Join us LIVE via Facebook or YouTube every Sunday at 5:30 PM (NZ) or 9:15 AM (India)
Daily Devotions and Meditation - Read and get encouraged
United Evangelical Church Logo

దేవుని వాక్యం

[ecko_quote source="రోమీయులకు 12:1-2"]కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి[/ecko_quote]

వాక్యధ్యానం

దేవుని సృష్టిలో అత్యంత ప్రధానమైనది మానవుని సృష్టి. దేవుడు మానవుని మూడు విభాగముల (ఆత్మ, మనసు( ప్రాణము) మరియు శరీరము) సమన్వయంలో తన పోలికలో నిర్మించియున్నాడు. దేవుడు తన అపారమైన జ్ఞానం, తెలివి, బుద్ధి, మంచి ఆరోగ్యం మరియు సదా కాలము తనయందు జీవించులగున మానవుని నిర్మాణం జరిగిoచియున్నాడు. దేవుడు మానవుడియందు ప్రత్యేకముగా ఒక బాహు విశేష సుగుణము “తన సొంత చిత్తం” ను ప్రసాదించి, ఇక నరులారా బ్రతుకుడి అనీ సెలవిచ్చి యున్నాడు. కానీ నరులు దేవుడు అనుగ్రహించిన  సొంత చిత్తంను దుర్వినియోగం చేసుకోని నిరాశ మరియు శాంతి లేని జీవితం కొనసాగించుచున్నాడు. మానవుడు అన్ని విషయములో తన ప్రభావం మరియు విజయం చూపించుచున్నాడు కానీ తన మనసును మాత్రం తన ఆధీనములో ఉంచుకోవటానికి అవస్థలు పాడుచున్నాడు.

కొంతమంది జీవితానికి అర్థమే లేదనుకుంటారు, సమాజంలో ఇమడలేక అనవసరమైన భయాలు పెంచుకుంటారు, అన్నింటిమీదా ఆశ వదులుకుని చెప్పలేని విచారంతో మనసు డోలాయమానం అవుతుంటే ఆత్మహత్య ఒక్కటే పరిష్కారం అనుకునేవారు- చాలామందే ఉంటారు. అటువంటివారికి మనసుపై స్వయంనియంత్రణ ఉండదు. అది గాడి తప్పి జీవన గమనంలో చేయవలసినదేమిటో తెలియని దిక్కుతోచని స్థితికి వారిని చేరుస్తుంది. అప్పుడు వారికి ఒక సమస్య నుంచి మరో సమస్య కొత్త పిలకలు వేస్తుంటుంది. మనసు మనిషిపై తన ఆధిపత్యం ప్రదర్శిస్తూనే ఉంటుంది. దాన్ని వదిలించుకోవటం అతడికి ఎప్పుడూ సమస్యే. అది నిలకడ లేనిది. ఎక్కడెక్కడికోపోయి తిరిగి వస్తూ ఉంటుంది. వాయువేగం కొలవడానికి మనిషి సాధనాలు కనిపెట్టగలిగినా, మనోవేగం తెలుసుకునే మార్గాలు కనిపించవు. మనిషి కోరికలు, అవి కలిగించే ప్రేరణలు- అతడి మనసును ఎప్పుడూ మూకుమ్మడిగా ముట్టడిస్తుంటాయి. అతడి వ్యాకులతలకు మూల కారణమయ్యే విషయాలు ఉంటాయి. వాటన్నింటికీ మనసును దూరంగా ఉంచవలసిన ఆవశ్యకతను బైబిల్ గ్రంధము సూటిగా అతడికి వివరించి చెబుతోంది. ఆధ్యాత్మిక సాధనలతో భౌతిక సంబంధాలను సరిచేసుకొనుమని అతనికి వాక్యం చెబుతోంది .

మనసు కల్లోలమైతే మానసిక నియంత్రణ సాధ్యం కాదు. అది మహాత్ములకే కష్టతరమవుతుంది. ఉన్నతమైన లక్ష్యాలకు చేరువలో ఉన్నా, మనసు కల్పించే భౌతిక ప్రలోభాల లోయల్లోకి దిగజారినవారి గాథలెన్నో మనకు బైబిల్ గ్రంధమునందు చూడగలుగుతాము. ఉదాహరణకు ,రాజైన దావీదు తన మనసు కల్పించిన అలజడి మరియు తాను మోహభావనలతో బతేషేబ పట్ల తీసుకున్న నిర్ణయం  ఆయన జీవితములో అది తీరని మచ్చగా మిగిలిపోయిన విషయం మనకు తెలియనిది కాదు (2 సమూయేలు 11:1-5)

దేహాన్ని బుద్ధితో, బుద్ధిని ఆత్మతో అనుసంధానించగల అభ్యాసాల సమాహారాన్ని రూపొందించుకోవాలన్న తపన మనిషికి ఎప్పుడూ ఉంది. దేహంతో చేసే అభ్యాసాలు శారీరక దారుఢ్యాన్ని మెరుగుపరచగలవని, మానసికాభ్యాసాలతో మనుషులు దేవునితో సన్నిహిత సంబంధం కలిగించ కలుగుతాయి. వాటితోపాటు బుద్ధికి క్రమశిక్షణ, నియంత్రణలను ఏకకాలంలో ఇవ్వగల దేవుని వాక్య ధ్యానము ద్వార మన మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందగలుగుతాము. శరీరానుసారులు శరీరవిషయ ములమీద మనస్సు నుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయ ములమీద మనస్సునుంతురు; శరీరాను సారమైన మనస్సు మరణము;ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమా ధానమునై యున్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మ శాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు.కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు.దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు.

మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలోనుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మద్వారా జీవింపజేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు ఋణస్థులము కాము.మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల చావవలసినవారై యుందురు గాని ఆత్మచేత శారీర క్రియ లను చంపినయెడల జీవించెదరు.దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు (రోమా 8)

తరవాత ఏంటి ( మన కర్తవ్యం)

మానసిక ఒత్తిళ్ల నుంచి మనసును తప్పించి దానికి ఒక సమతౌల్యం, ప్రశాంతతలను ప్రసాదించగల సామర్థ్యము కేవలం బైబిల్ గ్రంధ వాక్య ధ్యానమునకే సాధ్యం. పరిశుద్ధాత్మా సమర్పణలో, పర్యవేక్షణలో, శ్రద్ధతో చేసే వాక్య ధ్యానము మరియు ప్రార్థన, ఆధునిక జీవితం తెచ్చే మార్పులు, విసరుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవటమే కాకుండా, ఆత్మతత్వం తెలుసుకోగల సామర్థ్యం, అవకాశమూ మనిషికి దేవుని ద్వార సాధ్యం. మారుతున్న జీవనశైలిలో మనిషి ముఖ్యంగా సాధించవలసింది దేవుని వాక్య ధ్యానము, పరిశుద్ధాత్మానడిపింపు. పరిపూర్ణమైన జీవితాన్ని, సహజమైన పద్ధతిలో గడపగల శక్తి కలిగేది మానసిక నియంత్రణతోనే. ఇహ పర సాధనలకై ఎక్కవలసిన తొలి మెట్టు అదే!

 

Image Source: 

[http://7-themes.com/data_images/out/51/6945861-red-love-heart.jpg]

దేవుని వాక్యం

[ecko_quote source="యోహాను 3:16-17"]దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు  [/ecko_quote]

వాక్యధ్యానం

మానవుడే మహనీయుడు, శక్తియుతుడు, యుక్తిపరుడు మానవుడే మాననీయుడు, మానవుడే మహనీయుడు. మంచిని తలపెట్టిన ఎడల మనిషికద్దు లేదులే, ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే. జీవ కోటి సర్వములో సేశాసతుడు మానవుడే. గ్రహరసులందిగామించి ఘనతా రాల పథము నుంచి, గంగానాతర రోదసిలో ఆకాశ నక్షత్రములు ధాటి, చంద్ర లోకమైన, గ్రహ రాసుల లోకమైన, దేవుడు అనుగ్రహించిన జ్ఞానం వలన జయించి మరల భువికి తిరిగి రాగలిగెనని డాక్టర్ ఆరుద్ర గారు చాల చక్కగా మానవుని శక్తిని మరియు యుక్తిని “మానవుడే మహనీయుడు” అనే పాట ద్వార శ్రోతలను ఆకట్టుకున్నాడు.

మనిషి గురించి మనవాళ్లు చెప్పిన మాటలు ఒక్కోసారి మనకే ఎందుకో నమ్మశక్యం కావు. ‘జంతూనాం నరజన్మ దుర్లభం’ అనేవారు జ్ఞానులు. ‘మానవుడే మహనీయుడు’ అంటారు కవులు. ఇటువంటి మాటలు సామాన్యుల కోసం కాదంటూ, చాలామంది అసలు పట్టించుకోరు. ఇలాంటివి జీవన వాస్తవికతకు దూరమనీ భావిస్తుంటారు! నిజానికి ఆధునిక మానవుడు సాధించిన ప్రగతి అనితర సాధ్యమైంది. ఆర్థిక, సామాజిక రంగాల్లో కనిపిస్తున్న అభివృద్ధి అసాధారణమైంది. ఆ ఫలాలు- ఆధ్యాత్మిక రంగంలో మరియు దేవుని కనుగొనుట అను విషయంలో వెలితి కారణంగా, అవసరమైనంత మేరకు అందుబాటులోకి రాకుండా పోయాయి. అందువల్ల తాను గొప్పవాణ్ని అనే భావన, నమ్మకం అతడి మనసులోకి ఇంకి పోయాయి. ‘ఈక దేవుడే లేడు అనే స్థాయికి దిగజారిపోయాడు.

బైబిల్ గ్రంధమునందు హెబ్రీ 2:6-8 ఈవిధముగా చెప్పబడియున్నది“నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడే పాటివాడు?  నీవు నీకంటే వానిని కొంచెము తక్కువవానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప జేసితివి, నీ చేతి పనులమీద వానికధికారము అనుగ్రహించితివి వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి”. దూతలే ఆశ్చర్యపడేంత ప్రజ్ఞ, బుద్ధిశీలత నేటి మనిషి సొత్తు. సముద్రపు లోతును, గగనపు వైశాల్యాన్ని అతడు లెక్కకట్టగలడు. నీటిలో నివసించగలడు. గాలిలో ఎగరగలడు. చిత్రం ఏమిటంటే ఇన్ని సాధించిన మానవుడు- భూమిమీద బతకలేకపోతున్నాడు! అంటే, ఏది సహజమో దానికి అతడు దూరమవుతున్నాడు. సృష్టి గమనాన్ని అంచనా వేయగలిగే మనిషి- తన మనసు ఏ దారిలో పోతోందో తెలుసుకోలేకపోతున్నాడు. ‘మనసే మానవుడు’ అని చెప్పి నారు లోక జ్ఞానులు. మనసు ఎటు పోతోందో తెలియడం లేదంటే, మనిషి ఎటు పోతున్నాడో తేలడం లేదని అర్థమవుతుంది.

అన్ని రంగములలో ప్రగతి సాధించిన మానవుడు పాపము విషయములో మాత్రం ఇంకా ఓనమాలు నేర్చుకునే స్టితిలోఉన్నడు. పాపము మానవుని శాంతిని సమాధానమును మరియు నెమ్మదిని లేకుండా చేస్తూ వారిని నిరాశతో  ఈ జీవన యానం సాగిoప చేయుచున్నది. మానవుని మనసు అతని అధీనములో లేదు. అతడు పాపమునకు దాసుడు మరియు పాపం పై పాపం సమకూర్చుకొనుచున్నాడు.

ఎందరో మహానుభావులు, సినిమా నటులు, వ్యాపారవేతలు మరియు రాజకీయనేతలు తమ జీవితములలో నెమ్మది కొరవడి ఆత్మహత్యతో తమ జీవితమును ముగించుకొనుచున్నారు. పాపమునకు వచ్చు జీతం మరణము ( రోమ 6:23). దేవునిలో తప్ప మానవుడికి ముక్తి దేనిలో మరి లేదు. ఆధ్యాత్మికత పాత్ర కీలకం అవుతున్నదీ ఇక్కడే! అద్భుత జీవ రసాయనంగా మన పెద్దలు దేవునితో సాంగత్యం మానవుని జీవితముకు పరమార్థం అని పోల్చినారు. మనిషికి మనసుతో చెలిమి పెంచడంలో ఆధ్యాత్మికతది/వాక్యద్యానం ముఖ్య భూమిక. మంచుకు చల్లదనం సహజ గుణం. కాటుకకు నలుపు సహజ లక్షణం. సూర్యుడి చుట్టూ తిరగడం భూమికి నిత్యకృత్యం. అలాగే, మనసుకు చంచలత్వం సహజ లక్షణమని బైబిల్ గ్రంధం చెబుతుంది. కోరికలు దుఃఖానికి కారణాలని తెలిసీ, వాటి వైపు మనసు పరుగులు పెడుతుంది. దుఃఖాన్ని కొనితెచ్చుకుంటుంది. అది చేటు తెస్తుందని వివేకం మనిషిని పదే పదే హెచ్చరిస్తుంది. ఎద్దుకు ముకుతాడులా, ఏనుగుకు అంకుశంలా- చంచలమైన మనసును ఆధ్యాత్మికత మంచి దారికి తెస్తుంది. అందుకే అతడు వివేకవంతుడు కావాలి అని జ్ఞాని అయిన సొలొమోను సామెతలు గ్రంధంలో పలికినాడు. ఆ వివేకం కేవలము క్రీస్తు ద్వారానే సాధ్యం. కేవలము పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే మానవుడు మనసును జయించే మార్గాన్ని పొందగలడు. శక్తిచేత నైనను బలముచేతనై ననుకాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను(జెకర్యా 4:6)

మానవుడే మహనీయుడు, శక్తియుతుడు, యుక్తిపరుడు అయిన తన పాప జీవితం మాత్రం తాను మార్చు కొనలేని శక్తిహీనుడు. జన్మ పాపం మరియు కర్మ పాపము మనువుని వెంటాడుచున్నవి. ఏ మానవుడు తన తోటి మానవుల్ని పాపము నుoఛి విముక్తి కల్పించలేడు. అందుకే దేవాది దేవుడు తానే ఈ లోకములో క్రీస్తు ప్రభువుగా జన్మించి మనువుని పాపముల కొరకు సిలువలో ప్రాణం అర్పించి మానవజాతిని తమ పాపము నుoఛి విడిపించినాడు.

తరవాత ఏంటి ( మన కర్తవ్యం)

అందువలన యేసు ప్రభువు ఒక్కరే ఈ ప్రపంచములో ఈలాగున చెప్పగలిగినాడు ‘ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జను లారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి (మత్తయి 11:28) యేసు ప్రభువు వద్దకు మనం వెళ్ళవలసిన అగత్యం ఏoతేయిన వుంది. యేసు ప్రభువే మనకు దీక్కు.

ఈ ప్రక్రియ అంతటికీ ఆధ్యాత్మిక దృక్పథమే మరియు క్రీస్తు  మూల విరాట్టు. మనిషి సర్వ సమగ్ర ప్రగతి సౌధానికి ఇదే తొలి మెట్టు!

Image Source: 

[http://s.newsweek.com/sites/www.newsweek.com/files/styles/feature/public/2015/03/27/0327scottkelly01.jpg]

దేవుని వాక్యం

[ecko_quote source="హెబ్రీయులకు 12:1"]మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు.  [/ecko_quote]

వాక్యధ్యానం

బైబిల్ గ్రంధం మానవుని జీవితం ఈ ప్రపంచమునందు, ఒక బాటసారి జీవితముగా వర్ణించారు. ఎందరో మేధావులు జీవితాన్ని నిరంతర ప్రయాణంగా అభివర్ణించారు. ఒక ధ్యేయంగాని, లక్ష్యంగాని కనపడనప్పుడు- ‘ఈ ప్రయాణానికి అర్థం ఏమిటి, ఎందుకు చేస్తున్నాం?’ అనిపిస్తుంది. గమ్య స్థానం అన్నది కనిపించనప్పుడు, జీవితం అసలు ప్రయాణం ఎలా అవుతుంది? ఏ ప్రయాణానికైనా గమ్యం అనేది ఉండాలి. పరిణామ క్రమం, కొనసాగింపు లేకుండా జీవితం వృత్తాకారంలో సాగితే- ఆ ప్రయాణం అర్థరహితం. దీర్ఘంగా కొనసాగితే, ఎప్పటికో ఒకప్పటికి యానం చివరి దశకు చేరుకుంటుంది. అది నిరంతర ప్రయాణం అయినప్పుడు, ఆలోచనకు మరియు తర్కానికి అందకుండా పోతుంది. అందుకే మనిషి సత్యాన్ని అన్వేషించాలి. జీవ గ్రంధంనందు అపొస్తలుడైన పౌలుగారు క్రైస్తవ ప్రయాణం వృత్తాకారంలో జరుగే ప్రయాణం కాకుండా యేసు క్రీస్తు వారి వైపు చూస్తూ జరిగించు గొప్ప ప్రయాణంగా వర్ణించారు. యేసు క్రీస్తు వారి వైపు చూస్తూ జరిగించని ప్రయాణం అర్థరహితం మరియు శూన్యం.

ఈ భౌతిక ప్రపంచంలోకి ఎందుకు వచ్చామన్న ప్రశ్న కీలకం. నేర్చుకోవడానికి, జ్ఞానం సంపాదించుకుని ఆ దేవుని సేవలో తరించడానికి వీలు, అవకాశం దొరికాయని కొందరు గుర్తిస్తారు. మరెందరో ఈ యథార్థాన్ని గ్రహించేసరికి, వారి ప్రయాణం పరిసమాప్తం అవుతుంది .ప్రతి ఒక్కరికీ ‘ఇక్కడికి ఎందుకొచ్చాం, ఈ జీవితం ఏమిటి, ఎందుకు...’ లాంటి విషయాలు తెలుసుకోవాలనే తాపత్రయం మరియు జిజ్ఞాస ఉంటుంది. ధ్యానంతో జీవితం మీద దృష్టి సారించి, ప్రయాణంలో ఆనందాన్ని పొందాలి. వర్తమానంలో జీవిస్తూ, పరిశుద్ద ఆత్మ నడిపిoపులో, ఆత్మశోధనతో జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలి. వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకోన బద్దులమైయున్నాము (II కోరి 5:7) నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచు కొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు” (గలతీయులకు 5:16).ఇవి భక్తుడైన పౌలుగారు క్రీస్తు వైపు ప్రయాణించువారికి సెలవిచ్చు జీవపు మాటలు.

క్రీస్తు వారి వైపు చూస్తూ ప్రయాణంలో వేసే ప్రతి అడుగూ ఆనందంతో కూడినదే. మనకు జరగనున్నది తెలియదు. జరిగిపోయినదాని గురించి చింతించీ ప్రయోజనం లేదు. గతం ఒక అనుభవం. భవిష్యత్తుకు అదొక పాఠం. యేసు క్రీస్తు వారు మత్తయి సువార్త అధ్యాయం 6 -26 లో ఈ విధముగా చేప్పియున్నాడు “ అందువలన నేను మీతో చెప్పునదేమనగాఏమి తిందుమో యేమి త్రాగు దుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి; ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించు చున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా?మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు?

మన గమ్యం క్రీస్తు వారి వైపు. జీవితంలో కలలు, లక్ష్యాలు చాలా ముఖ్యమైనవి. గమ్యం లేదని భావిస్తే, ప్రయాణం వృథా అవుతుంది. ఎటువంటి విలువా ఉండదు. అది జీవితంలో ప్రతి అంశంపైనా ప్రభావం చూపుతుంది. జీవన యానం అంటే- వూహ, యథార్థాలు కలిసే సున్నితమైన సమస్థితిని కనుక్కోవడం! మనిషి తన అసంపూర్ణ జ్ఞానం నుంచి, అనిశ్చితమైన పరిస్థితుల నుంచి క్రీస్తు గురించి అనంతమైన పాఠాలు నేర్చుకుంటూ సాగిపోవడమే జీవితం.

ఒక రైల్లోనో, ఓడలోనో చేసే ప్రయాణం లాంటిదే జీవన యాత్ర! మధ్యమధ్య మజిలీలు, మార్గాలు, మలుపులు, ప్రమాదాలు... అనేకం. జన్మించడంతోనే మనిషి ప్రయాణం ప్రారంభమవుతుంది. తల్లిదండ్రులూ మనతోపాటు గమ్యం చేరుకునేదాకా తోడుగా ప్రయాణిస్తారని భావిస్తాం. మధ్యలో ఎక్కడో ఒకచోట వారు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు- తమ జ్ఞాపకాలను మిగిల్చి! కదిలే కాలం మరెందరో ప్రయాణికుల్ని కలుపుతుంది. తోటి ప్రయాణికులంతా జీవితంలో ముఖ్యమైనవారే. తోబుట్టువులు, స్నేహితులు, పిల్లలు... అందరూ. జ్ఞాపకాలను వదిలిపెట్టి, శాశ్వతమైన శూన్యాన్ని నింపి, వెళ్లిపోతారు. ఎవరు ఎప్పుడు ప్రయాణం ముగించి వారి స్థానాల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో కూడా గుర్తుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రయాణంలో సుఖదుఃఖాలు, సంభ్రమాశ్చర్యాలు... ఎన్నో ఉంటాయి. బాధ్యతగా మసలుకోవాల్సిన అవసరం, స్వాగతం పలకడం... వీడ్కోలు చెప్పడం... ఎన్నెన్నో.

ప్రయాణం సుఖప్రదం కావాలంటే, ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవాలి. అందుకే ప్రేమలు, సత్సంబంధాలు అవసరమవుతాయి. అందుకే భక్తుడైన దావీదు కీర్తనల గ్రంథము అధ్యాయం 133 లో ఈ విధముగా సహోదరులు ఐక్యతను వర్ణించినాడు “సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము అది తలమీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలమువలె నుండును. సీయోను కొండలమీదికి దిగి వచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి యున్నాడు".

తరవాత ఏంటి ( మన కర్తవ్యం)

ప్రతి ఒక్కరూ గమ్యం చేరుకోక తప్పదని తెలుసు. చిత్రమేమిటంటే- తమ ప్రయాణం ఎప్పుడు, ఎక్కడ ముగుస్తుందో ఎవరికీ తెలియదు. తెలియనితనంతోనే వారు ప్రయాణిస్తారు. ఈ యానంలో ఎవరూ విస్మరించరాని అంశం ఒకటి ఉంది. ప్రయాణం ముగించి తమ స్థానం విడిచి వెళ్ళేలోపు, తోటి ప్రయాణికుల కోసం/ సహోదరుల కొరకు  మధురమైన జ్ఞాపకాలను కొన్నయినా పదిలపరచాలి. ఎప్పటికప్పుడు ఆత్మపరిశీలనతో ముందుకు సాగితేనే, ఈ గమనం సుగమం కావడంతో పాటు సుఖవంతంగా మారుతుంది!

Image Source: 

[https://pbs.twimg.com/profile_images/467774309503467520/HMy_9pqg.jpeg]

Copyright © 1991-2023 United Evangelical Church Global
Made with love for Jesus Christ of Nazareth
crossmenu