Join us LIVE via Facebook or YouTube every Sunday at 5:30 PM (NZ) or 9:15 AM (India)
Daily Devotions and Meditation - Read and get encouraged
United Evangelical Church Logo

దేవుని వాక్యం

[ecko_quote source="1 యోహాను 4:7-8"]ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము; ఏలయనగా ప్రేమ దేవునిమూలముగా కలుగుచున్నది; ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు. [/ecko_quote]

వాక్యధ్యానం

అద్భుతమైన మహిమ కలిగిన రెండు బీజాక్షరాల పవిత్ర శబ్దం ‘ప్రేమ’. సకల జీవకోటి మనుగడకూ ఇదే మూలాధారం. ప్రకృతితో మానవుడి సంబంధం ప్రేమతోనే ముడివడి ఉంది. మానవతా వృక్షానికి వేరు వంటిది ప్రేమ. మహోత్తమ మానవ జీవన యాగానికి అది పూర్ణాహుతి వంటిది. బతుకు బడిలో ప్రతి విద్యార్థీ నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ప్రేమభావనే. అది మనిషికి బతుకునిస్తుంది, మెతుకునిస్తుంది, సద్గతికి చేరుస్తుంది, జీవితాన్ని సార్థకం చేస్తుంది. అందుకే దాన్ని ‘ప్రేమసుధ’ అంటారు విజ్ఞులు.

మనిషి సంఘజీవి. సమాజంలో ఉన్నంతవరకు తల్లిదండ్రుల్ని, ఇతర కుటుంబసభ్యుల్ని, సాటివారిని, అలాగే భగవంతుణ్నీ ప్రేమించాల్సిందే. దానివల్లనే సుఖం, శాంతి, స్థిరత్వం లభ్యమవుతాయి. (లూకా 10:27)  ప్రేమ వల్ల హింస దూరమవుతుంది. ద్వేషం, ప్రతీకార వాంఛ వంటి మనోవికారాలకు మనసులో తావు ఉండదు. అప్పుడు ప్రేమ ఆధ్యాత్మిక మార్గాన్వేషణలో, దేవుని చింతనలో లగ్నమవుతుంది(1కోరిం 13:4-7).

వ్యక్తిని దేవుని సన్నిధికి చేర్చే ప్రధాన ద్వారం ప్రేమ ఒక్కటే. అది కుటుంబానికే పరిమితమైతే స్వార్థపూరితం అనిపించుకుంటుంది. మనుషుల్ని ప్రేమించి, వస్తువుల్ని వాడుకోవాలన్నాడు మన ప్రభువు.  వస్తువుల్ని ప్రేమించి, మనుషుల్ని వాడుకుంటున్నారు అనేకులు! పువ్వు మనుషుల్ని చూసి సుగంధమివ్వదు. దానికి అందరూ సమానమే. ఆ సుగంధాన్ని అంతా ఆస్వాదిస్తారు. అలాగే, మనిషి ప్రేమ లోక కల్యాణం కోసం వ్యక్తం కావాలి  ప్రేమ.  అహింసకు పునాది  నాది అనేది పోగొట్టగలిగేదే అసలైన ప్రేమ.

ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు; అమర్యాదగా నడువదు; స్వప్రయో జనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును.  అన్ని టికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును……నేను పిల్లవాడనై యున్నప్పుడు పిల్లవానివలె మాటలాడితిని, పిల్లవానివలె తలంచితిని, పిల్లవానివలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని. (1కోరిం 13:4-11).

‘ప్రేమ అనే రెండక్షరాల మహిమను తెలుసుకోకుంటే, ఎంతటి పాండిత్యమైనా వ్యర్థమే’ అంటాడు కబీర్‌దాసు. ప్రేమ అనేది ఇచ్చేదే కానీ, తీసుకోవాలని కోరుకునేది కాదు. లాభనష్టాల బేరీజును తిరస్కరించే ప్రేమ- మనసును పవిత్రం చేయగలుగుతుంది. ఎదుటివారి మనసుల్నీ నిర్మలం చేసి ఆకట్టుకుంటుంది.

మనుషులపైనే కాదు- విద్యార్జన, జ్ఞానార్జన పైనా; సంస్కృతి సంస్కారాలపైనా ప్రేమ పెంచుకుంటేనే, దానికి పరిపూర్ణత సిద్ధించినట్లవుతుంది. మనిషి ముందు తనను తాను ప్రేమించుకోవాలి. తన శ్రమను, వృత్తిని, తన ప్రవృత్తిలోని చిత్తశుద్ధినీ ప్రేమించగలగాలి. అప్పుడే ప్రేమ ఆత్మవిశ్వాసాన్ని, విశాల దృక్పథాన్ని, దేవుని కుటుంబ భావనను ఆహ్వానించగలుగుతుంది. ఆధ్యాత్మిక కోణంలో ‘ప్రేమే దైవం’ అనే అక్షరసత్యమూ అవగతమవుతుంది. ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము; ఏలయనగా ప్రేమ దేవునిమూలముగా కలుగుచున్నది; ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును.  దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.

తరవాత ఏంటి ( మన కర్తవ్యం)

ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనమొకనినొకడు ప్రేమింప బద్ధులమై యున్నాము.  ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచియుండ లేదు; మన మొకనినొకడు ప్రేమించిన యెడల దేవుడు మనయందు నిలిచియుండును; ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును.  1 యోహాను అధ్యాయం 4-7-12; దేవుడు మిమ్మలిని ఆశీర్వదించును గాక

పాస్టర్ జోనా రవీందర్

మూలం: చిమ్మపూడి రామూర్తి గారికి  నా కృతజ్ఞతలు

Image Source: 

[http://agapea2.com/wp-content/uploads/2012/09/heart-on-door.jpeg]

Scripture

[ecko_quote source="Galatians 6:7"]Do not be deceived; God is not mocked; for whatever a man sows, that he will also reap[/ecko_quote]

[ecko_quote source="Numbers 32:23"]Be certain of this that your sin will catch up to you! [/ecko_quote]

Devotion

I heard a heartbreaking and true story from our dear aunty. A God fearing solo mother went to Rajahmundry town to buy some gold and dresses for her daughter’s marriage. She completed her shopping and got on the last bus to her village which routes through a forest. As she was journeying, a passenger after another got down at their respective villages. Finally, she was left alone on the bus as her village was the last stop and the bus will stay overnight in that village and start again in the morning. While she was getting ready with her baggage, the conductor went to the bus driver and said something. The driver stopped the bus in the middle of this rather dangerous forest. Afraid and worried, she could not understand what was going on. Both driver and conductor came to her, tied her hands, covered her mouth with a piece of cloth and dragged her from the bus. They hauled her deep into the forest and threw her into an old water well. On their return to the bus, they took her gold and possessions including all the money she withdrew.

Following morning, they started their journey back to Rajahmundry with their bus full of passengers. While passing through the same place where they threw the woman into the well, the conductor advised the driver to stop at the same spot to confirm. To check whether the woman was dead in the old well. They both got down for a break at the spot and headed down towards the well. To their surprise, they found the woman still alive and moaning helplessly. She was holding onto the tree branches that grew over time in the middle of the well. Fearing that they'll get caught, the driver and conductor looked around the well and found a heavy rock. They both lifted it aiming to throw into the well in an attempt to kill her. As they lifted that piece of stone, there were two big cobra snakes under it which bite them both. They were instantly dead. After waiting for a while in the middle of nowhere, the passengers went looking for the crew. They came to this old well surprised to find two lifeless bodies. They also heard the moaning of a woman. The passengers rescued her and heard her story.

The woman gave her testimony about how the Lord saved her from snakes and scorpions throughout the night while she was just hanging on to those tree branches. She testified that all through the night snakes crawled all over her body but did not bite her. The Lord protected her and safeguarded her against all the snares. The moral of the story is whatever we sow, surely we will reap. Further, our sins will find us. The crew of the bus got their wages within no time. Don’t be surprised if your wages are not coming forth but surely it will come along with interest. Sin is never worthwhile and not to be played around with. Be sure, your sin will find you out! Moses first preached this warning, but Solomon repeated it in Proverbs 13:6. You cannot get away with sin. It will catch up to you and destroy you. Sinners are going down for sure. They cannot succeed. They will suffer. They think they are alright, but they are heading towards death (Proverbs 14:12; 16:25). You'll never know what hit you.

Joseph and David were both tempted by adultery. Joseph chose righteousness, so the Lord exalted him in Egypt. However, David chose wickedness, so the Lord raised up enemies against him (II Sam 12:10-11). He married Bathsheba and had Solomon, but God chastened him for the rest of his life. You will reap what you sow (Pr 15:9; Ps 34:12-16).

What's next?

Dear ones, you will go on to make choices after you finish this reading. Will you choose righteousness or wickedness? Are you compromising anywhere in your life? Do you enjoy the world or the things in it? Your future is dark without hope if you choose wickedness. Be sure, your sin will find you out. Your future is bright and glorious if you choose righteousness - Let God be true to you in your life.

Image Source: 

[http://www.montourrr.com/Scully/WellA.JPG]

Copyright © 1991-2023 United Evangelical Church Global
Made with love for Jesus Christ of Nazareth
crossmenu