తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

Songs by:Akumarthi Daniel

నీతో సమమెవరు|Neetho Samamevaru

నీతో సమమెవరు – నీలా ప్రేమించేదవరు / నీలా క్షమియించేదెవరు – యేసయ్యా / నీలా పాపికై ప్రాణం పెట్టిన – వారెవరు (2) / లోక బంగారము – ధన ధాన్యాదులు / ఒక పోగేసినా – నీతో సరితూగునా / జీవ నదులన్నియు – సర్వ సంద్రములు / ఒకటై ఎగసినా – నిన్ను తాకగలవా / లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన / నీవేగా చాలిన దేవుడవు ||నీతో|| / పలు వేదాలలో – మత గ్రంథాలలో / పాపమే సోకని – పరిశుద్దుడేడి / పాప పరిహారార్థం – సిలువ మరణమొంది / తిరిగి లేచినట్టి – దైవ నరుడెవ్వరు / నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా / నీవేగా మంచి దేవుడవు ||నీతో|| / నేను వెదకకున్నా – నాకు దొరికితివి / నేను ప్రేమించకున్నా – నన్ను ప్రేమించితివి / పలు గాయాలు చేసి – తరచు రేపితిని / నన్నెంతో సహించి – క్షమియించితివి / నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి / నీవేగా విమోచకుడవు ||నీతో||

ఏ సమయమందైనా|Ae Samayamandainaa

ఏ సమయమందైనా ఏ స్థలమందైనా / ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్ (2) / ఆరాధనా ఆరాధనా / నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా / ఆరాధనా ఆరాధనా / గొర్రెపిల్ల క్రీస్తుకే ఆరాధనా ||ఏ సమయమందైనా|| / చెరసాలలో నేను బంధీగా ఉన్నా / సింహాల బోనులో పడవేసినా / కరువు ఖడ్గము హింస ఏదైననూ / మరణ శాసనమే పొంచున్ననూ / యేసు నామమే ఆధారము కాదా / యేసు రక్తమే నా విజయము / పగలు ఎండలలో రాత్రి వెన్నెలలో / కునుకక కాపాడు యేసు దేవునికే ||ఆరాధనా|| / నా జీవనాధారం శ్రీ యేసుడే / నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే / తన చేతులతో నన్ను నిర్మించెగా / నా సృష్టికర్తను కొనియాడెదన్ / యెహోవ రాఫా నను స్వస్థ పరిచెను / యెహోవ షమ్మా నాకు తోడుగా / యెహోవ నిస్సీ నా ధ్వజముగా / అల్ఫా ఒమేగా ఆది దేవునికే ||ఆరాధనా||