[ecko_quote source="ఎఫెసీయులకు 5:-15-16"]దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి[/ecko_quote]
సమయానికి మించిన అమూల్యమైన ఆస్తి ప్రపంచంలో మరొకటి లేదు. ప్రతి జీవికీ ‘జీవిత కాలం’ అనే సమయం అతడి జన్మ ఆస్తిగా పుట్టుకతోనే లభిస్తుంది. బాల్య, యౌవన, కౌమార, వార్ధక్య దశలు ఉంటాయి. విద్య, వివాహం, సంసారం, వ్యాపకాలు- అన్నీ ఆ నిర్ణీత కాలంలోనే! జీవితంలో ఏది పోగొట్టుకున్నా తిరిగి పొందగల అవకాశం ఉంటుంది. సమయానికి అటువంటిదేమీ లేదు. గతించిన సమయం తిరిగి రాదు. ‘గతం గతః’ అంటారు పెద్దలు. జారిపోయిన క్షణాన్ని తిరిగి పొందడం అసంభవం. అందువల్ల, ధనం కంటే సమయాన్ని మరింత పొదుపుగా వాడుకోవాలి. సద్వినియోగం చేసుకోవాలి. విద్యార్థి దశలో కొందరు చాపల్యంతో ఉంటారు. చదువు కోసం వెచ్చించాల్సిన సమయాన్ని ఇతర పనులతో దుర్వినియోగం చేస్తుంటారు. ఫలితాలు వారికి ఆశాభంగం కలిగిస్తుంటాయి.
మరికొందరు ఉద్యోగం వచ్చేవరకు ఆరాటపడుతుంటారు. ఆ ఆరాటం ఉద్యోగ కర్తవ్య నిర్వహణలో ఉండదు. ఏదో విధంగా ఉద్యోగ కాలాన్ని గడిపేస్తారు. విధులకు హాజరు కంటే, ఏదో ఒక మిషపై పనులు తప్పించుకోవడానికి వారు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. ఫలితంగా ప్రావీణ్యం మందగించి, పదోన్నతులు చేజారిపోతాయి. అప్పుడు ఎంత చింతించినా ప్రయోజనం ఉండదు.
భార్య మోహంలో పడి తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసేవారు, వారిని నిర్దాక్షిణ్యంగా వృద్ధాశ్రమాలకు పంపేవారు మరికొందరుంటారు. భార్యను వేధించి బాధించేవారు, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించేవారు, వ్యసనాలకు బానిసలై సంసారాలను చేజేతులా పాడుచేసుకునేవారు ఇంకా కొందరుంటారు. ఆలోచనతో కాక ఆవేశంతో బతుకు గడిపేవారు, అహంకారులు, నిత్య శంకితులు లోకంలో పలువురు కనిపిస్తారు. ఇతరులు దుఃఖపడుతుంటే చూసి ఆనందం పొందేవారు, అసూయా ద్వేషాలతో ప్రవర్తించేవారు- వీరందరూ సమయాన్ని, దాని విలువను గుర్తించని వ్యక్తులే! జీవితంలో నష్టం జరిగిపోయాక, ఆలస్యంగా పడే పశ్చాత్తాపానికి విలువ లేదు. దానివల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. ప్రవహించిన నీరులాగానే, గతించిన కాలం తిరిగి వెనక్కు రాదు. కాలాగ్నిలో దహనమైన జీవితాలు ఎన్నటికీ చిగురించవు.
మనుషులు తాము వృద్దాప్యములోనికి వెళ్ళుచుండగా తాము ఏవిదముగా జ్ఞానముతో సమయమును వెచ్చించాలని కోరుకుంటారు మరియు అబిలషపడుదురు. మోషే ఈవిధముగా ఆలోచించి కీర్తనలు 9౦ వచనము 10-12 లో ఈ విదముగా తన మనోభావములను వ్యక్త పరిచినాడు “మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధికబలమున్న యెడల ఎనుబది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము.నీ ఆగ్రహబలము ఎంతో ఎవరికి తెలియును? నీకు చెందవలసిన భయముకొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియును? మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము”. క్రమశిక్షణ కలిగినవారు ప్రతి క్షణాన్నీ ప్రణాళికాబద్ధంగా గడుపుతారు. తీరిక ఉండని జీవితాలు వారివి.
దైవాన్ని మనిషి మరేమీ అర్థించనక్కర్లేదు. ‘దేవా నాకు ఇంకేమీ వద్దు. నా కర్తవ్యాన్ని నేను సవ్యంగా నిర్వర్తించే బుద్ధినివ్వు’ అంటే చాలు. ఆయన ఎంతో సంతోషిస్తాడంటారు జ్ఞానులు. అలా అనేందుకే ప్రతి వ్యక్తీ ప్రయత్నించాలి. అప్పుడే అమూల్య సమయాన్ని అతడు సద్వినియోగం చేసుకున్నట్లవుతుంది.
ప్రత్యేక అబినందనులు: జొన్నలగడ్డ రవీందర్ మరియు కే. రవీంద్ర త్రివిక్రమ్
Image Source:
[http://7-themes.com/data_images/out/51/6945861-red-love-heart.jpg]