ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1 song found|By Alphabet|By Popularity
అన్ని వేళల వినువాడు నీ ప్రార్ధనలన్నియు / ఏ బేధము లేకనే ఆలకింపనైయున్నాడు (2) / ప్రార్ధించుము అలయకనే / కనిపెట్టుము విశ్వాసముతో (2) / నీ ప్రార్ధనే మార్చును నీ స్థితి / నీ ఎదలో కన్నీరు తుడచును ||అన్ని|| / కుమిలిపోతూ నలిగిపోతూ / ఏమౌతుందో అర్ధం కాక (2) / వేదన చెందుతూ నిరాశలో మునిగావా (2) / ఒకసారి యోచించుమా / నీ మొఱ్ఱను వినువాడు యెసయ్యే (2) ||అన్ని|| / ఎవరికీ చెప్పుకోలేక / అంతగా బాధ ఎందుకు (2) / మొఱ్ఱపెట్టిన వారికి సమీపముగా యేసు ఉండును (2) / ఒకసారి యోచించుమా / నీ మొఱ్ఱను వినువాడు యెసయ్యే (2) ||అన్ని||