తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

Songs by:Devaraju Jakki

నీ జీవితం విలువైనది|Nee Jeevitham Viluvainadi

నీ జీవితం విలువైనది / ఏనాడు ఏమరకు / శ్రీ యేసు నామం నీకెంతో క్షేమం / ఈనాడే యోచించుమా / ఓ నేస్తమా తెలియునా / ప్రభు యేసు నిన్ను పిలిచెను / నా నేస్తమా తెలిసికో / ప్రభు యేసు నీకై మరణించెను ||నీ జీవితం|| / బలమైన పెను గాలి వీచి / అలలెంతో పైపైకి లేచి (2) / విలువైన నీ జీవిత నావా / తలకిందులై వాలిపోవ / వలదు భయము నీకేలా / కలదు యేసే నీ తోడు / యేసు మరణించి మరి లేచెను / నిన్ను ప్రేమించి దరి చేర్చును ||నీ జీవితం|| / గాఢాంధకారంపు లోయలో / వల గాలి వడి సవ్వడిలో (2) / నడయాడి నీ జీవిత త్రోవా / సుడివడి నీ అడుగు తడబడిన / వలదు భయము నీకేలా / కలదు యేసే నీ తోడు / యేసు మరణించి మరి లేచెను / నిన్ను ప్రేమించి దరి చేర్చును ||నీ జీవితం|| / కనలేని గమ్యంబు కోరి / ఎనలేని కష్టాల పాలై (2) / మనలేని నీ జీవిత గాథా / కలలన్ని కన్నీటి వ్యథలే / వలదు భయము నీకేలా / కలదు యేసే నీ తోడు / యేసు మరణించి మరి లేచెను / నిన్ను ప్రేమించి దరి చేర్చును ||నీ జీవితం||