తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

Songs by:Guntur Raja

అడగక ముందే|Adagaka Mundhe

అడగక ముందే అక్కరలెరిగి / అవసరాలు తీర్చిన ఆత్మీయుడా / ఎందరు ఉన్నా బంధువు నీవే / బంధాలను పెంచిన భాగ్యవంతుడా / పదే పదే నేను పాడుకోనా / ప్రతి చోట నీ మాట నా పాటగా / మరి మరి నే చాటుకోనా / మనసంతా పులకించని సాక్షిగా / నా జీవిత గమనానికి గమ్యము నీవే / చితికిన నా గుండెకు ప్రాణం నీవే (2) ||పదే పదే|| / మమతల మహా రాజా / (నా) యేసు రాజా (4) / అడగక ముందే అక్కరలెరిగి / అవసరాలు తీర్చిన ఆత్మీయుడా / ఎందరు ఉన్నా బంధువు నీవే / బంధాలను పెంచిన భాగ్యవంతుడా (2) / అవసరాలు తీర్చిన ఆత్మీయుడా / బంధాలను పెంచిన భాగ్యవంతుడా (2) ||మమతల|| / అడిగిన వేళ అక్కున చేరి / అనురాగం పంచిన అమ్మవు నీవే / నలిగిన వేళ నా దరి చేరి / నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే (2) / అనురాగం పంచిన అమ్మవు నీవే / నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే (2) ||పదే పదే||

నేనంటే నీకెందుకో|Nenante Neekenduko

నేనంటే నీకెందుకో ఈ ప్రేమా / నన్ను మరచి పొవెందుకు (2) / నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా / నన్ను విడిచిపోవెందుకు / కష్టాలలో నష్టాలలో / వ్యాధులలో బాధలలో / కన్నీళ్ళలో కడగండ్లలో / వేదనలో శోధనలో / నా ప్రాణమైనావు నీవు / ప్రాణమా.. నా ప్రాణమా – (2) ||నేనంటే|| / నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు / నిన్ను వీడిపోయినా – నన్ను వీడిపోలేవు (2) / ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా (4) / ఏ ఋణమో ఈ బంధము – నా ప్రేమ మూర్తి / తాళలేను నీ ప్రేమను ||నేనంటే|| / ప్రార్ధించకపోయినా పలకరిస్తు ఉంటావు / మాట వినకపోయినా కలవరిస్తు ఉంటావు (2) / ఎందుకింత జాలి నాపై యేసయ్యా (4) / ఏ బలమో ఈ బంధము – నా ప్రేమ మూర్తి / తాళలేను నీ ప్రేమను ||నేనంటే||

కనురెప్ప పాటైన|Kanureppa Paataina

కనురెప్ప పాటైన కను మూయలేదు – ప్రేమ ప్రేమ ప్రేమ / నిరుపేద స్థితిలోను నను దాటిపోలేదు – ప్రేమ ప్రేమ ప్రేమ (2) / పగలూ రేయి పలకరిస్తోంది / పరమును విడిచి నను వరియించింది (2) / కలవరిస్తోంది ప్రేమా / ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ ||కనురెప్ప|| / ప్రేమ చేతిలో నను చెక్కుకున్నది / ప్రేమ రూపుతో నను మార్చియున్నది (2) / ప్రేమను మించిన దైవం లేదని / ప్రేమను కలిగి జీవించమని (2) / ఎదురు చూస్తోంది ప్రేమా / కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ ||కనురెప్ప|| / ప్రేమ లోగిలికి నను పిలుచుచున్నది / ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది (2) / ప్రేమకు ప్రేమే తోడవుతుందని / ప్రేమకు సాటి లేనే లేదని (2) / పరవశిస్తోంది ప్రేమా / కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ ||కనురెప్ప||