ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
7 songs found|By Alphabet|By Popularity
నన్ను నీవలె నిర్మించినను / కోల్పోతి దేవా నీ రూపమును / హేయ క్రియలతో సిలువేసినను / నాపై నీ కృపను తొలగించవెందుకు / నిను బాధించినా భరియించితివా / నా పాపం జ్ఞాపకమే రాలేదా (2) ||నన్ను నీవలె|| / ఎరిగి ఎరిగి చెడిపోతిని / తెలిసి తెలివిగా తప్పిపోతిని (2) / బ్రతికున్న శవమునై నేనుంటిని / అహము ముదిరి పది లేవలేకపోతిని (2) ||నన్ను నీవలె|| / భయభక్తులు లేని వెర్రివాడనై / కుంపటి ఒడిలో పెట్టుకుంటిని (2) / ఒక పూటకూటికై ఆశపడితిని / వ్యభిచారినై వెక్కివెక్కి ఏడ్చుచుంటిని (2) ||నన్ను నీవలె|| / సిల్వలో నీ శ్రమ చూడకుంటిని / కల్వరి ప్రేమను కానకుంటిని (2) / నిన్ను సిలువ వేయమని కేకలేసితి / అయినా క్షమించి కౌగిలించి ముద్దుపెట్టుకుంటివా (2) ||నన్ను నీవలె||
ఎంత ప్రేమో నాపై యేసయ్యా / నేను ఎలాగ వివరించగలనయ్యా (2) / పెంట కుప్పలలో పడి ఉన్ననూ / నా మెడ మీద పడి ముద్దు పెట్టితివా / జిగట ఊబిలో నేను దిగి ఉన్ననూ / నా చేయి పట్టి నను పైకి లేపితివా ||ఎంత|| / దాహం తీర్చగలేని బావి అయిననూ / నేను పాపపు కుండను విడువకుంటిని (2) / నా పాపమంత క్షమించితివి (2) / జీవ జలమిచ్చి నన్ను చేర్చుకుంటివి (2) ||ఎంత|| / పందులున్న చోట నలిగి పడి ఉంటిని / నా పాపమే చుట్టు ముట్టి పట్టుకున్నది (2) / బుద్ధి వఛ్చి నేను నిన్ను ఆశ్రయించగా (2) / క్షమియించి నీ రక్షణిచ్చితివి (2) ||ఎంత|| / నరికిన కొమ్మ వలె ఎండిపోతిని / నా పాపాన్ని దాచి దాచి నశించితిని (2) / ఒప్పుకొనగా నాకు జీవమిచ్చితివి (2) / (ఎండిన) మొద్దును చిగురింపజేసితివి (2) ||ఎంత||
ఆశ్రయుడా నా అభిషిక్తుడా / నీ అభీష్టము చేత నను నడుపుచుండిన / అద్భుత నా నాయకా / యేసయ్య అద్భుత నా నాయకా / స్తోత్రములు నీకే స్తోత్రములు (2) / తేజోమయుడయిన ఆరాధ్యుడా (2) / నీ ఆలోచనలు అతి గంభీరములు / అవి ఎన్నటికీ క్షేమకరములే / మనోహరములే కృపాయుతమే (2) / శాంతి జలములే సీయోను త్రోవలు (2) / నీతి మార్గములో నన్ను నడుపుచుండగా / సూర్యుని వలె నే తేజరిల్లెదను / నీ రాజ్య మర్మములు ఎరిగిన వాడనై (2) / జీవించెదను నీ సముఖములో (2) / సువార్తకు నన్ను సాక్షిగా నిలిపితివి / ఆత్మల రక్షణ నా గురి చేసితివి / పరిశుద్ధతలో నే నడిచెదను (2) / భళా మంచి దాసుడనై నీ సేవలో (2)
మరణము నన్నేమి చేయలేదు / పరిస్థితి నన్నేమి చేయగలదు (2) / నీ కృప సమృద్ధిగా / నాపై నిలిపి తోడైయున్నావు (2) ||మరణము|| / నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే / నీ వాక్యమే నాకు దేదీప్య వెలుగాయే (2) / నను సీయోనులో చేర్చుకొనుటే / నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము|| / నీ రూపమును పొంది జీవించుటే ఆశ / సీయోను పాటలు గొర్రె పిల్లతో పాడి (2) / విశ్వసింపబోవు వారికి మాదిరిగా నేనుండుటే / నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము|| / నీ కొరకు శ్రమపడుటే నాకెంతో భాగ్యము / పరిశుద్ధ పేదలను ఆదరింప కృపనిమ్ము (2) / నా ముఖమును చూడని వారి కొరకు ప్రార్దించుటే / నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము|| / నీ కొరకు ఖైదీనై ఉండుటే ధన్యత / సంఘమును మేల్కొలిపే ఊటలు దయచేసి (2) / దెయ్యాలు గడ గడ వనుకుచు కేకలు వేసే సేవ చేయుటే / నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము||
నా కలవరములన్ని కనుమరుగు చేసినావు / నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి కవిలెలో వ్రాసినావు – (2) / నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో / కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము|| / నీ చేయి నన్ను సంరక్షించెను / నా శత్రువులు కీడు చేయలేకపోయిరి (2) / నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో / కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము|| / యెహోవా యుద్ధములు చేయుటకు కృపనిచ్చితివి / శాశ్వతమైన సంతతిని స్వాస్థ్యముగా నాకిచ్చితివి (2) / నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో / కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము|| / బ్రతుకు దినములన్నిటను అపాయమే రాదు / జీవిత కాలమంతా నాకు కీడే లేదు (2) / నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో / కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము|| / నిన్ను నమ్మువారు సీయోనులో చేరి / నిత్యానందపు భాగ్యమును పొందెదరు (2) / నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో / కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము||
ఎడబాయని నీదు కృప – విడనాడని నీ ప్రేమ (2) / నన్నెంతగానో బలపరచెను / నన్నెంతగానో స్థిరపరచెను (2) / నన్ను బలపరచెను – నన్ను వెంబడించెను / నన్నెంతగానో స్థిరపరచెను (2) ||ఎడబాయని|| / కన్నీటి లోయలలో నుండి / నన్ను దాటించిన దేవా / సింహాల బోనులలో నుండి / నన్ను విడిపించిన ప్రభువా (2) ||నన్ను బలపరచెను|| / నేనున్నతమైన స్థితిలో / ఉండాలని ఆశించితివా / ఏ అర్హత నాకు లేకున్నా / నా కృప నీకు చాలునంటివే (2) ||నన్ను బలపరచెను|| / నేనెదుర్కొనలేని పరిస్థితులు / నా ఎదుట ఉన్నవి దేవా / నీ శక్తిని నేను కోరెదను / నన్ను విడిపించు నా దేవా (2) ||నన్ను బలపరచెను||
ఒక వరమడిగితిని యేసయ్యా / నీలా ఉండాలని – మండుచుండాలని / నీలా ఉండాలని – మండుచుండాలని (2) / యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ఒక వరమడిగితిని|| / నాలో నేరము స్థాపించగలరా / ప్రతిధ్వని ఇచ్చెను నీ స్వరము ధరలో (2) / నన్ను పరిశుద్ధపరచి తుది శ్వాస వరకు / నీ మార్గములలో నడిపించవా (2) ||ఒక వరమడిగితిని|| / సర్వ సృష్టికి సర్వాధికారి / తల వాల్చుటకును స్థలమింత లేదా (2) / నేను లోకాశ విడచి పైనున్నవాటి / గురి కలిగి వెదకి పొందాలని (2) ||ఒక వరమడిగితిని|| / తండ్రిని విడచి పారమును వీడి / నన్ను సమీపించినావు (2) / నేను కలిగున్నదంత నీ పాదాల చెంత / అర్పించి నీ చెంత చేరాలని (2) ||ఒక వరమడిగితిని|| / దేవుని చిత్తము సంపూర్తి చేయగ / సిలువలో వ్రేళాడి శ్రమ నొందినావు (2) / నేను నీ సిలువ మోయుచు కడవరకు ఇలలో / నీ సాక్షిగా జీవించాలని (2) ||ఒక వరమడిగితిని||