ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
7 songs found|By Alphabet|By Popularity
దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింప / ఎంతో ఎంతో మహిమ / నిన్ను భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప / ఎంతో ఎంతో మహిమ / నిన్ను భజియించి పూజించి ఆరాధింప / నీకే నీకే మహిమ (2) / దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింప / ఎంతో ఎంతో మహిమ / ఈ భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప / ఎంతో ఎంతో మహిమ / మహిమా నీకే మహిమా – (4) ||దేవా|| / కష్టాలలోన నష్టాలలోన / కన్నీరు తుడిచింది నీవే కదా (2) / నా జీవితాంతం నీ నామ స్మరణే / చేసేద నా యేసయ్యా (2) ||మహిమా|| / నా కొండ నీవే నా కోట నీవే / నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే (2) / నిన్నే భజించి నిన్నే స్తుతించి / ఆరాధింతునయా (2) ||మహిమా||
ఆరని ప్రేమ ఇది – ఆర్పజాలని జ్వాల ఇది (2) / అతి శ్రేష్టమైనది – అంతమే లేనిది / అవధులే లేనిది – అక్షయమైన ప్రేమ ఇది (2) / కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది (2) ||ఆరని|| / సింహాసనము నుండి – సిలువకు దిగి వచ్చినది / బలమైనది మరణము కన్నా – మృతిని గెల్చి లేచినది (2) / ఇది సజీవమైనది – ఇదే సత్యమైనది / ఇదే నిత్యమైనది – క్రీస్తు యేసు ప్రేమ ఇది (2) / కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది (2) ||ఆరని|| / నా స్థానమందు నిలిచి – నా శిక్షనే భరియించి / క్రయ ధనమును చెల్లించి – గొప్ప రక్షణ నిచ్చినది (2) / నాకు విలువ నిచ్చినది – నన్ను వెలిగించినది / ఆ ఉన్నత రాజ్యమందు – నాకు స్థానమిచ్చినది (2) / ఉన్నత ప్రేమ ఇది – అత్యున్నత ప్రేమ ఇది (2) ||ఆరని|| / భూ రాజులు అధిపతులు – రాజ్యాలు అధికారాలు / చెరయైనా ఖడ్గమైనా – కరువైనా ఎదురైన (2) / ఎవరు ఆర్పలేనిది – ఎవరు ఆపలేనిది / ప్రవహించుచున్నది – ప్రతి పాపి చెంతకు (2) / ప్రేమ ప్రవాహమిది – యేసు ప్రేమ ప్రవాహమిది (2) ||ఆరని||
జీవింతు నేను ఇకమీదట – నా కొరకే కాదు / యేసు కొరకే జీవింతును (2) / నన్ను ప్రేమించిన – ప్రియ యేసు కొరకే / నాకై ప్రాణమిచ్చిన – ప్రభు యేసు కొరకే / జీవింతును జీవింతును / జీవింతును జీవింతును (2) ||జీవింతు|| / నీ ఉన్నత పిలుపుకు లోబడదున్ – గురివైపునకే / బహుమానము పొందగ పరుగిడుదున్ / వెనుకవున్నవన్నీ మరతును – ముందున్నవాటి / కొరకే నే వేగిరపడుదును (2) / నన్ను ప్రేమించిన యేసుని చూతును / నాకై ప్రాణమిచ్చిన ప్రభుని వెంబడింతును / గురి వైపుకే – పరుగెడుదును / వెనుదిరుగను – వెనుదిరుగను (2) ||జీవింతు|| / శ్రమయైనా బాధైననూ – హింసయైనా / కరువైనా ఎదురైననూ / ఉన్నవైన రాబోవునవైనా – అధికారులైనా / ఎతైనా లోతైననూ (2) / నన్ను ఎడబాపునా ప్రభు ప్రేమనుండి / నేను విడిపోదునా ప్రభు నీడనుండి / జీవింతును – నా యేసుతో / జయమిచ్చును – నా యేసుడే (2) ||జీవింతు||
స్తుతి మహిమ యేసు నీకే / స్తుతి ఘనత ప్రభు నీకే (2) / ఆరాధన స్తుతి ఆరాధన (8) ||స్తుతి|| / కళ్ళల్లో కన్నీరు తుడిచావు / గుండె బరువును దింపావు (2) / వ్యధలో ఆదరించావు / హృదిలో నెమ్మదినిచ్చావు (2) / యెహోవా షాలోమ్ ఆరాధన (8) ||స్తుతి|| / నీవొక్కడవే దేవుడవు / మిక్కిలిగా ప్రేమించావు (2) / రక్తము నాకై కార్చావు / రక్షణ భాగ్యమునిచ్చావు (2) / యెహోవా రూహీ ఆరాధన (8) ||స్తుతి|| / నను బ్రతికించిన దేవుడవు / నాకు స్వస్థత నిచ్చావు (2) / నా తలను పైకెత్తావు / నీ చిత్తము నెరవేర్చావు (2) / యెహోవా రాఫా ఆరాధన (8) ||స్తుతి||
హోలీ హోలీ హోలీ / హి ఈస్ ద లార్డ్ గాడ్ ఆల్మైటీ / హూ వాస్ అండ్ ఈస్ అండ్ ఈస్ టు కం (2) / ఎలోహిం ఎలోహిం ఎలోహిం ఎలోహిం / బలమైన దేవుడవు – బలవంతుడవు నీవు – (2) / శూన్యములో సమస్తమును – నిరాకారములో ఆకారము / సృజియించినావు నీవు – సర్వ సృష్టికర్తవు నీవు – (2) / హల్లెలూయా హల్లెలూయా – (2) / హల్లెలూయా హల్లెలూయా / హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2) / ఎల్ ఒలం ఎల్ ఒలం ఎల్ ఒలం ఎల్ ఒలం / అల్ఫా ఒమేగవు – నిత్యుడైన దేవుడవు – (2) / నిత్య నిబంధన చేసావు – నిబంధనని స్థిరపరచావు / నిన్నా నేడు రేపు – మారని దేవుడవు నీవు – (2) / హల్లెలూయా హల్లెలూయా – (2) / హల్లెలూయా హల్లెలూయా / హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2) / ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ / పోషించు దేవుడవు – ఆశ్రయ దుర్గము నీవు – (2) / రెక్కలపై మోసెడి వాడా – రక్షణ శృంగము నీవేగా / నీ మాటున దాచే దేవా – మాటను నెరవేర్చే దేవా – (2) / హల్లెలూయా హల్లెలూయా – (2) / హల్లెలూయా హల్లెలూయా / హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2) / అడోనై అడోనై అడోనై అడోనై / ప్రభువైన దేవుడవు – ప్రభువులకు ప్రభువు నీవు – (2) / సర్వాధికారివి నీవు – సకల జనులకు ప్రభువు నీవు / నీవే నాకు ప్రభువు – నీవే నా యజమానుడవు – (2) / హల్లెలూయా హల్లెలూయా – (2) / హల్లెలూయా హల్లెలూయా / హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2) / యావే యావే యావే యావే / యెహోవా దేవా – సైన్యములకు అధిపతివి – (2) / పరిశుద్ధ దేవుడవు నీవు – ఉన్నవాడనని అన్నావు / ప్రభు యేసును పంపిన దేవా – పాపము తొలగించిన దేవా – (2) / హల్లెలూయా హల్లెలూయా – (2) / హల్లెలూయా హల్లెలూయా / హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2)
స్తుతి సింహాసనాసీనుడా / యేసు రాజా దివ్య తేజా (2) / అద్వితీయుడవు పరిశుద్ధుడవు / అతి సుందరుడవు నీవే ప్రభూ (2) / నీతి న్యాయములు నీ సింహాసనాధారం (2) / కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు (2) ||స్తుతి|| / బలియు అర్పణ కోరవు నీవు / బలియైతివి నా దోషముకై (2) / నా హృదయమే నీ ప్రియమగు ఆలయం (2) / స్తుతియాగమునే చేసెద నిరతం (2) ||స్తుతి|| / బూరధ్వనులే నింగిలో మ్రోగగా / రాజధిరాజ నీవే వచ్చువేళ (2) / సంసిద్ధతతో వెలిగే సిద్దెతో (2) / పెండ్లి కుమరుడా నిన్నెదుర్కొందును (2) ||స్తుతి||
అత్యున్నత సింహాసనముపై – ఆసీనుడవైన దేవా / అత్యంత ప్రేమా స్వరూపివి నీవే / ఆరాధింతును నిన్నే (2) / ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. హల్లెలూయా (3) / ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. ఆమెన్ / ఆశ్చర్యకరుడా స్తోత్రం / ఆలోచనకర్త స్తోత్రం / బలమైన దేవా నిత్యుడవగు తండ్రి / సమాధాన అధిపతి స్తోత్రం (2) ||ఆహాహా|| / కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం / కృపతో రక్షించితివే స్తోత్రం / నీ రక్తమిచ్చి విమోచించినావు / నా రక్షణకర్త స్తోత్రం (2) ||ఆహాహా|| / స్తుతులపై ఆసీనుడా స్తోత్రం / సంపూర్ణుడా నీకు స్తోత్రం / మా ప్రార్థనలు ఆలకించువాడా / మా ప్రధాన యాజకుడా స్తోత్రం (2) ||ఆహాహా|| / మృత్యుంజయుడా స్తోత్రం / మహాఘనుడా స్తోత్రం / మమ్మును కొనిపోవ త్వరలో రానున్న / మేఘ వాహనుడా స్తోత్రం (2) ||ఆహాహా|| / ఆమెన్ అనువాడా స్తోత్రం / అల్ఫా ఒమేగా స్తోత్రం / అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా / అత్యున్నతుడా స్తోత్రం (2) ||ఆహాహా||