తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

Songs by:D J Augustine

దేవా మా కుటుంబము|Devaa Maa Kutumbamu

దేవా మా కుటుంబము – నీ సేవకే అంకితము (2) / ఈ శాప లోకాన – నీ సాక్షులుగా నిలువ / నీ ఆత్మతో నింపుమా (2) ||దేవా|| / కాపరి మా యేసు ప్రభువే – కొదువేమి లేదు మాకు / మాకేమి భయము – మాకేమి దిగులు / నీకే వందనములయ్యా / లోబడి జీవింతుము – లోపంబులు సవరించుము / లోకాశలు వీడి – లోకంబులోన / నీ మందగా ఉందుము ||దేవా|| / సమృద్ధి జీవంబును – సమృద్ధిగా మాకిమ్ము / నెమ్మది గల ఇల్లు – నిమ్మళమగు మనస్సు / ఇమ్మహిలో మాకిమ్మయ్యా / ఇమ్ముగ దయచేయుము – గిన్నె నిండిన అనుభవము / ఎన్నో కుటుంబాల ధన్యులుగా జేయంగా / మమ్ములను బలపరచుము ||దేవా|| / ఏ కీడు రాకుండగా – కాపాడుము మా పిల్లలను / లోక దురు వ్యసనంలా – తాకుడు లేకుండా / దాచుము నీ చేతులలో / ఒలీవ మొక్కల వలెను ద్రాక్షా తీగెలను పోలి / ఫల సంపదలతోను – కలకాలము జీవించ / కురుపించుము నీ దీవెనలన్ ||దేవా|| / పెంపారు జేయుము మాలో – సొంపుగ నీ ఘన ప్రేమన్ / నింపుమా హృదయములు – శాంతి భాగ్యంబులతో / సంతసంబుగ సాగెదము / వింతైన నీ ప్రేమను – అంతట ప్రకటింతుము / కొంత కాలమే మేము – ఉందుము లోకాన / చెంత చేరగ కోరెదము / నీ చెంత చేరగ కోరెదము ||దేవా||