ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
8 songs found|By Alphabet|By Popularity
బంధము నీవే – స్నేహము నీవే (2) / (యేసయ్యా) అతిథివి నీవేనయ్యా / ఆప్తుడా నీవేనయ్యా (2) / ప్రేమించువాడా కృప చూపువాడా / నాతోనే ఉండి నను నడుపువాడా (2) / కాలాలు మారినా మారని వాడా (2) / విడువవు నను ఎప్పుడూ / మరువని తండ్రివయ్యా (2) ||బంధము|| / మూగబోయిన నా గొంతులోన / గానము నీవై నను చేరినావా (2) / హృదయ వీనవై మధుర గానమై (2) / నాలోనే ఉన్నావయ్యా / నా ఊపిరి నీవేనయ్యా (2) ||బంధము|| / ఈ లోకములో యాత్రికుడను / ఎవ్వరు లేని ఒంటరినయ్యా (2) / నీవే నాకు సర్వము దేవా (2) / చాలును చాలునయ్యా / నీ సన్నిధి చాలునయ్యా (2) ||బంధము||
నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయ్యా (2) / తడిసెదను.. నీ జీవనదిలో (2) / తడిసి తడిసి ఆనందించెదా (2) ||నీ ఆనంద|| / వీడిపోయెను నా పాప సంకెళ్లు / నన్ను తొలగిపోయెను నా శాపపు కట్లు (2) / దైవమా.. నీవే ఇచ్చావు రక్షణ (2) / నే మరువగలనా నీ మంచి ప్రేమ (2) ||నీ ఆనంద|| / నీ ఆత్మ నాకు తోడుండగా / కానెన్నడు కాను ఒంటరిని (2) / ప్రేమా ప్రవాహం ఉంచావే నాలోన (2) / నే మరువగలనా నా హృదయములో (2) ||నీ ఆనంద|| / నే దాటిపోదును దేశ సరిహద్దులు / ప్రకాశించెద చీకటి లోకంలో (2) / జీవితం అంకితం చేస్తున్నా యేసయ్యా (2) / నన్ను వాడుకొనుమా నీ దివ్య సేవలో (2) ||నీ ఆనంద||
మహిమాన్వితము మనోహరము / నీ దివ్య సన్నిధానము (2) / నిన్నే కోరానయ్య – నిన్నే చేరానయ్య / నీవే కావాలని యేసయ్య (2) ||మహిమాన్వితము|| / కోరలేదు ధన సంపద / కోరినాను నిను మాత్రమే (2) / ఐశ్వర్యము కంటే అధికుడవు (2) / నీ ఆశ్రయమే చాలునయా (2) ||నిన్నే|| / జీవపు ఊటలు కల చోటికి / జీవ నదులు పారే చోటికి (2) / ప్రేమతో పిలచిన నా యేసయ్యా (2) / నా దాహమును తీర్చెదవు (2) ||నిన్నే|| / తేజోనివాసుల నివాసము / చేరాలనునదే నా ఆశయ్యా (2) / యుగయుగములు నే నీతో ఉండి (2) / నిత్యారాధన చేయాలని (2) ||నిన్నే||
నేను కూడా ఉన్నానయ్యా / నన్ను వాడుకో యేసయ్యా (2) / పనికిరాని పాత్రనని / నను పారవేయకు యేసయ్యా (2) / జ్ఞానమేమి లేదుగాని / నీ సేవ చేయ ఆశ ఉన్నది (2) / నీవే నా జ్ఞానమని (2) / నీ సేవ చేయ వచ్చినానయ్య (2) ||నేను|| / ఘనతలొద్దు మెప్పులొద్దు / ధనము నాకు వద్దే వద్దు (2) / నీవే నాకు ఉంటే చాలు (2) / నా బ్రతుకులోన ఎంతో మేలు (2) ||నేను|| / రాళ్లతో నన్ను కొట్టిన గాని / రక్తము కారిన మరువలేనయ్యా (2) / ఊపిరి నాలో ఉన్నంత వరకు (2) / నీ సేవలో నేను సాగిపోదునయా (2) ||నేను|| / మోషే యెహోషువాను పిలిచావు / ఏలీయా ఎలీషాను నిలిపావు (2) / పేతురు యోహాను యాకోబులను (2) / అభిషేకించి వాడుకున్నావు (2) ||నేను||
ఆత్మీయ గానాలతో / నిన్నే ఆరాధన చేయనా / స్తుతి స్తోత్ర గీతాలతో / నీ నామము పూజించనా (2) / మహిమ ఘనత ప్రభావములు / నీకే చెల్లించుచున్నానయ్యా (2) / ఆరాధించనా నీ పాద సన్నిధి (2) / స్తుతి పాత్రుడా – స్తోత్రార్హుడా / ఆరాధనా నీకే ఆరాధనా (2) ||ఆత్మీయ|| / సమీపించరాని తేజస్సులో / వసియించుచున్న పరిశుద్ధుడా (2) / కెరూబులు సెరాపులు (2) / దీవా రాత్రులు నీ సన్నిధిలో (2) / స్తోత్రం చేసెనా నా ప్రాణ నాథుడా (2) ||స్తుతి పాత్రుడా|| / అందరిలోను అతి శ్రేష్టుడా / వేల్పులలోన మహనీయుడా (2) / పూజార్హుడా స్తోత్రార్హుడా (2) / అతి సుందరుడా మనోహరుడా (2) / చేతులెత్తనా నీ సన్నిధి కాంతిలో (2) ||స్తుతి పాత్రుడా|| / అగ్ని జ్వాలల వంటి నేత్రాలు గలవాడా / అపరంజిని పోలిన పాదాలు గలవాడా (2) / (దేవా) విస్తార జల నదుల శబ్దము పోలిన (2) / స్వరమును కలిగిన ఘననీయుడా (2) / శిరము వంచనా సర్వోన్నతుడా (2) ||స్తుతి పాత్రుడా||
బ్రతుకుట నీ కోసమే / మరణమైతే నాకిక మేలు (2) / సిలువ వేయబడినానయ్యా (2) / నీవే నాలో జీవించుమయ్యా (2) / యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (2) / ఏ క్షణమైనా ఏ దినమైనా / నీ కొరకే నే జీవించెద (2) / శ్రమలైనా శోధనలైనా / ఇరుకులైనా ఇబ్బందులైనా (2) / ఊపిరి ఉన్నంత వరకు నీ సేవలో సాగెదనయ్యా (2) / సేవలో సాగెదనయ్యా.. ||యేసయ్యా|| / లోకములోని నిందలు నాపై / రాళ్ళై రువ్విన రంపాలై కోసిన (2) / రాజులైనా అధిపతులైనా / ఉన్నవి అయినా రాబోవువైనా (2) / నీదు ప్రేమ నుండి ఏవి ఎడబాపవయ్యా (2) / ఏవి ఎడబాపవయ్యా.. ||యేసయ్య||
నా యెడల నీకున్న తలంపులన్ని (2) / ఎంతో ఎంతో విస్తారమైనవి యేసయ్య (2) / అవి రమ్యమైనవి అమూల్యమైనవి(2) / నిత్యము నన్నే చూచుచున్నావా యేసయ్య / నాకై నీవు తలంచుచున్నావా (2) ||నా యెడల|| / రాజువైన నీవు దాసుడవయ్యావా / దాసుడనైన నన్ను రాజుగా చేయుటకే (2) / అభిషేకించావు అధికారం ఇచ్చావు (2) / పరలోకంలో పరిశుద్ధులతొ సావాసం ఇచ్చావు / నీకే స్తోత్రము యేసయ్య (2) ||నా యెడల|| / ధనవంతుడవై ఉండి దరిద్రుడవయ్యావా / దరిద్రుడనైన నన్ను ధనవంతునిగా చేయుటకే (2) / ఐశ్వర్యమిచ్చావు నను ఆశీర్వదించావు (2) / సుఖశాంతులతో నింపి కాపాడుచున్నావు (2) / నీకే స్తోత్రము యేసయ్య (2) ||నా యెడల|| / బలవంతుడవై ఉండి బలహీనుడవయ్యావా / బలహీనుడనైన నన్ను బలవంతునిగా చేయుటకే (2) / నా స్తానము నిలిచావు నా శిక్ష భరించావు (2) / నీతిమంతుల సభలో నన్ను నిలబెట్టుచున్నావు / నీకే స్తోత్రము యేసయ్య (2) ||నా యెడల||
నీ చల్లనైన నీడలో నన్ను నివసించనీ ప్రభు / నీ పరిశుద్ధ పాదములే నన్ను తాకనీ ప్రభు (2) / నీ ప్రేమా నా లోనా (2) / ప్రతిక్షణం అనుభవించనీ (2) ||నీ చల్లనైన|| / మట్టి వంటిది నా జీవితం / గాలి పొట్టు వంటిది నా ఆయుషు (2) / పదిలముగా నను పట్టుకొని (2) / మార్చుకుంటివా నీ పోలికలో (2) / మరణ భయమిక లేదంటివి (2) ||నీ చల్లనైన|| / మారా వంటిది నా జీవితం / ఎంతో మదురమైనది నీ వాక్యం (2) / హృదయములో నీ ప్రేమా (2) / కుమ్మరించుమా జుంటి తేనెలా (2) / (ఆహా) మధురం మధురం నా జీవితం (2) ||నీ చల్లనైన|| / అల్పమైనది నా జీవితం / ఎంతో ఘనమైది నీ పిలుపు (2) / నీ సేవలో నే సాగుటకు (2) / నను నింపుమా నీ ఆత్మ శక్తి తో (2) / నే ఆగక సాగెద నీ సేవలో (2) ||నీ చల్లనైన||