ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
2 songs found|By Alphabet|By Popularity
ఆధారం నాకు ఆధారం / నాకు తోడునీడై ఉన్న నీ కృపయే ఆధారం / ఆశ్రయమూ నాకు ఆశ్రయమూ / ఆపత్కాలమందు ఆశ్రయమూ నీ నామం ఆశ్రయమూ / తల్లితండ్రి లేకున్నా – బంధుజనులు రాకున్నా / లోకమంత ఒకటైనా – బాధలన్ని బంధువులైనా ||ఆధారం|| / భక్తిహీన బంధంలో నేనుండగా / శ్రమల సంద్రంలో పడియుండగా (2) / ఇరుకులో విశాలతనూ కలిగించిన దేవా (2) / నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా (2) ||ఆధారం|| / దారిద్య్రపు సుడినుండి ఐశ్యర్యపు తీరానికి / నీ స్వరమె నా వరమై నడిపించిన యేసయ్యా (2) / విడువను ఎడబాయనని పలికిన నా దేవా (2) / నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా (2) ||ఆధారం|| / దిగులుపడిన వేళలలో దరిచేరిన దేవా / అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా (2) / చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా (2) / నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా (2) ||ఆధారం||
ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను / కన్నీటితో కృంగి పోతున్నాను (2) / నా యేసయ్యా నా బలమా (2) / నా దీన ప్రార్థన ఆలకించుమా ||ఇంటి మీద|| / వెతకాని బాణమును చేయుచుండె గాయములు / అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును – (2) / నీ బాలి పీఠము చెంత నాకు చోటునీయుమా (2) / ఆలకించుమా ఆదరించుమా (2) ||ఇంటి మీద|| / తెలిసి తెలిసి చేసితిని ఎన్నెన్నో పాపములు / తరచి తరచి చూచినా తరగవు నా దోషములు – (2) / నీ ఆత్మను కోల్పోయిన దీనుడను నేను (2) / ఆలకించుమా ఆదరించుమా (2) ||ఇంటి మీద||