ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
2 songs found|By Alphabet|By Popularity
త్రిత్వైకమా సకలేశ్వరా / పూజ్యుడౌ శ్రేయస్కరా (2) / ధ్యానించెద హృది వాంఛతో / గళమెత్తెద మృదు భాషతో / నా సుతుడా సర్వే సుతుడా / నా జనకా సర్వే జనకా ||త్రిత్వైకమా|| / దోష భావముకు బంధునవ్వగా / దేహ ఇఛ్చలలో స్థిరమవ్వగా (2) / వాక్యపు వెలుగై నాకిల వెలుగై / ముక్తినిచ్చిన నీకు వందనం (2) ||త్రిత్వైకమా|| / క్షితియందు ఎరకు మోసిపోతిని / క్షమలేక ఇలలో మృతమైతిని (2) / వెల దాతవై జీవ దాతవై / స్థితి మార్చిన నీకు వందనం (2) ||త్రిత్వైకమా||
నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2) / తల్లి ప్రేమను మించినదే / లోక ప్రేమను మించినదే / నిన్ను నేను – ఎన్నడు విడువను (2) / నిత్యము నీతోనే జీవింతున్ / సత్య సాక్షిగ జీవింతున్ / నిత్య రక్షణతో – నన్ను రక్షించెన్ (2) / ఏక రక్షకుడు యేసే / లోక రక్షకుడు యేసే / నీ చిత్తమును చేయుటకై – నీ పోలికగా ఉండుటకై (2) / నా సర్వము నీకే అర్పింతును / పూర్ణానందముతో నీకే అర్పింతున్ / నిత్య రాజ్యములో – నన్ను చేర్పించన్ (2) / మేఘ రథములపై రానైయున్నాడు / యేసు రాజుగ రానైయున్నాడు / ఆరాధింతును సాష్టాంగపడి (2) / స్వర్గ రాజ్యములో యేసున్ / సత్య దైవం యేసున్ / నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2) / తల్లి ప్రేమను మించినదే / లోక ప్రేమను మించినదే / నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2) / తల్లి ప్రేమను మించినదే / లోక ప్రేమను మించినదే