తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

Songs by:Annie Margaret

నిను పోలి నేను|Ninu Poli Nenu

చీకటిలో నుండి వెలుగునకు / నన్ను నడిపిన దేవా (2) / నా జీవితానిని వెలిగించిన / నా బ్రతుకును తేటపరిచిన (2) / నన్ను నీవు రక్షించితివయ్యా / నీ కృప చేత నే బ్రతికితినయ్యా / నన్ను నీవు కాపాడితివయ్యా / నీ దయతో నన్ను దీవించితివయ్యా / యేసయ్యా నా యేసయ్యా / నీవే నా బలము యేసయ్యా / యేసయ్యా నా యేసయ్యా / నీవే నా సర్వము యేసయ్యా / నిను పోలి నేను జీవింతునయ్యా / నీ ఆత్మ దయచేయుమా / నిను పోలి నేను నడతునయ్యా / నీ కాపుదలనీయుమా / కనికరమే లేని ఈ లోకంలో / కన్నీటితో నేనుంటినయ్యా (2) / నీ ప్రేమతో నను ఆదరించిన / నా హృదయము తృప్తిపరచిన (2) ||నన్ను నీవు|| / నిను పోలి నేను జీవింతునయ్యా / నీ ఆత్మ దయచేయుమా / నిను పోలి నేను నడతునయ్యా / నీ కాపుదలనీయుమా (2)