తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

Songs by:A C Kinsingar

యేసుతో ఠీవిగాను పోదమా|Yesutho teevigaanu podamaa

యేసుతో ఠీవిగాను పోదమా / అడ్డుగా వచ్చు వైరి గెల్వను / యుద్ధనాదంబుతో బోదము ||యేసుతో|| / రారాజు సైన్యమందు చేరను / ఆ రాజు దివ్య సేవ చేయను (2) / యేసు రాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా (2) / యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో|| / విశ్వాస కవచమును ధరించుచు / ఆ రాజు నాజ్ఞ మదిని నిల్పుచు (2) / అనుదినంబు శక్తిని పొందుచున్నవారమై (2) / యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో|| / శోధనలు మనల చుట్టి వచ్చినా / సాతాను అంబులెన్ని తగిలినా (2) / భయములేదు మనకిక ప్రభువు చెంత నుందుము (2) / యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో|| / ఓ యువతి యువకులారా చేరుడి / శ్రీ యేసురాజు వార్త చాటుడి (2) / లోకమంత ఏకమై యేసునాథు గొల్వను (2) / సాధనంబెవరు నీవు నేనెగా ||యేసుతో||