తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

Songs by:Andhra Kraisthava Keerthanalu

18 songs found|By Alphabet|By Popularity

కుమ్మరి ఓ కుమ్మరి|Kummari o kummari

కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి / జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా / ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా / పనికిరాని పాత్రనని – పారవేయకుమా / పొంగి పొరలు పాత్రగా – నన్ను నింపుమా (2) / సువార్తలోని పాత్రలన్నీ – శ్రీ యేసుని పొగడుచుండ / సాక్షిగానుండు పాత్రగజేసి – సత్యముతో నింపుము తండ్రి / ఆ ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి ||కుమ్మరి|| / విలువలేని పాత్రను నేను – కొనువారు లేరెవ్వరు / వెలలేని నీదు రక్తంబుతో – వెలుగొందు పాత్రగజేసి (2) / ఆటంకములనుండి తప్పించి నన్ను – ఎల్లప్పుడు కావుమయ్యా / పగిలియున్న పాత్రను నేను – సరిచేసి వాడుమయ్యా / ఆ ఆ ఆ సరిచేసి వాడుమయ్యా ||కుమ్మరి|| / లోకాశతో నిండి ఉప్పొంగుచూ – మార్గంబు నే దప్పితిన్ / మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే – మనశ్శాంతి కోల్పోతిని (2) / పోగొట్టుకున్న పాత్రయనుచు – పరుగెత్తి నను పట్టితివి / ప్రాణంబు నాలో ఉన్నప్పుడే – నీ పాదంబుల్ పట్టితిన్ / ఆ ఆ ఆ నీ పాదంబుల్ పట్టితిన్ ||కుమ్మరి||

దేవుని స్తుతియించుడి|Devuni Sthuthiyinchudi

దేవుని స్తుతియించుడి / ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ||దేవుని|| / ఆయన పరిశుద్ధ ఆలయమందు (2) / ఆయన సన్నిధిలో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| / ఆయన బలమును ప్రసిద్ధి చేయు (2) / ఆకశవిశాలమందు ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| / ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి (2) / ఆయన ప్రభావమును ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| / బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి (2) / స్వరమండలములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| / సన్న తంతుల సితారతోను (2) / చక్కని స్వరములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| / తంబురతోను నాట్యముతోను (2) / తంతి వాద్యములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| / పిల్లనగ్రోవుల చల్లగనూది (2) / ఎల్లప్రజలు జేరి ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| / మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడి (2) / గంభీర తాళముతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| / సకల ప్రాణులు యెహోవన్ స్తుతించుడి (2) / హల్లెలూయా ఆమెన్ ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||

సాగిలపడి మ్రొక్కెదము|Saagilapadi Mrokkedamu

సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మలో / మన ప్రభు యేసుని ఆ ఆ ఆఆ (2) ||సాగిలపడి|| / మోషేకంటే శ్రేష్టుడు / అన్ని మోసములనుండి విడిపించున్ (2) / వేషధారులను ద్వేషించున్ / ఆశతో మ్రొక్కెదము (2) ||సాగిలపడి|| / అహరోనుకంటే శ్రేష్టుడు / మన ఆరాధనకు పాత్రుండు (2) / ఆయనే ప్రధాన యాజకుడు / అందరము మ్రొక్కెదము (2) ||సాగిలపడి|| / ఆలయముకన్న శ్రేష్టుడు / నిజ ఆలయముగ తానే యుండెన్ (2) / ఆలయము మీరేయనెను / ఎల్లకాలము మ్రొక్కెదము (2) ||సాగిలపడి|| / యోనా కంటె శ్రేష్టుడు / ప్రాణ దానముగా తన్ను అర్పించెన్ (2) / మానవులను విమోచించెన్ / ఘనపరచి మ్రొక్కెదము (2) ||సాగిలపడి|| / సొలోమోను కన్న శ్రేష్ఠుడు / సర్వజ్ఞానమునకు ఆధారుండు (2) / పదివేలలో అతిప్రియుండు / పదిలముగ మ్రొక్కెదము (2) ||సాగిలపడి|| / రాజులకంటే శ్రేష్ఠుడు / యాజకులనుగా మనలను చేసెన్ (2) / రారాజుగ త్వరలో వచ్చున్ / రయముగను మ్రొక్కెదము (2) ||సాగిలపడి|| / అందరిలో అతి శ్రేష్ఠుడు / మనకందరికి తానే ప్రభువు (2) / హల్లెలూయకు పాత్రుండు / అనుదినము మ్రొక్కెదము (2) ||సాగిలపడి||

దేవునికి స్తోత్రము గానము|Devuniki Sthothramu Gaanamu

దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది / మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది / యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని / ఇశ్రయేలీయులను పోగుచేయువాడని ||దేవునికి|| / గుండె చెదరిన వారిని బాగుచేయువాడని / వారి గాయములన్నియు కట్టుచున్నవాడని ||దేవునికి|| / నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును / వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని ||దేవునికి|| / ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు / జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని ||దేవునికి|| / దీనులకు అండాయెనే భక్తిహీనుల కూల్చును / సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి ||దేవునికి|| / ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును / భూమికొరకు వర్షము సిద్ధపరచువాడని ||దేవునికి|| / పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను / అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును ||దేవునికి|| / గుర్రముల నరులందలి బలము నానందించడు / కృప వేడు వారిలో సంతసించువాడని ||దేవునికి|| / యెరుషలేము యెహోవను సీయోను నీ దేవుని / కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని ||దేవునికి|| / పిల్లల నాశీర్వదించియు బలపరచు నీ గుమ్మముల్ / మంచి గోధుమపంటతో నిన్ను తృప్తిగనుంచును ||దేవునికి|| / భూమికి తనయాజ్ఞను ఇచ్చువాడు ఆయనే / వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును ||దేవునికి|| / వాక్యమును యాకోబుకు తెలియచేసినవాడని / ఏ జనముకీలాగున చేసియుండలేదని ||దేవునికి||