ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1 song found|By Alphabet|By Popularity
స్తుతులకు పాత్రుడా – ఘనతకు అర్హుడా / మహిమ నాథుడా – యేసు నీకే వందనం (2) / అన్ని వేళలో ఎన్నో మేళ్లతో / మమ్ము బ్రోచిన యేసు నీకే వందనం (2) / వందనం వందనం యేసు నీకే వందనం (2) / నమ్మదగిన వాడా – యేసు నీకే వందనం / నీతిమంతుడా – యేసు నీకే వందనం (2) / ఆశ్రయ దుర్గమా – నా విమోచకా (2) ||వందనం|| / ప్రేమాపూర్ణుడా – యేసు నీకే వందనం / ప్రాణ నాథుడా – యేసు నీకే వందనం (2) / పాపరహితుడా – పావన నాథుడా (2) ||వందనం||