ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1 song found|By Alphabet|By Popularity
నూతనమైనది నీ వాత్సల్యము – ప్రతి దినము నన్ను దర్శించెను / ఎడబాయనిది నీ కనికరము – నన్నెంతో ప్రేమించెను / తరములు మారుచున్నను – దినములు గడచుచున్నను / నీ ప్రేమలో మార్పు లేదు (2) / సన్నుతించెదను నా యేసయ్యా / సన్నుతించెదను నీ నామము (2) / గడచిన కాలమంతా – నీ కృప చూపి – ఆదరించినావు / జరగబోయే కాలమంతా – నీ కృపలోన – నన్ను దాచెదవు (2) / విడువని దేవుడవు – ఎడబాయలేదు నన్ను / క్షణమైనా త్రోసివేయవు (2) ||సన్నుతించెదను|| / నా హీన దశలో – నీ ప్రేమ చూపి – పైకి లేపినావు / ఉన్నత స్థలములో – నను నిలువబెట్టి – ధైర్యపరచినావు (2) / మరువని దేవుడవు – నను మరువలేదు నీవు / ఏ సమయమైననూ చేయి విడువవు (2) ||సన్నుతించెదను|| / నీ రెక్కల క్రింద – నను దాచినావు – ఆశ్రయమైనావు / నా దాగు స్థలముగా – నీవుండినావు – సంరక్షించావు (2) / ప్రేమించే దేవుడవు – తృప్తి పరచినావు నన్ను / సమయోచితముగా ఆదరించినావు (2) ||సన్నుతించెదను||