ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1 song found|By Alphabet|By Popularity
ఏ చెట్టు గుట్ట పుట్ట మట్టి మోక్ష్యమునీయదయ్యా / ఏ రాయి రప్ప దేవుళ్లంతా మార్గము చూపరయ్యా (2) / యేసే నిజ దేవుడు – పాపుల రక్షించును (2) ||ఏ చెట్టు|| / పాపమంతయూ తొలగింపను – దైవమే దిగి వచ్చెను / గొర్రెపిల్లగా తల వంచెను – ప్రాణమునే అర్పించెను / నరుల పాపము తన భుజాలపై / మోపుకొనెను పరమ దేవుడు (2) / నమ్మిన వారై రక్షణ పొంద / స్వర్గానికే చేరుకుందమా (2) ||ఏ చెట్టు|| / మహిమ రూపుడే మనిషి జన్మలో – భువికి అవతరించెను / సిలువ మ్రానుపై వ్రేళాడెను – రక్తము చిందించెను / యేసు లేచెను మరణము గెలిచి / నమ్మిన వారిని పరమును చేర్చ (2) / హల్లెలూయా ఆనందమే / హల్లెలూయా సంతోషమే (2) ||ఏ చెట్టు||