోయలో నేను పడియుండగా / నీవే దిగి వచ్చి నను కనుగొంటివి / మరణపు గడియలో నేను చేరియుండగా / నీ రక్తమిచ్చి నను బ్రతికించితివి / నీవే.. దేవా నేవే.. నీవే నీవే / నా ప్రాణ దాతవు నీవే ప్రభు / చేర్చు.. దేవా చేర్చు.. నన్ను చేర్చు / ఎత్తైన కొండ పైకి నను చేర్చు ప్రభు / అరణ్యములలో నేను పయనించినను / ఏ అపాయమునకిక భయపడను / నీవే నా మార్గమని నిను వెంబడించెదను / నా చేయి పట్టి నను నడిపించుము / నీకే.. దేవా నీకే.. నీకే నీకే / నా సమస్తము నీకే అర్పింతును / చేర్చు.. దేవా చేర్చు.. నన్ను చేర్చు / నా తండ్రి ఇంటికి నను చేర్చు ప్రభు / ఆకలి దప్పులు లేని.. శ్రమలు అలసటలు లేని / శోధన ఆవేదన లేని.. భయము దుఃఖము లేని / మరణం కన్నీరు లేని.. చీకటి ప్రవేశం లేని / నా తండ్రి ఇంటికి నను చేర్చు ప్రభు / సకల సమృద్ధి ఉండు.. దూతల స్తుతిగానాలుండు / భక్తుల సమూహముండు.. మహిమ ప్రవాహముండు / నిత్యం ఆరాధన ఉండు.. నిరతం ఆనందముండు / నా తండ్రి ఇంటికి నను చేర్చు ప్రభు

Telugu Songs by Joel Kodali — Page 2 | UEC Telugu Church