ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1 song found|By Alphabet|By Popularity
దేవుని ప్రేమ ఇదిగో – జనులార – భావంబునం దెలియరే / కేవలము నమ్ముకొనిన – పరలోక – జీవంబు మనకబ్బును ||దేవుని|| / సర్వలోకము మనలను – తన వాక్య – సత్యంబుతో జేసెను / సర్వోపకారుడుండే – మన మీద – జాలిపరుడై యుండెను ||దేవుని|| / మానవుల రక్షింపను – దేవుండు – తన కుమారుని బంపెను / మన శరీరము దాల్చెను – ఆ ప్రభువు – మన పాపమునకు దూరుడే ||దేవుని|| / యేసు క్రీస్తను పేరున – రక్షకుడు – వెలసి నాడిలలోపల / దోసకారి జనులతో – నెంతో సు – భాషలను బల్కినాడు ||దేవుని|| / పాప భారంబు తోడ – నే ప్రొద్దు – ప్రయాసముల బొందెడి / పాపులందరు నమ్మిన – విశ్రాంతి – పరిపూర్ణమిత్తు ననెను ||దేవుని|| / సతులైన పురుషులైనన్ – యా కర్త – సర్వ జనుల యెడలను / సత్ప్రేమగా నడిచెను – పరలోక – సద్బోధలిక జేసెను ||దేవుని|| / చావు నొందిన కొందరిన్ – యేసుండు – చక్కగా బ్రతికించెను / సకల వ్యాధుల రోగులు – ప్రభు నంటి – స్వస్థంబు తా మొందిరి ||దేవుని|| / గాలి సంద్రపు పొంగులన్ – సద్దణిపి – నీళ్లపై నడచినాడే / మేలు గల యద్భుతములు – ఈలాగు – వేల కొలదిగ జేసెను ||దేవుని|| / చేతుల కాళ్లలోను – రా రాజు – చేర మేకులు బొందెను / పాతకులు గొట్టినారే – పరిశుద్ధ – నీతి తా మోర్వలేకన్ ||దేవుని|| / ఒడలు రక్తము గారగ – దెబ్బలు – చెడుగు లందరు గొట్టిరి / వడిముళ్లు తల మీదను – బెట్టిరి – ఓర్చెనో రక్షకుండు ||దేవుని|| / ఇన్ని బాధలు బెట్టుచు – దను జంపు – చున్న పాప నరులను / మన్నించు మని తండ్రిని – యేసుండు – సన్నుతితో వేడెను ||దేవుని|| / రక్షకుడు శ్రమ బొందగా – దేశంబు – తక్షణము చీకటయ్యెన్ / రక్షకుడు మృతి నొందగ – తెర చినిగి – రాతి కొండలు పగిలెను ||దేవుని|| / రాతి సమాధిలోను – రక్షకుని – నీతిగల దేహంబును / పాతి పెట్టిరి భక్తులు – నమ్మిన – నాతు లందరు జూడగా ||దేవుని|| / మూడవ దినమందున – యేసుండు – మృతి గెల్చి లేచినాడు / నాడు నమ్మిన మనుజులు – చూచిరి – నలువది దినములందున్ ||దేవుని|| / పదునొకండు మారులు – వారలకు – బ్రత్యక్షు డాయె నేసు / పరలోకమున కేగెను – తన వార్త – బ్రకటించు మని పల్కెను ||దేవుని|| / నమ్మి బాప్తిస్మమొందు – నరులకు – రక్షణ మరి కల్గును / నమ్మ నొల్లక పోయెడు – నరులకు – నరకంబు సిద్ధమనెను ||దేవుని||