ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
2 songs found|By Alphabet|By Popularity
తోడు లేరని కుమిలిపోకు / యేసే నీ తోడు ఉన్నాడు చూడు (2) / ఓహో సోదరా యేసే నీ గురి (2) ||తోడు|| / ఆదరణ లేక అల్లాడిపోకు / శోధన వేదనలో కృంగిపోకు (2) / ఆదరించే వాడే యేసు / అల్లాడిపోకు ఓ సోదరా (2) ||ఓహో సోదరా|| / విడువడు యేసు ఎడబాయడెన్నడు / అనుక్షణము నిన్ను కాపాడును (2) / ఆయన మీదనే భారము మోపు / ఆయనే నిన్ను ఆదుకొంటాడు (2) ||ఓహో సోదరా||
ఎవరికి ఎవరు ఈ లోకంలో / చివరికి యేసే పరలోకంలో (2) ||ఎవరికి|| / ఎవరెవరో ఎదురౌతుంటారు / ప్రాణానికి నా ప్రాణం అంటారు (2) / కష్టాలలో వారు కదిలి పోతారు / కరుణగల యేసు నాతో ఉంటాడు (2) ||ఎవరికి|| / ధనము నీకుంటే అందరు వస్తారు / దరిద్రుడవైతే దరికెవ్వరు రారు (2) / ఎవరిని నమ్మిన ఫలితము లేదురా / యేసుని నమ్మితే మోక్షం ఉందిరా (2) ||ఎవరికి|| / మనుషుల సాయం వ్యర్ధమురా / రాజుల నమ్మిన వ్యర్ధమురా (2) / యెహోవాను ఆశ్రయించుట / ఎంత మేలు.. ఎంతో మేలు (2) ||ఎవరికి||