ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
5 songs found|By Alphabet|By Popularity
ఇంతవరకు నీవు – నన్ను నడిపించుటకు / నేనేమాత్రము నా జీవితం ఏ మాత్రము / ఇంతవరకు నీవు నన్ను భరియించుటకు / నేనేమాత్రము మేము ఏ మాత్రము / నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే / నే చూచే ఘనకార్యములు నీ దయ వలెనే (2) ||ఇంతవరకు|| / ఎన్నుకొంటివే నన్ను ఎందుకని / హెచ్చించితివే నన్ను ఎందుకని (2) / మందను వెంటాడి తిరుగుచుంటినే (2) / సింహాసనం ఎక్కించి మైమరచితివే (2) ||నే చూచిన|| / నా ఆలోచనలన్ని చిన్నవని / నీ ఆలోచనల వలనే తెలుసుకొంటినే (2) / తాత్కాలిక సహాయము నే అడిగితినే (2) / యుగయుగాల ప్రణాళికలతో నను నింపితివే (2) ||నే చూచిన||
నీ పిలుపు వలన నేను నశించిపోలేదు / నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు / నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను / నీ ప్రేమకు సాటి లేదు (2) / నశించుటకు ఎందరో వేచియున్నను / నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను / ద్రోహము నిందల మధ్యలో నే నడచినను / నీ నిర్మల హస్తము నన్ను భరియించెను / యజమానుడా నా యజమానుడా… / నన్ను పిలచిన యజమానుడా / యజమానుడా నా యజమానుడా… / నన్ను నడిపించే యజమానుడా / మనుషులు మూసిన తలుపులు కొన్నైనను / నాకై నీవు తెరచినవి అనేకములు / మనోవేదనతో నిన్ను విడిచి పరుగెత్తినను / నన్ను వెంటాడి నీ సేవను చేసితివి / నా ఆధారమా నా దైవమా / పిలిచిన ఈ పిలుపునకు కారణమా (2) / పిలిచిన నీవు నిజమైన వాడవు / నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు / ఏదేమైనను కొనసాగించితివి / నీపై ఆధారపడుటకు అర్హుడవు / నిన్ను నమ్మెదను వెంబడింతును / చిరకాలము నిన్నే సేవింతును (2) ||నీ పిలుపు||
నన్ను పిలిచిన దేవా – నన్ను ముట్టిన ప్రభువా / నీవు లేనిదే నేను లేనయ్యా (2) / నే జీవించునది నీ కృప – ఎదుగించునది నీ కృప / హెచ్చుంచునది నీ కృప మాత్రమే (2) / నీ కృపయే కావలెను – నీ కృపయే చాలును / నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా (2) యేసయ్యా… / ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదార్చువారు లేరు / తొట్రిల్లి నడిచినప్పుడు ఆదుకొన్నవారు లేరు (2) / బిగ్గరిగా ఏడిచినప్పుడు కన్నీరు తుడిచే కృప (2) / నీ కృప లేకుంటేనే నేను లేను / నీ కృప లేకుంటేనే నేనేమి లేను ||నీ కృపయే|| / నేనని చెప్పుటకు నాకేమి లేదు / సామర్ధ్యము అనుటకు నాకని ఏమి లేదు (2) / అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప (2) / నీ కృప లేకుంటేనే నేను లేను / నీ కృప లేకుంటేనే నేనేమి లేను ||నీ కృపయే||
నన్ను పిలచిన దేవా – నన్ను ముట్టిన ప్రభువా / నీవు లేనిదే నేను లేనయ్యా (2) / నే జీవించునది నీ కృప – ఎదుగించునది నీ కృప / హెచ్చించునది నీ కృప మాత్రమే (2) / నీ కృపయే కావలెను – నీ కృపయే చాలును / నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా (2) యేసయ్యా … / ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదార్చువారు లేరు / తొట్రిల్లి నడిచినప్పుడు ఆదుకొన్నవారు లేరు (2) / బిగ్గరగా ఏడిచినప్పుడు కన్నీరు తుడిచె కృప (2) / నీ కృప లేకుంటేనే నేను లేను / నీ కృప లేకుంటేనే నేనేమి లేను ||నీ కృపయే|| / నేనని చెప్పుటకు నాకేమి లేదు / సామర్థ్యం అనుటకు నాకని ఏమి లేదు (2) / అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప (2) / నీ కృప లేకుంటేనే నేను లేను / నీ కృప లేకుంటేనే నేనేమి లేను ||నీ కృపయే||
నిను పోలిన వారెవరూ – మేలు చేయు దేవుడవు / నిన్నే నే నమ్మితిన్ నా దేవా (2) / నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటిని / నీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య (2) / ఎల్ షడ్డాయ్ ఆరాధన – ఎలోహిం ఆరాధన / అడోనాయ్ ఆరాధన – యేషువా ఆరాధన (2) / కృంగియున్న నన్ను చూచి / కన్నీటిని తుడిచితివయ్య / కంటి పాప వలే కాచి / కరుణతో నడిపితివయ్య (2) ||ఎల్ షడ్డాయ్|| / మరణపు మార్గమందు / నడిచిన వేళయందు / వైద్యునిగా వచ్చి నాకు / మరో జన్మనిచ్చితివయ్య (2) ||ఎల్ షడ్డాయ్||